తెలంగాణ బిడ్డలకు తెలియజేయునది ఏమనగా
ఈ వీడియోలో KTR గారు మనందరము ఈ
సంవత్సరం ఏమి చెయ్యాలో వివరముగా తెలిపినారు
మనందరము ఈ వీడియోను శ్రద్ధగా చూచి,
విషయాలను అర్థంచేసుకొని ప్రతి ఒక్క తెలంగాణ
బిడ్డకు అర్థమయేటట్లుగా వివరించి, కొట్లాడి
తెచుకున్న మన తెలంగాణను ఈ రెండు జాతీయ
పార్టీల దుర్మార్గుల చేతినుండి తెలంగాణ తల్లిని విడిపించి
కొట్లాడితెచ్చు కొన్న తెలంగాణ ను మళ్ళీ నిలుపుకొని
బంగారు తెలంగాణ ను నిర్మించు కుందాము.
మోసపూరితమైన రెండు జాతీయ పార్టీలు మనల్ని నట్టేట ముంచి
మన మీద స్వారి చేయాలని కుట్రలతో మాయమాటలతో
వంచించి, దగా చేసి, తెలంగాణ బిడ్డలకు తీరని ద్రోహము
చేస్తున్న సమయంలో మన తెలంగాణను మనమే
పాలించుకుందాము, మళ్ళీ బంగారు తెలంగాణను నిర్మించుకొని
భవిష్యత్ తరాలకు బాటలు వేయుదాము .
మనందరము చైతన్యవంతులై ముఖ్యముగా ఇప్పటి
యువతరం భ్రమలను వదలి వాస్తవాలను అర్ధంచేసుకొని ,
మన కళ్లెదుటనే మాయమాటలతో ఓట్లు వేయించుకొని
పూటకొక అబద్దం తో అన్ని వర్గాల వారి హృదయాలను గాయపరుస్తూ
గోస పెడుతున్నది సత్యము కదా!
మన తెలంగాణ బిడ్డలను, రైతన్నలను కాపాడుకుందాము,
యువకులంతా నడుంకట్టి మనకు BRS పార్టీ మాత్రమే
తెలంగాణకు శ్రీరామరక్ష అనే విశ్వాసంతో అందరినీ
చైతన్య పరచి ఈ సంవత్సర కాలం BRS కార్యక్రమాలను
ఊరూరా అమలు పరుచుకుందాము, జై తెలంగాణ.
No comments:
Post a Comment