Wednesday, October 28, 2026
BALAKRISHNA INTERNET ARCHIVE ORG. 52 VIDEOS PLAYLIST LINK
INTERNET ARCHIVE ORG. 52 VIDEOS PLAYLIST LINK:
https://archive.org/details/@sundarachitanyam_ysreddy?query=PRINTEREST
Monday, October 26, 2026
#bhagavadgita#yesudas#bhagavadgita#12th_Chapter#swami_sundara_Chaitanyananda
Saturday, October 24, 2026
Friday, October 23, 2026
యువ చైతన్యం FACE BOOK స్వామిజీ వీడియోస్ playlist లింక్
యువ చైతన్యం FACE BOOK స్వామిజీ వీడియోస్ playlist లింక్:
https://archive.org/details/@sudarshan_reddy330/lists/115/swamiji-video-clipsసుందర చైతన్యానంద Telugu wiki:
సుందర చైతన్యానంద రచనలు Telugu wiki:
# స్వరాంజలి # telugu wiki pdf# videos links
Tuesday, October 20, 2026
నిడదవోలు సర్వేశ్వరరావు#అయ్యప్ప గీత రచయిత # గానం_DR K J Yesudas
నిడదవోలు సర్వేశ్వరరావు
| నిడదవోలు సర్వేశ్వరరావు | |
|---|---|
| జననం | నిడదవోలు సర్వేశ్వరరావు 1932, ఫిబ్రవరి 10 ఇచ్ఛాపురం, శ్రీకాకుళం జిల్లా |
| మరణం | 1994 జనవరి 10 |
| వృత్తి | Telugu Lecturer ;గేయరచయిత, సాహితీవేత్త |
| మతం | హిందూ |
| భార్య / భర్త | శ్రీమతి మహలక్ష్మి |
| పిల్లలు | విలానీ ,లవలీ |
నిడదవోలు సర్వేశ్వరరావు (జ: 1932 - మ: 1994) తెలుగు భక్తిగీతాల రచయిత. స్వామి అయ్యప్ప, రాఘవేంద్ర స్వామిలను కీర్తిస్తూ రచించిన వీరి గీతాలు ప్రముఖ గాయకులచేత కీర్తించబడి, ప్రజాదరణ పొందినవి.
జీవిత సంగ్రహం
నిడదవోలు సర్వేశ్వరరావు; ప్రముఖ రచయిత నిడుదవోలు వేంకటరావు గారి కుమారుడు; వీరు హైదరాబాదు లో నివసిస్తున్నారు. వీరు 1932 ఫిబ్రవరి 10 తీదీన జన్మించారు; మరియు 1994 జనవరి 10 తేదీన పరమపదించారు. వీరి జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా లోని ఇఛ్ఛాపురం. చిన్ననాటి పాఠశాలలో విద్యాభ్యాసం : విజయనగరం, కాకినాడ, మద్రాసు లలో జరిగింది; కళాశాల విద్యాభ్యాసం: మద్రాసు . వీరు ఎ.సి. కాలేజ్, గుంటూరు (1954-55); ప్రాచ్యలిఖిత అముద్రిత గ్రంధాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం; (1958-58); వివేక వర్ధినీ కళాశాల లలో పనిచేశారు.
అయ్యప్ప గీత రచన ప్రస్తానం
1983లో కె.జె.ఏసుదాసు గారు అయ్యప్పస్వామి భక్తిగీతాలు వ్రాయటానికి సర్వేశ్వరరావు గారిని ట్రివేండ్రం పిలిపించారు. వ్యవధి ఎక్కువ లేనందువల్ల విమానంలో రమ్మని రెండు రోజులలో పాటలు పూర్తి చెయ్యాలని చెప్పారు. ఏసుదాసు గారిచ్చిన బాణీలకు పాటలు వ్రాశారు. అప్పటివరకు సర్వేశ్వరరావు గారికి అయ్యప్పస్వామిని గూర్చి ఏమీ తెలీదు. అయినా పాటలు రమణీయంగా వ్రాయటం గమనించి 'అయ్యప్ప దయా, పూర్వజన్మ సుకృతం ఉండటం వల్లనే మీరిలా వ్రాయగలిగారు' అనిమెచ్చుకున్నారు. అప్పుడు అయ్యప్పస్వామి దీక్షలో ఉన్నారు. మొదటిసారి సర్వేశ్వరరావు గారి పాటలు ఏసుదాసు పాడి రికార్డు చేస్తున్నప్పుడు సర్వేశ్వరరావు గారికి అంతవరకు తెలియని అయ్యప్పస్వామి మీద అచంచలమైన భక్తివిశ్వాసాలు ఏర్పడ్డాయి. ప్రతి సంవత్సరం అయ్యప్పస్వామి దీక్ష తీసుకుని అయ్యప్పస్వామిని దర్శించుకునేవారు సర్వేశ్వరరావు గారు. గొప్ప గీతరచయిత కావాలని వారి నాన్నగారు కళాప్రపూర్ణ శ్రీ నిడుదవోలు వేంకటరావు గారు సర్వేశ్వరరావు గారిని గురించి శతకంలో ఇలా అన్నారు.. ఆ సమరీతి తాను వెలుగొందు ఎమేసియునయ్యెతా వాసిని గాంచినాడును వాగ్గరిమంబు తెలుంగునన్ నుప న్యాసకు డౌచు గేయరచనాఢ్యుడునై తనరారె పాటలం ఆ సరి లేని రీతి ప్రజలందరు మెచ్చగ వేంకటేశ్వరా ఇది నిజ కావటం అయ్యప్పస్వామి దయవల్లనే చిన్ననాటినుండి హిందీ ట్యూన్లకి తెలుగు పాటలు వ్రాయటం చేశారు. ఈ అయ్యప్పస్వామి భక్తిగీతాలతో వెలుగులోకి వచ్చినారు. దాశరథిగారి 'మాట్లాడని మల్లెమొగ్గ'. విద్వాన్ విశ్వంగారి పెన్నేటి పాటలో 'అదే పెన్నీ అదే పెన్న "గేయాలకి వారు కూర్చిన బాణీలు ఎందరో గానం చేశారు. వారికి సంగీతం రాదు. గొప్ప సంగీత దర్శకుణ్ణి కావాలని చిన్ననాటి నుండి ప్రగాఢ కాంక్ష. అది భక్తి గీతరచనా వ్యాసంగంగా పరిణమించడం. శ్రీ సుదర్శనరెడ్డిగారు స్థాపించిన స్వరాంజలి (భక్తి సంగీత ఆర్కెష్త్రా)https://archive.org/details/swaranjali-very-latest తరపున సర్వశ్రీ డి. సుబ్బారాయుడు, పి.వి. సుబ్బారావు, పి. బాల కామేశ్వరరావు మున్నగు మధుర గాయకులు వీరి పాటలు ఎన్నో చోటలపాడి శ్రోతలను ఆనందింప జేస్తున్నారు. సర్వేశ్వరరావు గారి అన్నయ్య సుందరేశ్వర రావు గారి సందేశం: చిరంజీవి సర్వానికి ఆశీస్సులు.. నీ పారిజీతమాల చదివాను. ఒడలు పులకించింది. నేత్రాలు అర్ధనిమిలితాలయ్యాయి. వీనులకు క్యాసెట్లు విందుచేశాయి. మేను పరవశించింది. శబరి గిరిశ ధ్యానాభ్యాసవశీకృతమైన నీమనసరస్సు నుండి అచ్చివిల్లిన భక్తి భావతరంగాలే నీగేయాలు. అది భక్తి రసాయనం. గేయ రచనా శిల్పివి. గేస్తురాలు మహలక్ష్మి శ్రీమతి, ధీమతి, గానం ఆమెది గీతం నీది. పరిమళము చెడదు నీకృతి నిరతము అయ్యప్ప పదార్చనీయులకు మనోహరమగు, దివినుండి మహాధరణిని కృష్ణుడు నిలిపిన దామముకతనన్ నీకృతి హిమకరజ్యోతి. మకరజ్యోతి స్వామియే శరణం 14.11.93, హైద్రాబాద్ సుందరేశ్వర రావు. అన్నయ్య..
ప్రముఖుల అభిప్రాయాలు
- 1. Padmashree Dr. K.J Yesudas: For the devotional Service of Lord Ayyappa my great writer Nidadavolu Sarweshwara Rao is so keen on starting a Valuable Makara Jyothi Trust and with that he is releasing a valuable book entitled “Parijatha Mala”[1] May God Lord Ayyappa bless him & his family for his devotional Venture. your’s …. కె.జె.ఏసుదాసు
- 2. Being a devotee of Lord Ayyappa, I am happy that Sri Sarveswara Rao is bringing out a book entitled 'Parijathamala' (Devotional Songs on Lord Ayyappa). May Lord Ayyappa shower his blessings on him and his family. Madras, 11-11-93. Sd./ జయసుధ
- 3.నిడదవోలు సర్వేశ్వరరావు ..అయ్యప్ప గీత రచయిత, తెలుగు అనువాదం రచయిత కూడ.
ఇతర సాహిత్య రచనలు
1. "బి.పియర్సన్ డెమొక్రసీ ఇన్ వరల్డ్ పోలిటిక్స్" తెలుగు అనువాదం 2. "క్రాస్" క్రైస్తవ మత గ్రంథానికి తెలుగు అనువాదం 3. రేడియో ప్రసంగాలు 4. గీత రచనలు: పారిజాతమాల (అయ్యప్ప భక్తి గీతమంజరి)
క్యాసట్లయిన గీత రచనలు
1. వాల్యూం-2. "అయ్యప్పస్వామి భక్తి గీతాలు" గానం: డాక్టర్ జేసుదాసు; 2 వాల్యూం-9 "అయ్యప్పస్వామి భక్తి గీతాలు" గానం: డాక్టర్ జేసుదాసు; 3. అయ్యా అయ్యా అయ్యప్పా గానం: నాగూర్ బాబు గారు (మనూ); 4. "శ్రీ రాఘవేంద్ర గీతామృతం" గానం: శ్రీమతి ఎస్. జానకి; 5. గానం: శ్రీమతి ఎస్. జానకి “నమో గణేశా" గానం : శ్రీమతి శోభారాజు, శ్రీ డి. సుబ్బారాయుడు; 6. "గజపయ్యా రావయ్య". గానం: శ్రీ డి. సుబ్బారాయుడు, శ్రీ వి. అవతార లక్ష్మి; 7. “గణపతి సదాస్మరామి" గానం : శ్రీ పారుపల్లి రంగనాథ్, శ్రీ డి. సుబ్బారాయుడు, శ్రీమతి వి అవతార లక్ష్మి; 8. గానం: శ్రీ డి. సుబ్బారాయుడు, శ్రీమతి శశికళ, శ్రీమతి శారద, కుమారి మణిశర్మ మొ॥; 9. శరణ తరంగిణి గానం: డాక్టర్ జేసుదాసు
కుటుంబం
నిడదవోలు సర్వేశ్వరరావు గారి తండ్రి నిడుదవోలు వేంకటరావు, వారికి ఐదుగురు కుమార్లు, ఇద్దరు కూతుళ్లు. జ్యేష్ణకుమారుడు శివసుందరేశ్వరరావు మరియు మనుమరాండ్రలో జయసుధ చలనచిత్రరంగంలో తారాస్థాయి నందుకొంది. నిడదవోలు సర్వేశ్వరరావుగారు జయసుధ కు స్వయానా మేనమామ . సర్వేశ్వరరావు గారికి ఇద్దరు కూతుర్లు పెద్ద అల్లుడు Income tax officer గా చేసే వారు.నిడదవోలు సర్వేశ్వరరావు గారు స్వరాంజలి సంస్థ కు Advisor గా ఉంటూ కార్యక్రమాలలో పాల్గొనేవారు. సర్వేశ్వరరావు గారి శ్రీమతి మహలక్ష్మి గారు స్వరాంజలి కార్యక్రమం లో భజనలు గానం చేసేవారు, మరియు సుందర సత్సంగ కార్యక్రమము లో భజనలు పాడేవారు.
మూలాలు
- “Parijatha Mala” May God Lord Ayyappa bless him & his family for his devotional Venture. your’s …. కె.జె.ఏసుదాసు
- 1. Parijatamaala Ayyappa Songs Book: https://archive.org/details/parijatamala-ayyappa-devotional-songs-dr-kjyesudas/page/n69/mode/2up
- 2. నిడదవోలు సర్వేశ్వరరావు With Padmashree Dr K J Yesudas Photos: https://archive.org/details/with-padmashree-dr-k-j-yesudas-photos
- 3. Dr K J Yesudas Ayyppa songs full: https://archive.org/details/@sudarshan_reddy330/lists/29/nidadavolu-sarveswar-rao
- ************************************************************************
Monday, October 19, 2026
#DEVAPATI_SUBBARAYUDU#MELODY_SONGS#SWARANJALI_MUSIC_GROUP#Yedavalli_Sudarshan_Reddy
#DEVAPATI_SUBBARAYUDU
#MELODY_SONGS#Internet Archive Playlist:
https://archive.org/details/@telugudevotionalswaranjali/lists/1/devapati_subbarayudu
Sunday, October 18, 2026
vamshi krishna gajula#books#Internet Archives Playlist Link
vamshi krishna gajula#books#Internet Archives Playlist Link:
https://archive.org/details/@telugudevotionalswaranjali/lists/9/vamshi-krishna-gajula
















