కరుణా సాగర మొరవినలేవా నావ్యథ కనుగొనిరావా
ఓడు బ్రతుకురా తోడైరారా తీరము ననుచేరనీరా
1.ఆమనితలచే కోయిలపిలిచే నాహృది నిన్నేవలచే
మదినిండా నినుకొలిచే ఆమనిపొంగెను
కోయిలపాడెను క్రుంగెను నామదికుమిలి
2.నింగినేల రెండుగవున్నా నేలనువిడువదు
నింగి కడుపున దాచును ఒంగి
నీవు నేను ఒకటిగ వున్నా యెడబాటే బ్రతుకంతా
3.నిలవదు దేహము ఆగదు ప్రాణము కాలము సాచును
కరము మరణము తీర్చును రుణము రగిలిన మదితో
పగిలిన యెదతో మనగలనా నిను మరచీ
No comments:
Post a Comment