శ్రీ స్వామి సుందర చైతన్యానంద (ఆంగ్లము : Swami Sundara Chaitanyananda) అఖిలాంద్ర దేశంలో తమ గంభీర ఉపన్యాసములద్వారా, విశేష గ్రంథ రచనల ద్వారా, సుమధుర సంకీర్తనలు ద్వారా లక్షలాది భక్త జన హృదయాలలో జ్ఞానజ్యోతులను వెలగించిన మహా మనీషి, సంప్రదాయ మహర్షి, ఆర్ష సంస్కృతి పునర్వైభవానికి పిలుపు నిఛ్ఛి, అరవై యేడు సంవత్సరాల జీవిత కాలములో నలబై రెండు సంవత్సరాలు భక్త జన సంక్షేమానికి వినియోగించిన అనుభవ వేదాంత ప్రవక్త, ఆర్శవిజ్ఞాన కంటీరవము, మంజులాంమృత భాషనంతో మహిని పులకింప చేసిన మహాయతి, వేద వేదాంత శాస్త్ర పురాణములు ఇతిహాసములు యొక్క రహస్యార్థ సారమతి, అపర సరస్వతి, ఆదర్ష పుణ్యమూర్తి, అజ్ఞాన చీకట్లు ముసిరిన హృదయాలలో నిత్య వెలుగులను నింపి, సనాతన ధర్మ జీవన బాటను అద్భుతంగా తీర్చి దిద్దుతూ, వక్తగా, రచయితగా, గాయకుడుగా, బోధకుడుగా, గురువుగా అశేష భక్త జనుల హృదయ మందిరాలలో ప్రతిష్ఠింప బడి ఉన్న పరమ పూజ్య గురుదేవులు, శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు
నందానందం హృది కుర్వంతం కృష్ణo మేఘ వినీల రుచిం
దత్వాఽఽనందం రచనాబిః స్వీయాబిః స్వాన్ రామయంత మజం
శ్రీ చైతన్యద్యుతి సందీప్తం భాగ్యం భక్త జనాత్మ్య మిదం
స్వామీ శ్రీ సుందర చైతన్యానందo సత్య సురూప మయే ll.
విషయ సూచిక
ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ సమారోహంసవరించు
శ్రోత్రీయ బ్రాహ్మణిష్టా గరిష్ఠులైన పూజ్య గురుదేవుల యాభై వసంతాల పవిత్ర ఆధ్యాత్మిక సేవా ప్రస్థానం (1966 నుండి 2016వరకు) ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవ౦ గా కీర్తించబడింది. ఈ సందర్భంగా మార్చి 19 వ తేదీన భారత ప్రభుత్వ తపాలా శాఖ వారు ఈ సేవా స్వర్ణోత్సవం సందర్భంగా పూజ్య గురుదేవుల ఫోటో ముద్రించిన ప్రత్యేక పోస్టల్ కవరును [1]. పోస్టల్ స్టాంపును వేదికపై ఘనంగా విడుదల చేయడం జరిగింది. ఈ అరుదైన ప్రతిష్ఠాత్మక కార్యక్రమమును శ్రీ సోమసుందరం, ఐ.పి.ఎస్., డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్ వారు ఆవిష్కరించారు. ఈ ఈవెంటు పూజ్య గురుదేవుల ఆధ్యాత్మిక సేవా స్వర్ణోత్సవానికి మకుటాయమానమై భాసించింది. భక్తులఆనందానికి అవధి లేకుండా పోయింది.
శ్రీ చైతన్య జయ ధ్వజంసవరించు
సర్వజిత్ - మార్గ శీర్ష శ్రీ :
గీతా భాగావతో దయః
జ్ఞానబ్రహ్మార్ష సర్వజ్ఞ
శ్రీ చైతన్య జయ ద్వజః
- శ్రీ సర్వజిత్ వైకుంఠ ఏకాదశి గీతా జయంతీ పరోషస్సున 1947 డిసెంబరు 25 తేది ఉదయం 4: 30 గంటలకు శ్రీ స్వామీజీ వారి ఆవిర్భావ విజయం
- శ్రీ ప్లవంగ వినాయక చతుర్ది 1967 డిసెంబరు 8 వ తేది శ్రీ స్వామిజీ వారి వాగావిష్కార విజయం.
- శ్రీ రక్తాక్షీ కార్తీక కృష్ణ తృతీయ తదియ 1984 నవంబరు 11 వ తేదీ స్వామీజీ వారి ఆశ్రమ స్వీకార విజయం.
- శ్రీక్రోధి ఆశ్వయుజ కృష్ణ తృతీయ చవితి 1985 నవంబరు 14 వ తేదీ స్వామీజీ వారి స్థాపించిన ఆధ్యాత్మిక మాస పత్రిక గిరిధారి ప్రసార విజయం.
- శ్రీ ప్రజాపతి మార్గశీర్ష శుక్ల షష్ఠి 1991 డిసెంబరు 12 వ తేదీ శ్రీ స్వామీజీ వారి జ్ఞాన శతక్రతు విజయం.
- శ్రీ ఈశ్వర మార్గశీర్ష శుక్ల సప్తమి 1997 డిసెంబరు 6 వ తేదీ శ్రీ స్వామీజీ వారి భాగ్యనగర ఆశ్రమ ప్రవేశ విజయం.
- శ్రీ చిత్రభాను జ్యేశ్ట శుక్ల నవమి 2002 జూన్ 19 వ తేదీ శ్రీ స్వామీజీ వారి విశాఖపట్టణ సాగరగట్టాణ తీరాశ్రమ స్తాపాన విజయం.
- శ్రీ వికృతి నామ చైత్ర శుక్ల అష్టమి 2010 మార్చి 23 వ తేదీ శ్రీ స్వామీజీ వారి చైతన్య భగవద్గీతా గ్రంథ ఆవిష్కార విజయం.
ఇంకా
- ఆయుత పత్ర (10,000) రచనాపూర్తి విజయం.
- పంచ సహస్ర (5,000) ప్రవచనా పూర్తి విజయం.
ఇది శ్రీ సుందర చైతన్యానంద స్వామి విజయానుభూతి.
అవతార విషేషంసవరించు
1947 వ సంవత్సరం 25 వ తేదీన నెల్లూరు జిల్లా లోని కట్టుబడిపాళ్ళెం అనే గ్రామంలో బ్రహ్మముహూర్తమున వైష్ణవ కుటుంబంలో శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారు జన్మించారు. అది పరమాత్మ స్వరూపమైన మార్గశీర్ష మాసం. ఆ రోజే వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి కలసి రావడం విషేషం కాదు, వైభవం.సనాతన ధర్మ పునర్వైభవ ప్రాప్తికి సంకేతం.
శ్రీ పెరుంబుదూరు వేంకట శే షాచార్యులు, రంగనాయకమ్మ అను పుణ్య దంపతులకి శ్రీ స్వామిజీ అష్టమ గర్భ సంజాతులుగా జన్మించారు. స్వామీజీ పూర్వాశ్రమం పేరు శ్రీ సుందర రాజన్. స్వామీజీ పూర్వీకులు ద్రవిడ దేశము వారు. వీరి తాత గారు బాల్య దశలో ఆంధ్ర దేశము నకి వచ్చారు. చంగల్పట్టు జిల్లా లోని రామానుజాచార్యుల వారి జన్మ స్థలమైన శ్రీ పెరుంబుదూరు వీరి స్వగ్రామము.[2] స్వామి వారి తాతలు విద్వత్తు గల వారై గ్రంథ రచనలు చేసారు. దేవాలయార్చకులుగా, తోమాల సేవకులుగా, గాయకులుగా, భక్తీ ప్రబంధ రచయితలుగా వన్నెకెక్కారు. కవిబ్రహ్మ తిక్కన, కవయిత్రి మొల్ల, జ్ఞాన బ్రహ్మ సుందర చైతన్యులు - ఈ ముగ్గురు సింహపురి సీమలో విరబూసిన జ్ఞాన మందారాలని స్తుతిస్తూ నెల్లూరు పట్టణంలో 15-6-1994 నుండి 24-6-1994 వరకు పూజ్య స్వామీజీ నిర్వహించిన 118 వ జ్ఞాన యజ్ఞంలో పూజ్య స్వామీజీకి కనకాభిషేకం చేసిన సందర్భంలో సింహ పురీయులు ఒక తెలుగు పద్య మందారమును సమర్పించుకుని యున్నారు.
శ్రీ స్వామీజీ బి.ఏ.లిట్ పట్టమును పొందారు. పూప వయస్సు నందే వేదాంత గ్రంథాలను రాత్రింబవళ్ళు అధ్యయనం చేశారు. చేతిలో వేదాంత గ్రంథం లేకుండా బాల్యంలో వారు ఎవ్వరికీ కనిపించి ఉండరు. నిత్యమూ నియమముతో ధ్యానము చేసే వారు. భక్తుల కోర్కె మేరకు యజ్ఞాలు ప్రారంభించారు. ప్రతి యజ్ఞంలో వేలాది సంఖ్యలో వచ్చి భక్తులు వారి ఉపన్యాసాలను ఆలకించేవారు, ఆలకిస్తూ ఉన్నారు.స్వామి వారిది అద్వైత మార్గము. ఆ విషయంలో రాజీ పడకుండా భోదిస్తారు. జ్ఞానమును భక్తిని సమన్వయం చేసి బోధించడం వారి ప్రత్యేకత.
సనాతన ధర్మ మహా సాగరంలో ఉత్తుంగ తరంగాలై ఎగసిన భక్తుల, మహాత్ముల గాథలు చదువుతూ 'ఇవి నిజాలా!' అని సందేహించే ఆధునిక యువతరానికి చక్కని సమాధానం చెబుతుంది స్వామివారి సున్నిత హృదయం, అద్భుత జీవన విధానం.
ఆధ్యాత్మిక స్పూర్తి - అఖండ కీర్తిసవరించు
నలబై ఐదు సంవత్సరాల క్రితం మాట ... సత్య సందేశాలు అందించే సద్గ్రంథాలు అక్కడక్కడా లభించేవి. కాని అవి ఎక్కువ శాతం పండితుల బరువు పెంచడానికి మాత్రమే ఉపయోగ పడేవి. సంమజానికి వాటిని అందిద్దా మనే పుణ్యాత్ములు ఉన్నా, సామాన్యుని స్థాయిని గ్రహించలేని కారణంగా అట్టి ఎందరివో ప్రయత్నాలు వ్యర్ధంగా మిగిలి పోయాయి. అభివ్రుది చెందిన విజ్ఞాన శాస్త్రం నూతన తరాన్ని వినూత్న సంశాయాలలో ముంచెత్తింది. అర్ధం లేని భౌతిక వాదం, జనులలో పెరిగిన అలసత్వం - అన్నీ కలసి జీవితాన్ని శోభింప చేసే విజ్ఞాన మణులను వెదజల్లే వేదాంత శాస్త్రాన్ని కాలక్షేపం స్థాయికి దించాయి. ఇవన్ని పరిశీలించిన శ్రీ స్వామీజీ యువ హృదయం తీవ్రంగా స్పందించింది. జ్ఞాన ప్రకాశంలో రమించ వలసిన భారతదేశము 'దరిద్రులున్న సంపన్న దేశం' గా మిగలడం ఆ చిన్న హృదయం భరించలేక పోయింది. కుదురుగా, మెలకువతో, అద్వితీయ సామాజిక స్ఫూర్తితో, అవగాహనతో అక్కడ ఓ బృహద్యత్నానికి అంకురార్పణ జరిగింది. సామాన్యునికి, సత్యానికి మద్య నున్న అగాధాన్ని పూడ్చదానికి ఆ చిన్నారి చేతులు నడుం బిగించాయి.నేటి ఈ సుందర చైతన్య మహూద్యమాన్ని మన ముందుంచాయి. ఈ రోజు సమాజానికి ఏమి అందించాలన్న విషయంలో సుస్పష్టమైన, శాస్త్రీయ మైన అవగాహనతో ప్రారంభమై, అందుకు భగవత్ కృపను తోడూ చేసుకుని రేయింబవళ్ళు శ్రీ స్వామీజీ శ్రమించారు. ఇంతింతై ఎదిగి ఎదిగి గుండె గుండెను మీటుతూ మహా ప్రవాహమై - దరిచేరిన వారిని పావనులను గావించే పుణ్య సలిలగా, మహోన్నత జ్ఞాన గంగా నది ప్రవాహంగా నేడు సుందర మహోద్యమం రూపు దాల్చింది. శ్రీ స్వామీజీ మాటల మద్య మానవ జీవితానికి అర్ధం చెబుతూ, పాటలలో తియ్యగా పరమార్ధాన్ని విప్పి చూపుతూ, నిర్జీవ మౌతున్న సమాజానికి జీవిత పాటాలను సహనంతో నేర్పుతూ 220 కు పైగా జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి, తెలుగు లోను, ఆంగ్లం లోను 150 కి పైగా గ్రంథాలను రచించారు.[3]. 200 సత్సంగ శాఖలను రాష్ట్ర మంతటా నెలకొల్పి, 22 మురళీ కృష్ణ ఆలయాలను, ధ్యాన మందిరాలను నిర్మించి, 'గిరిధారి' మాసపత్రిక ద్వారా, టి.వి ద్వారా ఆడియో, వీడియో సి.డి. ల ద్వారా ఆర్శవిద్యా వాణిని జనావళికి వినిపిస్తూ ఉన్నారు.
ఆశ్రమ స్వీకారంసవరించు
గత నలభై ఐదు సంవత్సరాలుగా పూజ్య స్వామీజీ ఆంధ్రావనికి అందించిన ఆధ్యాత్మిక సేవలు అనితర సాధ్యాలు. ఈ మహత్తర కార్యక్రమానికి కార్యక్షేత్ర౦గా 1984, మే 11 వ తేది ప్రథమంగా ధవళేశ్వరం సుందర చైతన్యాశ్రమం రూపు దిద్దుకుంది. తపోవనంలా, సుందర నందనోద్యాన వనంలా శోభించే ఆశ్రమం వేలాది సత్సంగీయులకు, భక్తులకు స్ఫూర్తి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందింది. అద్భుత కలాఖండమైన ఈ ఆశ్రమం ప్రస్తుతం వానప్రస్తాశ్రమంగా అలరారుతోంది.
1997 డిసెంబరు 25 వ తేది అభినవ బృందావనంలా హైదరాబాదు సుందర చైతన్యాశ్రమం వెలసింది. దేశ విదేశాలలో ఆధ్యాత్మిక సేవలందించేందుకు శ్రీ స్వామీజీ వారికి ఆశ్రమం ఒక పనిముట్టు అయ్యంది. పచ్చని పొలాల మధ్య పదమూడు ఎకరాల స్తలంలో నిర్మింపబడిన ఈ సువిశాలమైన ఆశ్రమం భక్తుల పాలిటి కల్పవృక్షం. భక్తీ భావ పరంపరలో ముంచెత్తే 76 అడుగుల ఎత్తు గల మురళీకృష్ణ భగవానుని దేవాలయం, నిరంతరం గురుదేవుల జ్ఞాన ప్రభోదాలతో ప్రతిధ్వనించే శృతి మందిరం - ఈ రెండూ భక్తీ జ్ఞాన సమ్మెలన మైన సుందర చైతన్య మహోధ్యమానికి సంకేతాలు.
2002 జూన్ 19 వ తేదిన విశాఖ సాగర తీరంలో మూడవది అయిన సుందర చైతన్య ఆశ్రమం నెలకొల్ప బడింది.
చైతన్య శంఖారావంసవరించు
ఒక యుద్ధం రణరంగంలో ముగిసి ఉండవచ్చు. కాని, అది పుట్టింది మాత్రం ఒక వ్యక్తీ మనస్సులోనే. మార్పు అనేది సంభవమైతే అది సమాజంలో కాదు. వ్యక్తిలో. వ్యక్తీ ఆలోచనా సరళి మారితే వ్యక్తీ ప్రవర్తనలో పరివర్తన వస్తుంది. మనసు మారితేనే మనుగడ మారుతుంది. మనిషి మారితేనే సమాజం మారుతుంది.
- సుందర సత్సంగాలు:
మాది గొప్ప అంటే మాది గొప్ప అంటూ అందించ బడే పలు రకాల సిద్ధాంతాలు, సందేశాలు, మాయలు, మహిమలు మనిషిని చుట్టూ ముట్టి మభ్య పెడుతున్న ఈ గందరగోల పరిస్థితులలో, అసలు ఇన్ని రకాల ఆలోచనల వెనుక ఉన్న ఆంతర్య మేమిటి? అది పుట్టిన దెక్కడి నుంచి? పయనిస్తున్నదే తీరానికి? ఇంతకీ మోక్ష మంటే ఏమిటి? దానికి మార్గ మేది? - ఇటు వంటి సహజ, అనివార్య సంశాయాలకు సహేతుకమైన సశాస్త్రీయ మైన సమాదానాలను అందిస్తూ, విచారము - అనుభవం - ప్రచారము - ఈ మూడింటిని లక్ష్యంగా కలిగిన సుందర సత్సంగాలను శ్రీ స్వామీజీ నలభై సంవత్సరాల క్రితమే రాష్ట్ర మంతటా నెలకొల్పారు. కుల తత్వాల నదిగమించి, 'నాకులం ఒక్కటే - సానుకూలం' అనే గురుదేవుని అడుగు జాడల్లో ఏకాత్మ భావంతో సత్సంగీయులు అందరూ జీవిస్తున్నారు.
- చైతన్య మాతృ మండలి:
గృహలక్ష్మి గృహానికి మూల స్తంభం వంటిది. ఆ కల్పవల్లి నీడ లోనే గృహం సుఖ శాంతులతో వర్ధిల్లుతుంది. బిడ్డలకు అమ్మ ఒడి ప్రథమ పాఠశాల. అవగాహన గల తల్లులు ఇంటిని శాంతి నిలయం చేయగలరన్న మహోన్నత ఆశయంతో ముందు మాతృ మూర్తులను తీర్చిదిద్దే ప్రయత్నంలో శ్రీ స్వామీజీ అన్నీ గ్రామాలలో, పట్టణాలలో ' చైతన్య మాతృమండలి' స్థాపించారు. నిత్యమూ స్వాధ్యాయంతో, సేవా కార్యక్రమాలతో చైతన్య మాతృ మండలి ఆదర్శవంతంగా శోభిస్తూ ఉంది.
- చైతన్య యువత:
గోడ యొక్క గొప్పదనం ఇటుకల మీద ఆధారపది ఉన్నట్లు, దేశం యొక్క స్థిరత, ఐక్యత, పురోగతి యువత మీద ఆధారపడి ఉంది అన్న ఉధేశంతో 'చైతన్య యువత' విభాగాన్ని శ్రీ స్వామీజీ నెలకొల్పి యువతను క్రమశిక్షణ తో, సంయమనంతో, ఆధ్యాత్మిక స్ఫూర్తితో ప్రగతి మార్గంలో నడుపుతూ ఉన్నారు. ప్రేమతో, సేవా భావంతో, చరిస్తూ, వారు నమ్ముకున్న విలువల వైశిష్ట్యాన్ని, ఈ మార్గంలో వారికి కలిగిన సంతృప్తిని అందరికి అందించాలని పూర్ణ హృదయంతో ప్రయత్నించడమే కర్తవ్యంగా పెట్టుకుని, భావి తరాలకు ఆశాజ్యోతులుగా చైతన్య యువత వేల్గొందుతూ ఉంది.
- గిరిధారి:
సర్వ వేదాంత సారంగా, సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారంగా, అనుభావామ్రుతాన్ని చక్కటి వ్యాసాల రూపంలో, కథల రోపంలో కవితల రూపంలో, ప్రశ్నోత్తర రూపంలో నింపి శ్రీ స్వామీజీ గత 30 సంవత్సరాలుగా ఆంధ్రావనికి మాసం మాసం అందిస్తున్న అమృత కలషమే గిరిధారి. 20,000 మంది జీవిత సభ్యులను కలిగిన గిరిధారి ఆధ్యాత్మిక మాస పత్రిక పాటకులను నిత్యమూ చైతన్యవంతం చేస్తూ, ఆనంద తీరాలకు తరలిస్తూ ఉంది.
పశ్చిమంలో యతి పాదంసవరించు
అమెరికా లోని భక్తుల ఆహ్వానాన్ని మన్నించి పూజ్య స్వామీజీ 1998 సెప్టెంబరులో ప్రథమంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేశం పర్యటించారు. సనాతన ధర్మ వైభవ కేతనాన్ని అమెరికాలో రెపరెప లాడిచారు. చికాగో, డెట్రాయిట్, క్లీవ్ లాండ్, ఓర్లాండో మొదలైన నగరాలలో జ్ఞాన యజ్ఞాలను నిర్వహించి జనులను అమితంగా స్పందింప జేశారు. Chicago people get another Vivekananda-like saint to expound Advaita Vedanta. Saint thrills Chicago Audience with mesmerizing philosophical discourses. 'Advaita Vedanta delivered to the common man in simple, palatable terms' - అనే శీర్షికలతో దిన పత్రికలు పూజ్య స్వామీజీని శ్లాఘించాయి.
అపురూప విజ్ఞాన వేది - అసమాన కవితా పయోనిధిసవరించు
శ్రీ స్వామివారు తమ దివ్య భోదలతో అలసి పయిన జీవితాలలో ఆశలతలను పుయిస్తున్నారు. అలుపెరుగని కంటంతో మానవాళి అశాంతి తలుపులను ముయిస్తున్నారు. వారికున్న శ్రావ్యమైన గాత్రం, గాన గంధర్వ వైదుష్యం అసమానము, అనితర సాధ్యము. మైదానాలనే తరగతి గదులుగా మార్చి లోతైన ఉపనిషత్ రహస్యాలను శ్రోతల హృదయాలలో నిక్షిప్తం చేసిన ఖ్యాతి శ్రీ స్వామీజిది. వారి భాష, బాణీ అద్భుతం. వారి గళం, కలం ఒక దానితో మరొకటి పోటీ పడుతూ ఉంటాయి. ఒక దాని నొకటి మించి పోవాలనుకుంటాయి. వేదాంత సాహితీ ప్రపంచలో, తాత్విక భావనా జగత్తులో పూజ్య స్వామీజీ అపురూప విజ్ఞాన వేది. అసమాన కవితా పయోనిధి. గహన మైన వేదాంత విషయాలను సాధారణ మానవులకు కూడా అవలీలగా, అవలోకగా అందించే వారి అసాధారణ వైదుష్యం అనుపమానము, అద్భుతము. అసామాన్య పాండిత్యంతో, అద్భుత రచనా పటిమతో శతాధిక గ్రంథాలతో పాటు చైతన్య మహాభాగవతం, చైతన్య రామాయణము, చైతన్య మహా భారతము గ్రంథాలను ప్రసాదించిన శ్రీ సుందర చైతన్యనందుల వారు ఎప్పుడెప్పుడా అని ఆంధ్ర ప్రజానీకం ఎదురు చూసిన చైతన్య భగవద్గీత గ్రంథాన్ని వాసుదేవుని ప్రసాదంగా సహృదయ లోకానికి సమర్పించి సంతర్పణం చేశారు. వేదమాతకు నీరాజనాలు అర్పించారు.
చైతన్య దీప్తిసవరించు
జ్ఞానబ్రహ్మ, ఆర్షవిద్యా వాచస్పతి, సత్సంగ ప్రచారమణి, సనాతన ధర్మ దీపికాధారి అను పలు బిరుదులతో యోగి పుంగవులు పూజ్య స్వామీజీని సత్కరించగా, సువర్ణ కంటాభరనాలతో, హస్త కంకనాలతో, సువర్ణ కిరీటాలతో, గండ పెండేర పురస్కారాలతో, గజారోహనలతో, కనకాభిషేకాలతో వివిధ ప్రాంతాలలోని భక్తులు, అనేక సంస్కృతిక, ఆధ్యాత్మిక సంస్థలు వీరిని సంన్మానించాయి. శ్రీ స్వామీ వారిది ప్రచారోద్యమం. జన జాగరనోధ్యమం, సమాజాన్ని చైతన్యవంతం చేసే సుందర సమోద్యమం. ఆయన భారతీయ విజ్ఞాన సర్వస్వం. సనాతన ధర్మ పరిమళం. ఆర్శ సంస్కృతీ సభ్యతల భాండాగారం. ఇది ఆంధ్రుల భాగ్యం. శ్రీ స్వామీ సుందర చైతన్యానందుల వారికి మనం సమకాలీనులం కావడం మన పురాకృత పుణ్యఫల విశేషం. శ్రీ స్వామి వారి అవిరళ కృషికి, త్యాగ జీవనానికి, జనులపై వారికున్న అపార కృపకి ఆంధ్రావని భక్తీ భావంతో, కృతజ్ఞతా భావంతో శిరమోడ్చి, కరములు జోడించి స్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఉంది.
గ్రంథములుసవరించు
- చైతన్య భగవద్గీత
- చైతన్య భాగవతం
- చైతన్య మహాభారతం
- చైతన్య రామాయణం
- చైతన్య పాంచజన్యం
- చంద్రభాగాతరంగాలు
- విష్ణు సహస్రనామం
- శ్రీ కృష్ణ కర్ణామృతం
- నిత్యసాధన చైతన్యం
- చైతన్య భగవద్గీత (చిన్న సైజు)
- అపరోక్షానుభుతి
- అయితే విను
- ఆత్మా విద్యా విలాసం
- ఆనంద లహరి
- ఆనంద తీరాలు
- ఆత్మభోద
- అధ్వైతానుభుతి
- అవధూత గీత
- భాస్కర శతకం
- భజనావలి
- భజ గోవిందం
- బాలముకుందం
- బ్రహ్మ సూత్ర దీపిక
- చైతన్య లేఖలు - 3
- చైతన్య సమీరాలు
- చైతన్య భావ సుమాలు
- చైతన్య ప్రసంగాలు
- చైతన్య గీతికలు
- దాశరథీ శతకం
- ధన్యాష్టకం
- ద్వాదశ జ్యోతిర్లింగములు
- ఈశావాస్యోపనిషత్తు
- గురు గీత
- గీతాంజలి
- గోపీ హృదయం
- జగద్గుర్వష్టకం
- జ్ఞానదేవ్ అభంగాలు
- జీవన్ముక్త గీత
- హరివిల్లు
- కీర్తనాంజలి
- కృష్ణ లీలలు
- కభీర్ గీతావళి
- కేనోపనిషత్తు
- కృష్ణకథా గానము
- లక్ష్మీనృసింహ స్తోత్రము
- మలయ మారుతం
- మహిష్మతిలో శంకరయతి
- ముండకోపనిషత్తు
- ముక్తికోపనిషత్తు
- మువ్వల సవ్వడి
- ముకుంద మాల
- నరసింహ శతకం
- నారద గాన రామాయణము
- న్యాయ దీపిక
- నారాయణ స్మరణం
- నిర్వాణశట్ట్కం
- నిగ్రహం
- నిర్గుణ మానస పూజ; సదాచారం
- పురుషసూక్తం
- పూజావిధానం
- ప్రపంచసారము
- పండుగలు - ప్రాశస్త్యము
- ప్రభోద సుదాకరము; వేదాంతడిండిమ౦
- ప్రశ్నోత్తర రత్నమాలికా
- ప్రశ్నోపనిషత్తు
- ప్రాతః స్మరణ స్తోత్రం
- రామ గీత
- రామజోగి చిట్కాలు
- శ్రీ రుద్రమ్
- సాధువాక్యం
- సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు
- సుందర సంపాదకీయాలు - 1
- సుందర సంపాదకీయాలు - 2
- సుందర పారిజాతాలు
- సనాతన స్రవంతి
- సంక్షిప్త రామాయణము
- స్వామియే శరణం అయ్యప్ప
- సాధన సోపానాలు
- సాధన పంచకం
- సుందర మందారాలు
- శ్రీ రామ అష్టోత్తర శతనామ స్తోత్రం
- శివ గీత
- శివ స్తోత్రం
- శివ దర్శనం
- శ్రీ కాళహస్తీశ్వర శతకం
- సువర్ణమాలా స్తుతి
- శతశ్లోకి
- స్వాత్మ ప్రకాశికా
- శివానంద లహరి
- షట్పదీస్తోత్రం; సారతత్వోపదేశం
- కనకథారా స్తోత్రం
- శ్రీ శంకరచార్యస్వామి జీవితము
- శివాపరాధ క్షమాపణ స్తోత్రం
- శివ మహిమ్నః స్తోత్రం
- సౌందర్య లహరి
- తత్వ బోధ
- విజ్ఞాన నౌక
- విజ్ఞాన కదంబం
- వేదాంత పంచదశి
- వేదాంత వెన్నెల
- వేమన యోగి
- వ్యాస ప్రసాదం
- విభూతి పండ్లు
- విచారబిందు ఉపనిషత్తు
- వేదాంతసార ఉపనిషత్తు
- యోగాసారోపనిషత్తు
- యక్షప్రశ్నలు
- జీవన సత్యాలు
ఆశ్రమములుసవరించు
- సుందర చైతన్యాశ్రమం దవలైశ్వరం, రాజమహేంద్రవరం.
- సుందర చైతన్యాశ్రమం దు౦డిగల్, హైదరాబాద్.
- సుందర చైతన్యాశ్రమం విశాఖపట్నం.
మూలాలుసవరించు
- ↑ Sagi Srinivas Raju. "Special Cover on 50 years of Spiritual Journey of H. H. Swami Sundara Chaitanyanandaji Maharaj – 19th March 2016". Retrieved 2016-10-13.
No comments:
Post a Comment