Thursday, October 12, 2023
ॐ గీతాసారము శాంతికి మార్గము పూజ్యులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి దివ్య సందేశము
ॐ
గీతాసారము
శాంతికి మార్గము
పూజ్యులు శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారి దివ్య సందేశము
మిత్రమా! ఎందుకు బాధపడుతున్నావు! అయిందేదో అయింది - పోయిందేదో పోయింది.
ఈ లోకానికి వచ్చేటప్పుడు - వట్టిచేతులతో వచ్చావు! పోయేటప్పుడు- లగేజితో పోవాలనుకుంటున్నావు!
అందుకే నీకీ ఆరాటం, అశాంతి. నీవేమి పోగొట్టుకున్నావని విచారిస్తునావు!
నీవేమి తెచ్చావని - నీవు పోగొట్టుకుంటావు? నీవేమి సృష్టించావని - నీకు నష్టం వచ్చింది?
నీవు ఏదైతే ఇచ్చావో - ఇక్కడిదే ఇచ్చావు.
ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా?
రేపు మరొకరి సొంతం కాగలదు.
కావున జరిగేదేదో జరుగక మానదు - అనవసరంగా ఆందోళన పడకు.
ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు.
ఫలితం ఏదైనా దైవ ప్రసాదంగా స్వీకరించు.
కారు లేదని చింతించవద్దు - కాలు వున్నందుకు సంతోషించు.
కోట్లు లేవని చింతించవద్దు - కూటికి వుందిగా! సంతోషించు.
కాలిలో ముల్లుగుచ్చుకున్నదని చింతించవద్దు - కంటిలో గుచ్చుకోలేదని సంతోషించు.
కాలం విలువైనది - రేపు అను దానికి రూపులేదు. మంచిపనులు వాయిదా వేయకు.
అసూయను రూపుమాపు అహంకారాన్ని అణగద్రొక్కు,
హింసను విడనాడు - అహింసను పాటించు.
కోపాన్ని దరిచేర్చకు - ఆవేశంతో ఆలోచించకు.
ఉపకారం చేయలేకపోయినా - అపకారం తలపెట్టకు.
మతిని శుద్ధం చేసేది మతం మానవత్వం లేని మతం మతంకాదు.
దేవుని పూజించు ప్రాణికోట్లకు సహకరించు, తద్వారా భగవదాశీర్వాదంతో
శాంతి నీ వెంట, ఇంట, చెంత వుండగలదు.
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఫోన్: 8919710757
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment