నమ్మకాల బ్రతుకులో....
నమ్మకం లేని మనుషుల మధ్య
నమ్మకం నిలబెట్టాలని ఆరాటపడుతూ
ఆశయాల సాధన లో
అలసి అలసి
ప్రేమను పొందాలని పోరాటం
చేసి చేసి ఓడి ఓడి
బ్రతుకు సంతలో
జీవన వ్యాపారంలో
నష్టాలను నెమరువేసుకుంటూ
నలుగుతు కుములతూ
ఇలా సంసారం నా రంగంలో
ఒక యోధురాలు అయింది మనసు.
మరి అట్టి మనసుకు
విశ్రాంతి ఇచ్చేది ఎవరు ?!
సుఖశాంతులను తెచ్చేది ఎవరు ?!
ఎవరో.... ఎందుకు ఇస్తారు శాంతి
అందరూ అశాంతి లో మునిగిన వారే...
ఎక్కడో ఒకరిద్దరు తేలిన వారు తప్ప.....
అది కూడా అనుమానమే
ఎవరి భోజనం వారే చేయాలి
ఎవరి స్నానం వారే చేయాలి
ఎవరి సంపాదన వారే పొందాలి
ఎవరి ఏడుపు వారే ఏడ్చాలి
అలాగే ఎవరి శాంతిని
వారే పొందాలి
మరి ఎవరు ఇస్తారు శాంతి ?!
అంత తీరిక ఎవరికి ఉంది ?!
మిత్రమా! ఎవరి నమ్మకం వారిది
ఎవరి ఏకాంతం వారిది
ఎవరి తోడు వారిది
నీ తోడే ....... నీకు మిగిలేది
"నీ' అంటున్నానే ఆ ...నీ.. పరమేశ్వరుడే సుమా !
నీవు కోరుకుంటున్నప్పుడు
నీకు శాంతి రావాలి.....
ఈ విద్య ఒక్కటి నేర్చుకో
నీవు ఎన్ని జన్మలెత్తిన కష్టపడవు
ఇక నీవు సాధించాల్సింది ఏమీ లేదు....
హాయిగా నిద్రపో నేస్తమా
పరమేశ్వరుణ్ణి గుర్తు చేసుకుని మరి
కాస్త తోడుగా ఉంచుకో
ఇట్లు మీ మిత్రుడు
కృష్ణదాస్
శుభరాత్రి చెబుతున్నాడు.
No comments:
Post a Comment