Wednesday, September 30, 2026

NITYA PRARTHANA SLOKAMULU - 7 DAYS#swami_sundara_chaitanyananda

Internet Archives Playlist Link: https://archive.org/details/@sudarshan_reddy330/lists/118/nityamangalam
https://hindudevotionalswaranjali.blogspot.com/2022/09/blog-post.html 

https://www.dailymotion.com/sudarshan-reddy/videos https://telugudevotionalswaranjali.blogspot.com/2022/09/our-daily-motion-channel-videos.htmlసాధకులు,భక్తులు,ఆత్మబంధువులకు తెలియజేయునది యేమనగా భక్తి సాధకులకు ఉపయుక్తమైన 

melody bhajanalu ప్రతి ఒక్కరికి అందించాలని మా సంకల్పము మేము భక్తి సేవ మాత్రమే చేస్తున్నాము ఎలాంటి commercial activity /Advt. amounts ఆశించకుండా భగవంతుని సేవగా మాత్రమే ఏంతో  శ్రమతో  వీడియోలు చేసి upload చేసి మన గురువులు అందించిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి చేర్చే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. మేము భగవతుని,సద్గురువులను ధ్యానిస్తూ భగవంతుని సేవమాత్రమే చేస్తున్నాము. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయుచున్నాము . మీరు ఓపికతొ links save చెసికొని పెట్టుకొనగలరు, మీకు కావలసిన భక్తి  గీతాలు request ను coments లో తెలుపండి - సాధకులం - senior citizen team

NARAYANA STOTRAM శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన ఆది శంకరాచార్య - గానం : స్వామి సుందర చైతన్యానంద

NARAYANA STOTRAM శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన ఆది శంకరాచార్య - గానం : స్వామి సుందర చైతన్యానంద శ్రీ నారాయణ స్తోత్రమ్ - జగద్గురు శ్రీమచ్ఛంకరాచార్యః నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే ధ్రువపద ॥నారాయణ|| కరుణా పారావార వరుణాలయ గంభీర ॥నారాయణ|| నవ నీరద సంకాశ కృతకలికల్మష నాశన ॥నారాయణ|| యమునాతీర విహార ధృత కౌస్తుభమణి హార ॥నారాయణ|| పీతాంబరపరిధాన సురకళ్యాణ నిధాన ॥నారాయణ|| మంజుల గుంజాభూష మాయా మానుషవేష ॥నారాయణ|| రాధాధరమధుర రసిక రజనీకుల తిలక ॥నారాయణ|| మురళీగానవినోద వేదస్తుత భూపాద ॥నారాయణ|| వారిజ భూషా భరణ రాజీవ రుక్మిణీ రమణ ॥నారాయణ|| బర్హి నిబర్హాపీడ నటనాటక ఫణిక్రీడ ॥నారాయణ|| జలరుహ దళనిభ నేత్ర జగదారంభక సూత్ర ॥నారాయణ|| పాతక రజనీచర సంహార కరుణాలయ మా ముద్దర॥నారాయణ॥ 10॥ అఘ బక క్షయ కంసారే కేశవ కృష్ణ మురారే ॥నారాయణ॥ 11 హాటకనిభ పీతాంబర అభయం కురు మే మావర॥నారాయణ॥ 12 దశరథరాజ కుమార దానవమదసంహార ॥నారాయణ॥ గోవర్ధనగిరి రమణ గోపీ మానస హరణ ॥నారాయణ॥ సరయూతీర విహార సజ్జన ఋషి మందార ॥నారాయణ॥ విశ్వామిత్ర మఖత్రా వివిధపరా సుచరిత్రా ॥నారాయణ॥ ధ్వజ వజ్రాంకుశపాద ధరణీసుత సహమోద ॥నారాయణ॥ జనకసుతా ప్రతిపాల జయ జయ సంస్మృతిలీల ॥నారాయణ॥ దశరథ వాగ్దృతిభార దండకవన సంచార ॥నారాయణ॥ ముష్టిక చాణూర సంహార మునిమానసవిహార ॥నారాయణ॥ వాలి నిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య ॥నారాయణ॥ మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర ॥నారాయణ॥॥ 22 జలనిధి బంధన ధీర రావణకంఠవిదార ॥నారాయణ॥ తాటక మర్దన రామ నటగుణ వివిధ ధనాఢ్య ॥నారాయణ॥ గౌతమపత్నీ పూజన కరుణా ఘనావలోకన ॥నారాయణ॥ సంభ్రమసీతాకా(హా)ర సాకేతపుర విహార ॥నారాయణ॥ అచలోద్ధృతి చంచత్కర భక్తానుగ్రహ తత్పర ॥నారాయణ॥ నై గమగానమనో వినోద రక్షిత సుప్రహ్లాద ॥నారాయణ॥ భారతయతివర శంకర నానామృతవచనాంతరా ॥నారాయణ॥

Monday, September 28, 2026

Chaitanya Bhagavad Geetha Pravachan by Sadhguru Swami Sundara Chaitanyananda #Internet Archives Links#View or dowload or share

  

Sunday, September 27, 2026

మానవాళిపై ఏఐ ప్రభావం ఎలా? #నమస్తే తెలంగాణ#27-09-2026






















నమస్తే తెలంగాణ www.ntnews.com E-PAPER బాపూజీ జయంతి 27-09-2026 మానవాళిపై ఏఐ ప్రభావం ఎలా? 
(వ్యాసకర్త బెంగళూరులోని ఐఐఎస్ లో ఆచార్యుడు. ఇటీవల తరగతి గదిలో విద్యార్థులతో చేసిన సంభాషణ సారాంశం) 
ప్రపంచంలో ఏం జరుగుతున్నదో మీరంతా గమనిస్తున్నారా? మీరు సరిగా నిద్రపోతున్నారా? నేనయితే సరిగా నిద్ర పోవడంలేదు. ఒక కీలకమైన నాగరికతకు సంబంధించిన మార్పును పరిశీలిస్తున్నాను. ఇలాంటి క్లాస్లు చెప్పడం, కోర్సులు మనుగడ సాగిస్తాయని అనుకుంటున్నారా? ఇది కోర్సుకు, మీకు, నాకు సంబంధించిన విషయం కాదు, ఇది మానవాళికి సంబంధించిన అంశం. ఇప్పుడు మనమంతా ఒక కొత్త నాగరికతకు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. దీన్ని ప్రజలు గమనిస్తున్నారో, లేకపోతే నేనే ఓ గోడపై దెయ్యం బొమ్మను చిత్రీకరిస్తున్నానో తెలియడంలేదు. అసలు ఏం జరుగుతున్నదో మీరు గమనిస్తున్నారా? ఏఐ విషయంలో చాలా రకాల వేదాంతపరమైన, తాత్వికమైన, మనుగడకు సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ విజ్ఞానం, ఆలోచించడం అనేవి వాణిజ్య వస్తువులుగా మారితే, మన మనుగడకు అర్థమేముంటుంది? ఇన్నాళ్లూ మానవులుగా మనం మేధస్సు కలిగిన వాళ్లం అనుకుంటూ.. ఉన్నాం. ఇప్పుడు యంత్రాలు కూడా అదే పనిచేస్తున్నాయి. సరే, అదొక తాత్వికమైన వాదన. కానీ ఆర్థికపరమైన పరిణామాల గురించి ఆలోచించండి. నా జీవితంలో ఏం జరుగుతున్నదో చెప్తాను. నేను సిబ్బందిని నియమించుకోవడం ఆపేశాను. ఎందుకంటే మనుషులు ఇకపై పనిని సులభతరం చేసేవారిగా కాకుండా, అడ్డంకులుగా మారారు. నా కోసం వంద మంది ఏఐ ఏజెంట్స్ సమాంతరంగా పని చేస్తుంటే, నేను సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరమేమున్నది? నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను 100 మంది ఏజెంట్లను స్పిన్ చేసి, మరికొన్ని క్లాట్ సబ్స్క్రిబ్ ప్షన్లను పొందుతాను. ఇక మనుషుల అవసర మేముంటుంది? కొన్ని రోజుల క్రితం నేను హింటన్ ప్రసంగం విన్నాను. ఆయన ఏం చెప్పారంటే 'మేధస్సు వ్యాపార సరుకైతే, అది చౌకకు దొరికితే, ఆలోచన కూడా తక్కువ ధరకు లభిస్తే ఏం జరుగుతుంది?' అనేది వివరించారు. ఆధు నిక ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మేధస్సు, జ్ఞానం మీద ఆధారపడి నడుస్తున్నది. ఇప్పుడు అది వ్యాపార వస్తువుగా మారి, చౌకగా దొరికితే తర్వాత పరిస్థితి ఏంది? ఒక గొప్ప ఆలోచన దృక్పథం ఏందంటే, ఏఐ ద్వారా చాలా పెద్ద ఎత్తున ఉత్పత్తి జరుగుతుంది. ఎందుకంటే ఉత్పత్తి ఖర్చు తగ్గిపోతుంది కాబట్టి. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా సంతోషంగానే ఉంటారు కదా! కానీ అది జరుగుతుందా హింటన్ వాదన ఏందంటే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి అనేది ప్రతి ఒక్కరికీ సంతోషంగా మారలేదు. ఇది కేవలం ఎక్కువ ఉత్పత్తి ఉన్నవాళ్లకు, ఏమీ లేని వాళ్లకు మధ్య విభజనను మాత్రమే సృష్టిస్తుంది. ప్రతిభ ఆధారిత వ్యవస్థలో సమయం, శ్రమను వెచ్చించి కొందరు జ్ఞానం పొందు తారు. సమాజంలో నైపుణ్యం ఆధారంగా అంచెలవారీ వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు అది తొలగించి చూడండి. మనుషులంతా సమానం, కొందరు 'ఎక్కువ' సమానం అవుతారు. ఎందుకంటే ఆ కొందరు మేధస్సును సృష్టించగలరు కాబట్టి. మీకు తెలుసా? జీపీటీ ఆస్ట్రా జీపీ 6 అనేది లక్ష జీపీయూలను ట్రైన్ చేసింది. మన దేశం కూడా లక్ష జీపీయూలను కలిగి లేదు. ఎవరైతే అలాంటి వ్యవస్థను నియంత్రించగలరో వాళ్లే జాగీర్దారుల తరహాలో తయారవుతారు. ఏ వస్తువులు ఎక్కడికి వెళ్లాలో నిర్ణయిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రపంచంలో 50 ఏండ్లుగా ఏర్పడిన తరహా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుంది. ఇప్పటికే ఉద్యోగాల తొలగింపును చూస్తున్నాం.. ఇంకా చూస్తాం. కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వవు, అప్పుడు యూనివర్సిటీలు ఏం చేయాలి? ప్రభు ఏం చేయాలి? అసలు యూనివర్సిటీల్లో ఏం బోధించాల్సి ఉంటుంది? విద్యార్థులను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి అల్గారిథం రాయాలని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? మనుషులుగా మనకు ఎలాంటి అవకాశాలు లేకపోతే, మనం ఏం చేయాలి? ఆర్థికశాస్త్రాన్ని ఎలా నిర్వహించాల్సి ఉంటుంది? క్రమంగా వస్తు మార్పిడి పద్ధతి వస్తుందేమో! నేనొక ఆర్టికల్ చదివాను. అందులో ఏమున్నదంటే! ప్రతి ఒక్కరికీ ఉండటానికి చోటు, తినడానికి తిండి, వినోదం కోసం ఏవైనా యూట్యూబ్ వీడియోస్ చూసుకునే అవకాశం కల్పిస్తే అందరూ సంతోషంగా ఉంటారా? ఉండము. రోడ్ల మీదకు వచ్చి ఫైట్ చేస్తాం. ఎందుకు అంటే.. ఏమో చెప్పలేం. సమాజం ఎక్కడికి పోతున్నదో కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి చర్చలు జరుగాలి. ఎవరో ఒకరు ఏదో చేయాలి. ఇప్పుడిదంతా తాత్వికమైన చర్చగా మారింది. మరో వాదన కూడా ఉన్నది. నా భార్య తరచుగా అడుగుతూ కాలిక్యులేటర్లు వచ్చాయని మనం కూడికలు, తీసివేతలు వంటివి నేర్చుకోవడం మానేయలేదు కదా' అని. నిజమేకదా. అది సరైన వాదననే. ఇక మీరంతా నా క్లాస్ రూమ్ రాకపోయినా ఏఐ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటే, రావాల్సిన అవసరమేముంటుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మా కూతురు చెప్తున్నది. 'జీపీటీ బెస్ట్ టీచర్, మీకంటే ఓపికగా సమాధానం చెప్తున్నది. ఎన్నిసార్లు అడిగినా విసుక్కోకుండా, తిట్టకుండా నేర్పిస్తున్నది' అని అంటున్నది. అవన్నీ కూడా సరైన వాదనలే కదా! ఇంకా మౌలిక ప్రశ్న ఏందంటే.. అసలు మనం ఎందుకు నేర్చుకోవాలి? అనేది ఒక ప్రశ్న అయితే, ఏం నేర్చుకోవాలి? అనేది ఇంకో ప్రశ్న. అలాగే మీరంతా నేర్చుకోవడానికి ఇక్కడికి ఎందుకు వచ్చారు. సరే, మనుషులు సోషల్ యానిమల్స్ కాబట్టి, సోషలైజ్ కావడానికి వచ్చామంటే ఓకే. సోషలైజ్ కావడానికే అంటే పార్క్ కు పోవచ్చు, యూనివర్సిటీకే ఎందుకు వచ్చారనేది మరో ప్రశ్న కదా! యూనివర్సిటీ అంటే మేధోపరమైన అంశాలపై చర్చిస్తూ ఉత్తేజం పొందే స్థలం అని చెప్పడం బాగుంది కదా! సాంకేతిక రంగంలో వచ్చే మార్పులు కింది నుంచి పైస్థాయికి ఉండవు. పై నుంచి కిందికి ఉంటాయి. కాబట్టి ఇలాంటి అంశాలపై ముందుగా మనలాంటి వాళ్లం చర్చించుకోవాల్సిన అవసరమున్నది. దీనిపై అంతా చర్చించుకోవాలి. ఎందుకంటే అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. నా అభిప్రాయం ప్రకారం మనలో తగినంత సృజనాత్మకత లోపించింది. ఉదాహరణకు ఒక తరగతి గదిలో 100 మంది విద్యార్థులు ఉన్నారని అనుకుందాం. మనం వారికి 100 వేర్వేరు సమస్యలను ఇచ్చి, వారి ప్రతిభను అంచనావేయడానికి ఒకటే పద్ధతిని అనుసరించగలమా? లేదు. చివరికి మనం ఇచ్చే గ్రేడ్ అనేది పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను మీకు ఒక ఓపెన్ ప్రాబ్లెమ్ ఇచ్చి, మీకు నచ్చినట్టుగా పరిష్కరించండి అని అడిగాను అనుకోండి. అప్పుడు ఆ 100 మంది విద్యార్థులూ ఒక లార్జ్ లాంగ్వేజ్ మాడల్కు ఒక ప్రాంప్ట్ ఇచ్చి, దాని ద్వారా వచ్చిన సమాధానాన్ని సబ్మిట్ చేస్తే, నేను వాటిని ఎలా విశ్లేషించాలి? ఎవరికీ తెలియదు. అసలు ఈ కంపెనీలు, ఈ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అందుకే నేను ఆర్థిక వ్యవస్థ గురించి అడిగాను. రానున్న ఐదేండ్లలో ఆర్థికపరిస్థితి ఎలా ఉండబోతున్నది? దీనికి మన దగ్గర ప్రస్తుతానికి సమాధానం లేదు. అసలు మనం ప్రజలకు దేని కోసం శిక్షణ ఇవ్వాలి? మన చర్చ మొదలు పెట్టినప్పుడు నేను అడిగిన ప్రశ్న అదే కదా. సరైన ప్రాంస్టింగ్ కోసమా? అసలు సరైన ప్రాంప్టింగ్ అంటే ఏమిటి? ఒక సమాజంగా, మానవులుగా మన లక్ష్యం ఏంది అని ఆలోచిస్తే.. మనం ఎటువైపు వెళ్తున్నామో, అసలు మనం పరిష్కరించాల్సిన సమస్య ఏమిటో నాకు స్పష్టంగా తెలియడంలేదు. చారిత్రకంగా చూస్తే, విశ్వవిద్యాలయాలు ఎలా రూపుదిద్దుకున్నాయో మీకు తెలుసు కదా! సోక్రటీస్ వంటి వారు తమ చుట్టూ కొందరు తెలివైన వారిని చేర్చుకుని, రకరకాల విషయాలపై చర్చించేవారు. మనం ఇప్పుడు చేస్తున్నది కూడా సరిగ్గా అదే కదా. నిజంగా నేర్చుకునే విధానం ఇలాగే విషయాలపై చర్చ ద్వారా ఉండాలని నా అభిప్రాయం. కేవలం ఐదుగురు సభ్యులను మాత్రమే ఒక కోర్సులో చేర్చుకుని, ఒక బృందంగా కలిసి పని చేసి, తదుపరి బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని నిర్మించే పద్ధతిని అనుసరించవచ్చు కదా. ఒకవేళ ఆ కోర్సులో 100 మంది నమోదైతే అప్పుడు పరిస్థితి ఏంది? అన్ని రకాల నైపుణ్యాలు కలిగిన ప్రజలు ఉన్న దేశంలో మనం ఏం చేస్తాం? బహుశా గిట్ హబ్ లో మీరు రూపొందించిన ప్రాజెక్టుకు ఎన్ని స్టార్స్ వచ్చాయనే దాని ఆధారంగా మీకు గ్రేడ్ ఇస్తామని వారికి చెప్పవచ్చు. ఇటీవల ఒక స్కూల్లో టీచర్స్ డే ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తే వెళ్లాను. అక్కడ అటెండెన్స్ అనే సిస్టమ్ తీసేస్తే, ఎంతమంది స్టూడెంట్స్ స్కూల్కు వస్తారు?' అని నిర్వాహకులను నేనొక ప్రశ్న అడిగాను. వాళ్లు షాక్ అయ్యారు. నేను హైస్కూల్కు వెళ్తున్నప్పుడు జైలుకు వెళ్తున్నట్టు ఫీలయ్యేవాడిని. ఆ పరిస్థితిని చాలా ద్వేషించేవాడిని. మీలో కూడా చాలామందికి ఇలాంటి అనుభవమే ఉండి ఉంటుంది. మనం సంతోషం లేని ప్రదేశాలను ఎందుకు సృష్టిస్తున్నాం. విద్యార్థులు వికాసదశలో ఉన్నప్పుడు స్కూల్కు వెళ్లి 8 గంటలు గడిపి, బాధాకరమైన మన తిరిగి ఇంటికి రావడం చూస్తున్నాం. ఇక అలాంటి పరిస్థితినే యూనివర్సిటీలో కూడా చూస్తే మనం ఏదో తప్పు చేస్తున్నట్టే కదా! ఇక్కడ మీకొక చిన్న కథ చెప్తాను. అది బిచ్చి అనే కన్నడ రచయిత రాశారు. నాలుగైదేండ్ల పిల్లవాడు, తన తల్లితో నడుస్తూ వెళ్తున్నాడు. ఓ గొర్రెను బలి ఇచ్చేందుకు లాక్కెళ్తుండన్ని చూశాడు. ఆ గొర్రెకు దండలువేసి ఉన్నాయి, దాన్ని బాజాభజంత్రీలు వాయిస్తూ తీసుకెళ్తున్నారు. ఆ పిల్లవాడు ఆసక్తితో అతడిని తల్లిని ఇలా అడిగాడు. 'ఆ గొర్రెను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?' అని. ఆ తల్లి చాలా విషాదకరమైన మొహంపెట్టి, ‘ఆ గొర్రెను బలి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారు' అని చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు ఏమన్నాడంటే 'అవునా.. అంతేనా.. నేనింకా ఆ గొర్రెను స్కూల్కు తీసుకెళ్తున్నారు అనుకున్నాను' అని సమాధానం చెప్పాడు. అంటే బలి ఇవ్వడం కంటే స్కూల్కు తీసుకెళ్లడం దారుణం అని ఆ పిల్లవాడి భావన. నేను కూడా స్కూల్కు వెళ్లడానికి ఇష్టపడేవాడిని కాదు. హైట్ ఉండటం వల్ల వెనుకబెంచీలో కూర్చునేవాడిని. ఫిలాసఫీ పుస్తకాలు చదువుకునేవాడిని. క్లాస్ రూమ్ పాఠాలు బోర్ కొట్టేవి. వంద మందిని కూర్చోబెట్టి ఒక వ్యక్తి ప్రసంగించే తరహా వాతావరణాన్ని సృష్టించాం. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు క్లాస్కు ఎందుకు వస్తున్నారు? అని. నా పదేండ్ల టీచింగ్ కెరియర్లో ఇలాంటి చర్చ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు సమయం వచ్చిందనిపించి, చెప్పాను. ఇప్పుడు కూడా చెప్పకపోతే మనల్ని మనం మోసం చేసుకు న్నట్టు అవుతుంది కదా!

చైతన్య గానం 2 # మువ్వల గోపాల#swami_sundara_chaitanyananda

Thursday, September 24, 2026

చైతన్యగానం - 03 videos - shorts youtube playlist link# Internet Archive చైతన్యగానం - 03 videos playlist link#view#download#share

 ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా ARCHIVE ORG. లో post చేయబడిన videos &audios&pdf books&images అన్నీ (మీకు నచ్చి నవి ) మీరు download చేసికొని మీరు whatsup ద్వారా share చేసికొన వచ్చు. HOW TO DOWNLOAD INTERNET ARCHIVE ORG. FILES ON YOUR DESKTOP view this video : GOOGLE DRIVE UPLOADED VIDEO LINK: https://drive.google.com/file/d/13YLphZ4HECLjxNg2lBFhHJwj4zMMXqff/view?usp=drive_link

*******************************************************************************

చైతన్యగానం - 03 videos - shorts playlist link:

***********************************************************************************
 

 



చైతన్యగానం - 03 videos - shorts youtube playlist link:

https://www.youtube.com/playlist?list=PLAosYDXg_tg8

https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/72/%E0%B0%9A%E0%B1%88%E0%B0%A4%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82---03?sort=title