Tuesday, December 2, 2025

ఆధ్యాత్మిక ఇంజనీర్ #టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) #cell: 9849443752#https://lordofsevenhills.com/

తిరుమలేశుడి విశేషాలపై రచనలు న్యూస్టుడే, ఫిలింనగర్ పేరు: టి.వి.ఆర్.కె.మూర్తి కలం పేరు: విశ్వపతి వయస్సు: 53 ఏళ్లు విద్య: వరంగల్ ఆర్ ఈసీలో ఎంటెక్ గత వృత్తి: ఆల్విన్, ఎం.వి.ఎస్.ఆర్. కంపెనీలో ఇంజినీర్. ప్రస్తుతం: లోగోలు డిజైన్ చేయడం. ప్రవృత్తి: శ్రీనివాసుడిపై ఆధ్యాత్మిక పుస్తకాలు రచన, ఉచిత పంపిణీ. నగరంలోని మోతీనగర్కు చెందిన టి.వి.ఆర్.కె.మూర్తి... శ్రీనివాసుడిపై ఇప్పటికే పది పుస్తకాలు రచించారు. కావాల్సిన వారికి వాటిని ఉచితంగా పం చుతున్నారు. కోరితే సొంత ఖర్చుతో కొరియర్లోనే వాటిని చేరవేయడం ఆయన ఆధ్యాత్మిక ఉదారతకు నిదర్శనం. 'విశ్వపతి' అనే కలం పేరుతో ప్రసిద్ధుడైన ఈయన... వరంగల్ రీజ నల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదివారు. తరువాత ఆల్విన్ కంపెనీ లోను, ఎం. వి. ఎస్. ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలోనూ పలు హోదాల్లో పని చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో సమ్ ఫన్' అనే పేరుతో ప్యాకెట్ కార్టూన్లు వేసేవారు. 1993లో హాబీగా లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించారు. 1998 నుంచి పూర్తి సమయాన్ని వాటి డిజైనింగ్ కే కేటాయిస్తున్నారు. తొలి నుంచి శ్రీనివాసుడిపై ఉన్న భక్తి ప్రపత్తులను ఆయన తన రచనల ద్వారా చాటుకుంటున్నారు. తానే స్వయంగా శ్రీశ్రీనివాస మహత్మ్యం, శ్రీ వెంక టేశ్వర వ్రతకల్పం రచించారు. విదేశీ భక్తుల కోసం ఈ పుస్తకాలను ఇంటర్నెట్లో https://lordofsevenhills.com/ వెబ్సైట్లో ఉంచారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పుస్తకం పూర్తి కాగానే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొదటి ప్రతులను స్వామి హుండీలో సమర్పించడం ఈయన ఆనవాయితీ. ఎందరికైనా... ప్రతి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మూర్తికి దాదాపు రెండు వందలకుపైగా ఉత్తరాలు వస్తుంటాయి. అతనితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కలిసి ఎప్పటికప్పుడు ఆ పుస్తకాలను ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా ఉచితంగా పంపు తారు. ఎంతటి మారుమూల గ్రామాలకైనా ఈ పుస్తకాలను పంపిస్తారు. శ్రీవెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకాలను ఇప్పటివరకు లక్షకు పైగా ఉచితంగా పంచిపెట్టారు. వాటిని పంపేందుకు అయ్యే పోస్టు ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. వీటి ముద్రణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకొన్నారు. తిరుమలేశుడి విశేషాలు చాలా మందికి తెలియవు. అందుకే ఆ విశేషాలతో పుస్తకా లను రచిస్తున్నట్లు మూర్తి తెలిపారు. ఇవి కావాల్సిన వారు టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) ఫ్లాట్ 202, ప్లాట్ నెం. 32. రవి రెసిడెన్సీ, నలంద హైస్కూల్ పక్కన, మోతినగర్ క్రాస్ రోడ్, హైదరాబాద్-500018కు లేదా ఫోన్ : 9849443752 నెంబరులో సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక ఇంజనీర్

నాది నాది అంటావు నరుడా

మాయమయి పోతున్నాడమ్మా - అందెశ్రీ

Monday, December 1, 2025

ఇంతకంటే ఘనమికలేదు by madhu balakrishna

LORD SHIVA mp3 SONGS FREE DOWNLOAD_500 SONGS

http://sundaravignanagrandalayam.blogspot.com/2025/08/lord-shiva-mp3-songs-free-download500.html?m=1 Unable to share lord shiva songs 500 dvd this is main folder please click this links: https://archive.org/details/@sudarshan_reddy330/lists/64/lord-shiva-songs-500-dvd Or T.S.UPLOADS MEGA.NZ. LINK: https://mega.nz/folder/UbxnEaAb#O0ZcC297wXLdA8FeXdNPqQ LORD SHIVA SONGS500DVD link: https://mega.nz/folder/YK4V0L5I#g73pDr_wCX8fMCaSm6mKFw SRISAILAMLO SIVATEJAM LINK: https://mega.nz/folder/VawgXAaL#hGduUCPsJUQK2WCnvXnNZQ

తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:

 తిరుమల దర్శనంపై ఆర్టీసీ AP & TG ప్రకటన:

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా మరియు   తెలంగాణ  ఆర్టీసీ TGRTC  బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం APSRTC & TGRTC బస్సుల్లో రోజుకు 1000 దైవ దర్శనం టిక్కెట్లు జారీ చేయబడ్డాయి.

  ఏపిఎస్‌ఆర్‌టీసీ & తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ సువర్ణావకాశం కల్పించారు.

  ఏపిఎస్‌ఆర్‌టీసీ & టీజీ ఆర్టీసీ బస్సుల్లో తిరుపతికి వెళ్లే ప్రయాణికులు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే  ఏపీ &  తెలంగాణ ఆర్టీసీ లగ్జరీ & లహరి బస్లో దర్శనం టికెట్ పొందవచ్చు.


  ఈ శీఘ్ర దర్శనం ప్రతిరోజూ ఉదయం 11.00 మరియు సాయంత్రం 4.00 గంటలకు నిర్వహించబడుతుంది.

  తిరుమల బస్టాండ్‌కు చేరుకున్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీ సూపర్‌వైజర్లు ప్రయాణికులకు శీఘ్ర దర్శనానికి సహకరిస్తారు.

  కావున తిరుపతికి వెళ్లే ప్రయాణికులు ముందుగా ఆర్టీసీ బస్సుల్లో  దర్శనం టిక్కెట్లు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.   APSRTC & TGSRTC తిరుపతికి రోజూ 650 బస్సులను నడుపుతోంది.   ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం ఉంది.   బెంగళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.


 *చివరి అభ్యర్థన:*

  ఈ పోస్ట్‌ను షేర్ చేయడం మర్చిపోవద్దు.   మీకు ఇది అవసరం లేకపోవచ్చు, కానీ మరెవరికైనా ఇది అవసరం, కాబట్టి దయచేసి షేర్ చేయండి.🙏🏻💐☺️

Wednesday, November 26, 2025

ఇంతకంటే ఘనమిక లేదు

ఇంతకంటే ఘనమిక లేదు

భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి?

భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి? 
భగవంతుణ్ణి మనమా, మనల్ని భగవంతుడా... ఎవర్ని ఎవరు పట్టుకోవాలి? భగవంతుడు మనల్ని పట్టుకోవాలా? భగవంతుణ్ణి మనం పట్టుకోవాలా? ఇందు గలడందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుం డెందెందు వెదికి జూచిన అందందే కలడు..... సర్వాంతర్యామి... ఎక్కడని వెతకగలం? అంతర్యామి... పట్టుకునే శక్తి మనకు ఉందా? భగవంతుణ్ణి మనం పట్టుకోలేం కానీ, భగవంతుడు ఉన్నాడన్నది సత్యం. మనల్ని పట్టుకు నడిపిస్తున్నడన్నది సత్యం. ఆయన మనల్ని పట్టుకునే వున్నాడు, మనల్ని పట్టుకున్న ఆయన్ని గుర్తించడమే ఆధ్యాత్మికత. ఆ సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికే శోధన, సాధన... అని వాట్సప్ లో తనకి బదులిచ్చాను. వెన్వెంటనే తన నుండి ప్రశ్నల పరంపర. ఒక చేతితో సంసారమును, మరో చేతితో భగవంతున్ని పట్టుకోవాలన్న రామకృష్ణ పరమహంస మాటలపై మీ అభిప్రాయం? మనం పట్టుకోలేమనుకుంటే ఆయన ఎందుకు పట్టుకోమని చెప్పినట్లు? త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య కబీర్ తదితరులు భక్తితో పరమాత్మను పట్టుకొని పరమపదించి ముక్తి పొందలేదా? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? శోధన సాధన ఎలా చేయాలి? అర్థమైంది తన మనోస్థితి. ఆ ప్రశ్నలకు నాలో కదలాడే భావనలను తనకి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలా అని, ఓ స్పష్టతకై ఆలోచిస్తూ... ఈలోగా కొందరి మిత్రుల అభిప్రాయం తెలుసుకుంటే బాగుంటుందనిపించి, వార్ని అడిగాను - భగవంతుణ్ణి మనమా...మనల్ని భగవంతుడా... ఎవరు ఎవర్ని పట్టుకోవాలి? అని! 'భగవంతుడు మనల్ని పట్టుకోడు, భగవంతుడునే మనం భక్తి ద్వారా సాధనల ద్వారా పట్టుకోవాలి. అందుకు గురువు అత్యవసరం. భగవంతునికి భక్తునికి వారధిగా గురువు ఉండాల్సిందే' అని కొందరు, 'మనల్ని భగవంతుడు పట్టుకోడు, అవతార పురుషులు, కారణజన్ములు, జ్ఞానుల లాంటివార్నే భగవంతుడు పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా భగవంతుణ్ణి పట్టుకునే అవకాశం మనకి కల్పిస్తాడు'...ఇది మరొకరి భావన. 'ఈ భౌతిక ప్రపంచం ఓ పెద్ద మాయాజాలం. ఈ సంసారం ఓ మహా సముద్రం. లేచిన దగ్గర నుండి పడుకునేంతవరకు పనులు చేయడానికే సమయం సరిపోవడం లేదు. ఈ ప్రాపంచిక ప్రపంచంలో పారమార్ధిక జీవనానికి మనుగడ లేదు. రెండూ భిన్న రహదారులు, భిన్న జీవన విధానాలు. మనం బలహీనులం కాబట్టి మనం దైవాన్ని గానీ, దైవం మనల్ని గానీ పట్టుకోవడం ఎలా సాధ్యమౌతుంది'...ఇది మరొకరి మాట. మా అమ్మాయి (అనూష)ను అడగగా, ఏమాత్రం ఆలోచించకుండా, 'భగవంతుడే మనల్ని పట్టుకు నడిపిస్తున్నాడు. నా జీవితమే చూడు, ఎన్నో మలుపులు...ఊహించనివి, ఆశించనవి... ఏదో శక్తి నన్ను నడిపిస్తుంది. ఆ విశ్వాసంతో నడుస్తున్నాను. అయితే బుద్ధి అనేది మనకుంటుంది కదా, దాని సహాయంతో మన నడత సరిగ్గా ఉండేటట్లు చూసుకుంటే చాలు. భగవంతుణ్ణి పట్టుకునే శక్తి మనకెక్కడిది? భగవంతునికి నచ్చేలా మనముంటే, ఆ పట్టుకునేవాడే ఏదో క్షణాన్న పూర్తిగా తనవైపుకు తిప్పుకుంటాడు. అన్నమయ్య, రామదాసు లాంటివార్ని త్రిప్పుకోలేదా'? అని బదులిచ్చింది. ఇదే ప్రశ్న నా పుత్రున్ని (అనుదీప్)ను అడిగా... 'అమ్మా? అంతా దేవేచ్ఛ. ఆయన నడిపిస్తున్నాడు. ప్రతీది అంగీకరిస్తూ, దైవ స్ఫురణతో మన పనిని మనం ప్రశాంతంగా చేసుకుపోవడమే. దొంగ పోలీసును పట్టుకుంటాడా? పోలీసు దొంగని పట్టుకుంటాడా? ఎవర్ని పట్టుకునేశక్తి ఎవరికున్నట్లు? సింపుల్ లాజిక్'... అంటూ సింపుల్ గా చెప్పాడు. అందరి అభిప్రాయాలు ఆలోచింపజేసేవే. పద్మగారు పశ్నలకు నాకున్న చిరు అవగాహనతో బదులివ్వడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పులుంటే పెద్దలు మన్నించి సరైన అవగాహన కల్పిస్తారని ఆశిస్తున్నాను. భగవంతుడు మనల్ని పట్టుకోడు... ఈ మాటతో నేను ఏకీభవించలేను. ఈ సమస్త సృష్టి సర్వేశ్వరుని సృజనే. భగవంతుని శక్తిచే ఈ జగత్తు నడుస్తుంది. కేనోపనిషత్తులో, అమరత్వాన్ని గురించి చూచాయగా ఎఱిగిన శిష్యుడు ప్రశ్నిస్తాడు - 'ఏ శక్తి మనల్ని నడిపిస్తుందని . కేనేషితం పతతి ప్రేషితం మనః కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః| కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి|| ఎవ్వనిచే మనస్సు విషయాలపై పడుతుంది? ఎవనిచే ప్రేరేపింపబడి ముఖ్య ప్రాణం తన పనులను నిర్వహిస్తుంది? దేనిచే ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాం, వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం? దీనికి గురువుగారు ఏం చెప్తారంటే - శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః| చక్షుషః చక్షురతిముచ్య ధీరాః ప్రేతస్మాత్ లోకాత్ అమృతా భవంతి|| అది ఆత్మ. దాని శక్తిచేతనే చెవి వింటుంది, కన్ను చూస్తుంది, జిహ్వ మాట్లాడుతుంది, మనస్సు గ్రహిస్తుంది, ప్రాణాలు పనిచేస్తాయి. ఈ ఇంద్రియాల నుండి ఆత్మను వేరేగా చూసే ధీరులు, ఈ ఇంద్రియబద్ద లోకంనుండి బైటపడి అమృతత్వాన్ని పొందుతారు. ఈవిధంగా పరమాత్మ శక్తే మనల్ని పట్టుకు నడిపిస్తుందని తెలుస్తుంది. దీనినే శ్రీరామకృష్ణ పరమహంస వారు ఒక విశ్లేషణతో చెప్తారు,

Saturday, November 1, 2025

JAGJIT_SINGH Bhajans 37 folders link#Archive org.

JAGJIT_SINGH Bhajans 37 folders link:












#chaitanya_bhagavad_gita #12th_Chapter_20_slokam#lyricsvideo #telugu_lyrical

 యే తు ధర్మ్యామృత మిదం యథోక్తం పర్యుపాసతే |

శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే.. తీవ మే ప్రియాః ॥ 20॥

యే-తు- ధర్మామృతం- ఇదం-యథా-ఉక్తం-పర్యుపాసతే

శ్రద్ధధానా:-మత్పరమాః-భక్తాః-తే-అతీవ-మే-ప్రియాః

అర్జునా! ఈ ధర్మము అమృత స్వరూపము. నా భక్తులు శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగా భావించి, నేను చెప్పిన ఈ ధర్మాన్ని ఆచరిస్తారు. అందుకే వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులు.

వ్యాఖ్య

ధర్మామృతం

ఇది ధర్మ్యామృతం. ఈ అధ్యాయంలో బోధించ బడింది (ఇదం యథోక్తం) ధర్మ్యామృతము

(ధర్మ్యామృతము). అంటే, ధర్మ్యరూపము మరియు అమృత స్వరూపము అని అర్ధము.

ధర్మము నుండి తొలగనిది, వేరు కానిది కనుక ధర్మ్యం (ధర్మాత్ అనపేతం ధర్మ్యం). ఇది అమృతత్వానికి కారణం కావడం చేత అమృత స్వరూపము (అమృతహేతుత్వాత్). జనన మరణాల నుండి ఉద్ధరిస్తుంది కనుకఇది అమృత స్వరూపము. కనుకనే భక్తి అమృత స్వరూపము అన్నాడు భక్తి సూత్రాలలో నారద మహర్షి (అమృత స్వరూపాచ). భక్తి అమృత స్వరూపము. భగవంతుడు అమృత స్వరూపుడు. భక్తుడు కూడా అమృత రూపుడే.కనుకనే ఈ భక్తియోగం అనే అధ్యాయంలో అమృత వర్షం కురిసింది. అమృత స్వరూపమైన భక్తిని అనుష్టించినవారు అమృత స్వరూపులవుతారు.

భగవంతుని పరమగతిగా భావించి (మత్పరమాః), శ్రద్ధావంతులై( శ్రద్ధధానాః) భక్తి చేసే వారు

భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు (అతీవ ప్రియాః).

ఎవరైతే పరమేశ్వరుని మరొక దాని కొరకు కాకుండా, కేవలం పరమేశ్వరుని కొరకే సేవిస్తారో వారినే “మత్పరములు” అంటున్నాడు భగవంతుడు. కనుక, మరొక అవసర నిమిత్తం కాకుండా మోక్షార్థమే భగవంతుని ఆశ్రయించే పరమ భక్తులు ఉత్తమ శ్రద్ధావంతులై ఉండాలి.

భగవంతుని యందు, భగవంతుని స్వరూపాన్ని ప్రామాణికంగా అందించే శాస్త్రము నందు, ప్రమాణాన్ని సుస్పష్టం చేసే సద్గురువు నందు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉండటమే శ్రద్ధ. శ్రద్ధ గల వారు ధర్మామృతాన్ని పానం చేస్తారు. శ్రద్ధావంతులకే జ్ఞానామృతం ప్రాప్తిస్తుంది (శ్రద్ధావాన్ లభతే జ్ఞానం).

కర్మయోగులు సాధనా రూపమైన భక్తిని ఆచరిస్తారు. జ్ఞానయోగులు సాధ్యరూప భక్తిలో అలరారుతారు. కర్మయోగులు ధర్మాచరణంలో శుద్ధిని పొందుతారు. జ్ఞానయోగులు అమృత సిద్ధిని పొంది శోభిస్తారు. యోగులు ఆచరించే ధర్మము అమృత స్వరూపమైన జ్ఞానానికి హేతువుగా ఉంది.

కనుక కర్మయోగుల ధర్మమును, జ్ఞానయోగుల అమృతమును రెండిటిని కలిపి ఈ అధ్యాయము ధర్మ్యామృతముగా అందించింది. ధర్మ సంబంధమైన ఈ అమృతమే మోక్ష హేతువుగా ఉంది.

ధర్మరూపంగా శోభిస్తూ, అమృతత్వానికి సాధనం కావడం చేత అమృతమైంది. 

అమృతమువలె ఆస్వాదింప బడుటచేత కూడా అమృతమైంది. అక్షర రూపులైన అవ్యక్తోపాసకులు ఆస్వాదించేదీ అమృతమే.

అమృత జ్ఞానం చేత ఏ అద్వేష్టృత్వాది లక్షణాలు శోభిస్తున్నాయో అవి జ్ఞానికి సహజ లక్షణాలే గాని సాధన రూపాలు కావు అని వార్తికాకారుని అభిప్రాయం కూడా.

శ్లో|| ఉత్పన్న ఆత్మావబోధస్య హి అద్వేషృత్వాదయో గుణాః ।

అయత్నతో భవస్త్యేవ న తు సాధన రూపిణః ||

ఆత్మజ్ఞానము కలిగిన మహాత్మునిలో అద్వేష్టృత్వాది లక్షణాలు ప్రయత్నము లేకుండానే శోభిస్తూ ఉన్నాయి. అవి సాధన రూపాలు కావు అన్నది వార్తికము.

అక్షర రూపమైన అవ్యక్తోపాసనను సాగించే జ్ఞానులు భగవంతునికి మిక్కిలి ప్రీతి పాత్రులు. అర్జునా! ఆత్మవిదుడైన భక్తునికి నేను మిక్కిలి ప్రియమైన వాణ్ణి. అతడు కూడా నాకు అత్యంత ప్రియుడు (ప్రియోహి జ్ఞానినో... త్యర్థ మహం స చ మమ ప్రియః - 7 - 17).

అలాగే సగుణారాధకులైన విశ్వరూపోపాసకులు, జ్ఞానశుద్ధి ద్వారా పరమేశ్వరునే పొందుతూ ఉన్నారు. కనుక, అట్టి అనన్య భక్తులు కూడా భగవంతునికి మిక్కిలి ప్రియులు (మద్భక్తః మే ప్రియః : అ. 12- శ్లో. 14,15, 16, 17, 19).

అనన్య భక్తుడికి, జ్ఞానీ భక్తుడికి - ఇద్దరికీ పరమేశ్వరుడే పరమగతి కనుక ఇద్దరూ భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులే(భక్తాః తే అతీవ మే ప్రియాః)

ధర్మ్యామృతం దివ్యంగా కురిసింది. బుద్ధి పాత్రలలో నింపుకున్నాం. ఇక జుర్రడమే మిగిలి ఉంది. ధర్మ్యామృతాన్ని పానం చేసేవాడు భగవంతునికి ఇష్టుడవుతాడు. భగవంతునికి ఇష్టుడైన వానికి మోక్షం ప్రాప్తిస్తుంది. పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రుడైన వానికే మోక్షం లభించకుంటే ఇంకెవరికి లభిస్తుంది?

తస్మాత్ ఇదం ధర్మ్యామృతం ముముక్షుణా యత్నతః అనుష్ఠేయం విష్ణోః ప్రియం పరంధామ జిగమిషుణా ఇతి

వాక్యార్థః - కనుక, ప్రియాతి ప్రియమైన విష్ణుపదమును పొందాలని అభిలషించే ముముక్షువు, ధర్మ్యామృతమైన పరమ భక్తిని అవశ్యము ప్రయత్న పూర్వకంగా అనుష్ఠించాలి అని వాక్యార్థం. ఆచార్యుల వారి ఈ భాష్య వాక్య సందేశముతో భక్తిని విషయముగా కలిగిన భక్తి యోగమును సమాప్తం చేస్తూ ఉన్నాను. ఇంతటితో తత్

పదార్థ స్వరూపమైన మధ్యమ షట్కము సమాప్త మైంది.

ఇతి శ్రీమద్భగవద్గీతా సూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం

యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః

ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీత యందు భక్తియోగమనే  పన్నెండవ అధ్యాయము .


#12th#18to19#chaitanya_bhagavad_gita #12th_Chapter_18to19_slokam#lyricsvideo #telugu_lyrical

సమః శత్రా చ మిత్రే చ తథా మానాపమానయోః ।

శీతోష్ణ సుఖదుఃభేషు సమః సఙ్గవివర్జితః || 18 ||

తుల్యనిన్దాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ |

అనికేతః స్థిరమతి దృక్తిమాన్ మే ప్రియో సర   || 19 ||

సమః-శత్రా-చ-మిత్రే-చ-తథా-మానాపమానయో:

శీతోష్ణ-సంగవివర్ణిత

అర్జునా! నా భక్తునికి శత్రువైనా, మిత్రుడైనా ఒక్కటే. మానావమానాల్ని, శీతోష్ణాలను, సుఖదుఃఖాలను అతడు సమానంగా భావిస్తాడు. అతడు అసంగుడు. నిందాస్తుతులు అతనికి సమానము. అతడు మౌని. లభించిన దానితో తృప్తి చెందేవాడు. తనకంటూ స్థావరము లేనివాడు. నిశ్చల హృదయుడు. అట్టి భక్తుడు నాకు ప్రియుడు.

వ్యాఖ్య

ఈ రెండూ ఏకాన్వయంగల కూట శ్లోకాలు. అందుచేత రెండిటిని కలిపి వ్యాఖ్యానిస్తున్నాను. భక్తుని దశ లక్షణాలను వివరించే ఈ శ్లోకద్వయం ద్వంద్వ పంచకముతో నిండి ఉంది. అవే శత్రుమిత్రులు, మానావమానాలు, శీతోష్ణాలు, సుఃఖదుఃఖాలు, నిందాస్తుతులు. పూర్వాధ్యాయాలలో వీటిని గూర్చి చర్చించుకొని ఉన్నప్పటికీ, సందర్భోచితంగా ఇక్కడ కూడా సంక్షిప్తంగా చెప్పుకుందాం.

శత్రుమిత్రులు

ప్రియమైన వాడు, ఉపకారం చేసేవాడు మిత్రుడు. అప్రియమైన వాడు, అపకారం చేసేవాడు శత్రువు.

కనుక, సాధారణంగా మిత్రుడు చేరువై నపుడు మనస్సులో ప్రియవృత్తి కదిలి సంతోషము, శత్రువు సమీపించి

నపుడు మనస్సులో అప్రియ వృత్తి కదిలి సంతాపము కలుగుతూ ఉంటాయి. వికార హేతువులు ఇలా మనలో

వికారాలను కలిగిస్తూ ఉంటాయి. ఇది వ్యావహారికంగా సర్వులకు ఉండే సాధారణ అనుభవము.

భక్తుడు ఇందుకు విలక్షణంగా ప్రవర్తిస్తాడు. అతనిది వ్యావహారిక దృష్టి కాదు. పారమార్థిక దృష్టి, ఆత్మదృష్టి,

జ్ఞాన స్వరూపమైన భక్తిలో అందాలే గాని, ద్వంద్వాలు తలెత్తవు. ఉపకార అపకారాలు బుద్ధిలో నిలవవు.

జ్ఞానికి ఉపకారం చేసే శక్తి ఎవరి కుంది? అలాగని, అపకారం చేసే సామర్థ్యం ఎవరి కుంది? జ్ఞానికి

పెడితే అది జ్ఞానికి ఉపకారమా? జ్ఞానిని కొడితే అది జ్ఞానికి అపకారమా? జ్ఞాని తినేవాడు కాడు. అలాగే

దెబ్బలు తినేవాడూ కాడు. పెడితే తినే దైనా, కొడితే తినే దైనా దేహమే. ఉపకారమైనా, అపకారమైన దేహానికే.

జ్ఞాని దేహానికి సాక్షిమాత్రమే. కనుక అపకార ఉపకారాలకు, వాటిని ప్రారబ్ధాధీనమైన తన దేహానికి కలిగించిన

శత్రుమిత్రులకు జ్ఞాని సాక్షిమాత్రుడే గాని, జ్ఞానికి శత్రుమిత్రాదులు లేరు. కనుక, శత్రుమిత్రుల యందు జ్ఞాని

సమంగా వర్తిస్తాడు (సమః శచ మిత్రేచ).

ఇక్కడ, మరొక విషయాన్ని కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానిని చాలా మంది శత్రువుగా

భావించవచ్చు. అంతమాత్రాన, జ్ఞానికి శత్రువులు ఉన్నారని భావించడానికి వీలు లేదు. శత్రుత్వ మనేది

జ్ఞానిని శత్రువుగా భావించే దౌర్భాగ్యుల దుష్ట చిత్రాలలో ఉందే గాని, సౌజన్యమూర్తి అయిన జ్ఞాని సమ చిత్రంలో

లేదు. తనను శత్రువుగా భావించే దుష్టులను, తనతో సఖ్యము చేసే మైత్రీ భావం గల సజ్జనులను జ్ఞాని

సమదృష్టితో వీక్షిస్తాడు.

మానవమానాలు

ప్రస్తుత శ్లోకం లోని ద్వంద్వ పంచకములో మానావమానాలు రెండవ జంట. సమ్మానమైనా, అవమాన

మైనా, రెండిటిని జ్ఞాని సమంగా వీక్షిస్తాడు (మానాపమానయోః సమః).

గౌరవాలలో జనులు పొంగి పోవడము, అగౌరవాలలో క్రుంగి పోవడము సాధారణంగా లోకంలో మనం

చూస్తూ ఉంటాము. కానీ, జ్ఞాని ఇందుకు భిన్నంగా ఉంటాడు. తోష విషాద హేతువులు వికారములను

కలిగించడానికి సిద్ధంగా ఉన్నా, తనలో ఏ వికారం లేకుండా సమంగా ఉండేవాడు జ్ఞానీ భక్తుడు. సన్మానాలు,

అవమానాలు మనస్సుకు సంబంధించినవే గాని, జ్ఞానికి సంబంధించినవి కావు. మనస్సు లోని జ్ఞానాజ్ఞానములను

ప్రకాశింప చేసే సాక్షీ చైతన్యము తానై ఉన్నందున, మనస్సుకు సంబంధించిన మానవమానములు జ్ఞానికి

సమానములు. పరస్పర విరుద్ధమైన గౌరవాగౌరవాలలో అతడు సముడు (సమః పూజా పరిభావయోః).

శీతోష్టాలు

శీతోష్ణాలు మూడవ జంట. ఈ విషయంలో కూడా జ్ఞాని సముడు. శీతము అంటే చలి. ఉష్ణము అంటే

వేడి. శీతోష్ణాలు తమ ప్రభావాన్ని దేహంపై చూపుతాయి. దేహమే తామని భావించే దేహాభిమానులను

శీతోష్ణాలు వేధిస్తూ ఉంటాయి. అందుకనే ఉష్ణ ప్రదేశాలలో జీవించే వారు వేసవి కాలంలో వేడిని భరించలేక

శీతల ప్రదేశాలకు విహారార్థం వెళ్తూ ఉంటారు. అలాగే చలికాలంలో దేహానికి సంబంధించిన వస్త్రధారణ

యందు కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. జ్ఞాని దేహం కాదు. దేహం ఉండటానికి ఆధారమైన

ఆత్మచైతన్యమే జ్ఞాని. కనుక శీతమైనా, ఉష్ణమైన దేహాన్ని చలింప చేయ గలవే గాని జ్ఞానిని కదిలించ లేవు.

దేహానికి సంబంధించిన శీతోష్ణాలు, ఆహార పానీయాలు జ్ఞానికి అవసరాలు కావు. తన అస్తిత్వానికి ఆహార

పానీయాదులు, వస్త్ర గృహాదులు అవసరాలు కావు. అవన్నీ ప్రారబ్దాధీన మైన దేహానికే గాని, కర్మాతీతుడైన

తనకు కాదు. కనుక జ్ఞాని ఎలాగైనా ఉండ గలడు. ఎక్కడైనా ఉండ గలడు. ఏది ఉన్నా లేకపోయినా ఉండ

గలడు. అతడు బ్రహ్మ స్వరూపుడు. కనుక, అంతట సమరూపుడై ఉంటాడు.

సుఖదుఃఖాలు

సుఖదుఃఖాలు అనేవి మనో వికారాలు. ఇది నాల్గవ జంట. ఏది సుఖం? ఏది దుఃఖం? అని ప్రశ్న వేయనంత

వరకే సుఖదుఃఖాలు ఉంటాయి. సుఖదుఃఖా అనేవి రాగద్వేషాలపై ఆధారపడి ఉంటాయి. రాగద్వేషాలకు ఎలా

స్థిరత్వము లేదో, రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుఃఖాలకు కూడా స్థిరత్వము లేదు. అవి రాకపోకలు కలిగి

ఉంటాయి. కనుక సుఖదుఃఖాలు అనిత్యాలు. నిత్యమైన, ఆత్మస్వరూప మైన ఆత్మవిదునిలో మనోవికారా లైన

సుఖదుఃఖాలు ఉండ లేవు. మనస్సులో కదిలే సుఖదుఃఖాలకు జ్ఞాని సాక్షిమాత్రుడై ప్రకాశిస్తూ ఉన్నందున,

సుఖదుఃఖాలలో జ్ఞాని సమంగా ఉంటాడు (సమః సుఖదుఃఖేషు).

ఆసంగత్వం

అచ్వయమైన ఆత్మస్వరూపు డైనందున, మరొక దానితో సంగత్వము ఉండే అవకాశము లేనందున,

423

చైతన్య భగవద్గీత

జ్ఞాని అసంగుడు. సంగత్వము లేనివాడు (సంగవర్ణిత). ఆశ్రయం ఉంటేనే సంగత్వం ఉంటుంది. మరొక

దానిపై ఆధార పడితేనే సంగత్వం ఉంటుంది. ఇదంతా దేహాత్మ భావము పైనే ఆధారపడి ఉంటుంది. అసంగాత్మ

యైన జ్ఞానికి దేహం తోనే సంబంధం లేదు, సంగత్వం లేదు. ఇక దేహానికి సంబంధించిన గృహ, వస్త్ర, క్షేత్ర

కళత్రాదులతో సంబంధం ఉంటుందా? అందుకే అతడు అసంగుడు.

యమునా తీరంలో ఒక చిన్న కుటీరాన్ని ఏర్పరచుకొని ఒక సాధు మహాత్ముడు జీవిస్తూ ఉండేవాడు.

ఒకనాడు యమున కెళ్ళి స్నానం చేసి వచ్చే సరికి

ఆయన కుటీరం అగ్ని ప్రమాదానికి గురై కాలిపోతూ ఉంది. ఆ

దృశ్యాన్ని చూస్తూ ఆ సాధువు చిరునవ్వును చిందిస్తూ చిద్విలాసంతో వెలిగి పోతున్నాడు.

అది చూచిన ఒక వ్యక్తి, మహాత్మా! మీ కుటీరం కాలిపోతూ ఉంటే అలా చిరునవ్వుతో చూస్తా రేమిటి?

అని ప్రశ్నించాడు.

'పండు తినబోయే పావకుడు ముందుగా తొక్కను ఎంత ప్రకాశవంతంగా తొలగిస్తున్నాడో చూసి సంబర

పడుతున్నాను' అన్నాడు ఆ సాధువు.

ఎంతటి అసంగత్వం! దేహాన్ని ఆరగించబోయే అగ్నిదేవుడు, దానికి కవచం లాగా ఉన్న కుటీరాన్ని

తొలగిస్తున్నాడు అనే భావన ఎంత అద్భుతము! ఆత్మ అంత అద్భుతము! అలాంటి ఆత్మజ్ఞానిని ఎవరు

స్తుతించ గలరు? ఎవరు నిందించ గలరు? అతడు నిందాస్తుతులనే జంటకవుల కవిత్వానికి చిక్కేవాడు కాడు.

నిందాస్తుతులు

దూషించడం నింద. పొగడటం స్తుతి. ఇవే నిందాస్తుతులు. ద్వంద్వ పంచకంలో ఇది చివరి జంట.

నిందాస్తుతులు మనుషుల మనస్సులను పొంగిస్తూ, క్రుంగదీస్తూ ఉంటాయి. నిందలు అమాంతం మనస్సును

కాల్చేస్తూ ఉంటే, స్తుతులు బుద్ధికి ఊరట నిస్తూ ఉంటాయి. ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. జ్ఞానికి

నిందాస్తుతులు విషాద తోషాలను

కలిగించ లేవు కనుక జ్ఞాని వాటి విషయంలో సమానంగా ఉంటాడు.

తనపై తనకు గౌరవం లేని వారికే పరుల స్తుతులు సుఖా న్నిస్తాయి. అలాగే నిందలు దుఃఖాన్ని

కలిగిస్తాయి. అన్యుల దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు ఆత్మజ్ఞానిని స్పృశించ లేవు.

ఏముంది నిందాస్తుతులలో! నిందలు నిందలూ కావు; స్తుతులు స్తుతులూ కావు. అన్నీ పదలయలే. అక్షర

విన్యాసాలే. వాచారంభాలే. శబ్ద తరంగాలే.

నిందలలో తత్త్యం లేదు కనుక, నిందించే వాడు తడబడుతూ తిడుతూ ఉంటాడు. స్తుతులు వాస్తవాలు

కావు కనుక, ఒక వైపు స్తుతించే వారు స్వరం పెంచి స్తుతిస్తూ ఉన్నా, అందుకొనే వాడు వేదిక మీద తల

దించుకొని తంటాలు పడుతూ ఉంటాడు. ఇలాంటి నిందాస్తుతులు ఆత్మజ్ఞానిని స్పృశిస్తాయా? స్పృశించ

లేవు కనుకనే అతడు నిందాస్తుతులలో సమంగా శోధిస్తారు. గుణదోషాలకు అతీతుడైన ఆత్మవిదుని దోష

కథన రూపమైన నిందలు, గుణ కథన రూపమైన స్తుతులు చేరలేక వెను దిరుగుతాయి.

మౌనము అంటే వాఙ్నయమము. మౌనము కలవాడు మౌనవంతుడు. అంటే వాక్కును నియమించుకున్న

వాడు (మౌనీ మౌనవాన్ సంయతవాక్). వాక్కును నియమించడము అంటే, మాట్లాడటం మానేయడం కాదు.

లేని మూగతనాన్ని కొని తెచ్చుకోవడమూ కాదు. అవసరమైన విషయాన్ని మాట్లాడటము, అది కూడా ఎంత

అవసరమో అంత విషయాన్నే భావగర్భితంగా మాట్లాడటము. ఇదే వాణ్నియమము. అంతేగాని, మాటల్ని మూట

కట్టేసి మనస్సులో మథన పడటం కాదు. మౌనము అనేది మనన శీలత్వం కొరకే. అంతేగాని, మౌనం

424

భక్తియోగము

అలంకారమూ కాదు, ఆభరణమూ కాదు. జ్ఞానికి మౌన మనేది సహజంగా ఉంటుంది. సాధకుడు అతి

వాగుడు తగ్గించుకోవ డానికి, అనర్థాన్ని నివారించుకోవ డానికి మౌనాన్ని అభ్యసించ వలసి ఉంటుంది.

సంతుష్ట చిత్తుడు

ఆశించింది చేతి కందితే జనులు తృప్తి చెందుతూ ఉంటారు. వారి తృప్తి కొన్నిటి మీద ఆధారపడి

ఉంటుంది. అలా గాక, దేనితో నైనా (యేన కేసచిత్) సంతృప్తి చెందే వాడు జ్ఞాని, లేదా భక్తుడు (సంతుష్ట).

దేనితో నైనా సంతృప్తి చెందే వాడు అంటే, ఏది వచ్చినా అసంతృప్తి చెందని వాడు అని అర్థము. అంటే, ఏది

రాకపోయినా సంతోషంగా ఉండేవాడు అని భావము. తన సంతృప్తికి ఏదీ అవసరము లేని వాడు. పదా తానే

సంతృప్తిలో ఉండే వాడు. నిత్య సంతోషి, నిత్యపూర్ణుడు. సముద్రం లాగా తన పూర్ణత్వము, లేదా సంతోషము

దేని పైనా ఆధారపడి లేదు. అలాంటి (యేని కేన చిత్ సంతుష్టు, సంతుష్ట చిత్తుణ్ణి మహాభారతము బ్రాహ్మణుడు

అన్నది. అంటే, బ్రహ్మజ్ఞానముతో నిత్య సంతుష్టుడై ఉండే వాడే బ్రాహ్మణుడు.

యేన కేనచి దాచ్ఛన్నో యేనకేనచి దాశితః ।

యత్ర క్వచన శాయీ స్యాత్ తం దేవా బ్రాహ్మణం విదుః

లభించిన దానితో దేహాన్ని కప్పుకొని, ప్రాప్తించిన దానిని ఆరగించి, ఎక్కడో ఒక చోట శయనించి,

కాలాన్ని వెళ్ళబుచ్చే మహాత్ముడు బ్రాహ్మణుడు అని మహాభారతము-శాంతిపర్వము.

కేతుడు

నికేతము అంటే ఇల్లు, లేదా నివాస స్థానము అని అర్థము. ఇల్లు, లేదా ఆశ్రయము కలవాడు నికేతుడు.

అలా ఆశ్రయము, లేదా ಇಲ್ಲ లేని వాడు అనికేతుడు (నికేతః ఆశ్రయః నివాసః న విద్యతే యస్య సః అనికేతః).

భక్తుడు ఇల్లు లేని వాడు అంటే, భక్తుడైన వానికి ఇల్లంటూ ఉండ కూడదని, అవసర మనకుంటే, అద్దె

కొంపలో నివసించాలని వ్యాఖ్యానించిన ప్రబుద్ధుల ప్రవచనాలు కూడా బాల్యంలో నేను విన్నాను.

ಇಲ್ಲ లేని వాడు అంటే, తన కంటూ ఇల్లు లేని వాడు అని కాదు. తన దంటూ ఇల్లు లేని వాడు అని

అర్థము. మమకారం లేని వాడు. మమ బుద్ధి లేని వాడు.

ఏ ఇంటి యజమాని నైనా ‘ఎవరి దండీ ఈ ఇల్లు' అంటే ఏమి చెబుతాడు? నా దండీ' అంటాడు. అదే

మమ బుద్ధి, నికేతుని బుద్ధి. అది లేని వాడు అనికేతుడు. ఇల్లు లేని వాడు కాదు. 'నా ఇల్లు' అనేది లేని వాడు.

కార్యాలయంలో పని చేస్తాం. అది మన దవుతుందా? కొంతసేపు హోటల్లో కూర్చుంటాం. ఆ హోటల్

మనదా? మన దైతే బిల్లు చెల్లిస్తామా? స్నేహితుల ఇళ్ళల్లో, బంధువుల ఇళ్ళల్లో కొంత కొంత కాలం

గడుపుతాము. కొన్ని గంటలు సినిమా థియేటర్ లో కూర్చుంటాం. అలాగే రోజుకు కొన్ని గంటలు ఇంటిలో

ఉంటాము. ఏది మనది? ఈ ప్రపంచంలో మనది ఎక్కడుంది? మనదే అయితే, మనం పోయేనాడు అది

కూడా మనతో రాదెందుకని? రాకపోతే పోయె! ప్రాణం పోయిన క్షణాన, మనది మనది అని అల్లాడిన ఇల్లు

మనల్నే లోపల ఉంచుకోవ డానికి ఇష్ట పడదు. వెంటనే గుమ్మం దాటించ మంటుంది. ఇది గ్రహించిన భక్తుడు

మమ బుద్ధి లేకుండా జీవిస్తాడు.

భూ ప్రపంచం లోనే నీకు ಇಲ್ಲು లేదని వేదాంతం చెబుతూ ఉంటే, వెన్నెల పురుగులు అమాంతం

అవనిని విడిచి, ఆకాశంలో ఆశ్రయాలు నిర్మించుకోవాలని తహతహ లాడుతున్నాయి. 'ఆలు లేదు - చూలు

లేదు, కొడుకు పేరు ఆదిలింగం'- ఇదీ వరుస. చూలు అంటే గర్భము, లేదా బిడ్డ అని అర్థము.

425

చైతన్య భగవద్గీత

చందమామలో నీళ్ళున్నాయో లేదో నని శాస్త్రజ్ఞులు ఒక వైపు పరిశోధనలు చేస్తూ ఉంటే, మమకార

రాయుళ్ళు మరొక వైపు చంద్రునిలో స్థల సేకరణకు యత్నిస్తూ ఉన్నారు. ఇదే అదను అనుకొని కొందరు

విక్రయించే ప్రయత్నంలో విరామం లేకుండా అలసి పోతున్నారట! ఏం చేద్దాం! మమ బుద్దికి రెక్కలొచ్చాయి.

ప్రస్తుతం అంతరిక్షంలో ఉంది. ఊపిరి ఆడకుండా ప్రాణం అల్లాడుతోంది. అల్లాడే ప్రాణాన్ని చూస్తూ మనస్సు

అస్థిరంగా ఉంది. మమత్వ బుద్ధి ఉన్నంత వరకు స్థిరత్వం ఉండదు. మమత తొలగితేనే స్థిరత.

స్థిరమతి

అస్థిరమైన మతి గల వాడు మందమతి. స్థిరమైన మతి గల వాడు స్థిరమతి. అదే స్థిర బుద్ధి, స్థిర మైనది

ఏదో దాని యందు నిలిచే బుద్ధి. స్థిర మైనది పరబ్రహ్మ మొక్కటే. అట్టి పరబ్రహ్మము నందు స్థిరంగా నిలిచే

బుద్ధి స్థిరబుద్ధి (స్థిరమతిః - స్థిరా పరమార్థ వస్తు విషయా మతిః యస్య సః స్థిరమతిః). స్థిరమైన జ్ఞానము కలిగిన

బుద్ధి. స్థిరమైన ప్రజ్ఞ, స్థితప్రజ్ఞ, అట్టి స్థితప్రజ్ఞుడు భక్తుడే. భక్తుడు తప్పక స్థితప్రజ్ఞు డవుతాడు. అందుచేత

భక్తుడు భగవంతునికి ప్రియుడు (భక్తి మాన్ మే ప్రియః నరః). భక్తి మోక్ష సాధనము అనే విషయంలో సందేహం

అవసరం లేదు. అద్వేష్టాది శ్లోకాలలో చెప్పబడిన ముప్పై ఐదు లక్షణాలు జ్ఞానిలో స్వరూపతః శోభిస్తూ ఉంటాయి.

భక్తులైన కర్మయోగులను అవి సాధ్యరూపంలో అలరిస్తూ ఉంటాయి.

ఈ అధ్యాయ సారము నంతా సింహావలోకనంగా చివరి శ్లోకంలో చెబుతున్నాడు.