Saturday, July 13, 2024

NAMASTHE TELANGANA &TELANGANAM 14JULY2024

NAMASTHE TELANGANA &TELANGANAM 14JULY2024

CELLPHONE HANDLE WITH CARE TELUGU SONG

CELLPHONE HANDLE WITH CARE TELUGU SONG ఈ వీడియోలో ని పాట ప్రతి ఒక్కరూ వినవలసిన పాట. సెల్ ఫోన్ వల్ల కలిగే అనర్థాలు, నష్టాల గురించి చాలా చక్కగా వివరించి పాడారు. ప్రతి ఒక్కరు సమయం కేటాయించుకొని అయినా పై వీడియలోని పాటను వినగలరు.

జన గళం మనం.. పోరాటమే బలం& Ukku Gunde CM KCR Song & Poratam Annadi Kothakade Song

జన గళం మనం.. పోరాటమే బలం✊ | Janagalam Manam Poratame Balam Song | BRS New Song #KCRBusYatra Ukku Gunde CM KCR Song | BRS Election 2023 Song | Matla Tirupati Song | Telangana Poratam Annadi Kothakade Song: పూనకాలు తెప్పిస్తున్నకేసీఆర్ కొత్త పాట

Sunday, July 7, 2024

Ukku Gunde CM KCR Song & Poratam Annadi Kothakade Song

Ukku Gunde CM KCR Song | BRS Election 2023 Song | Matla Tirupati Song | Telangana ********* Poratam Annadi Kothakade Song: పూనకాలు తెప్పిస్తున్నకేసీఆర్ కొత్త పాట ********

Saturday, July 6, 2024

ఆధ్యాత్మిక విషయాలు

 


"వివేకం ద్వారా స్వేచ్ఛ లభిస్తుంది"

నిజమైన స్వేచ్ఛ 'సంపాదించడం' ద్వారా కలిగేదికాదు. వివేకం ఉండటం ద్వారా కలిగే ఫలితం అది 

బయటకు వెళ్ళి మార్కెట్టులో స్వేచ్ఛను మీరు 

కొనుక్కొని రాలేరు. ఒక పుస్తకం చదవటం ద్వారా కాని, 

ఒక ప్రసంగం వినడం వల్లకాని కలిగేది కాదు. స్వేచ్ఛ

వివేకం ద్వారా వస్తుంది. సృజనాత్మకత - అంటే అర్థం

నిజమైన అంతఃస్ఫూర్తి కలిగివుండడం. అది 

వుండాలంటే స్వేచ్ఛ వుండాలి. ఈ స్వేచ్ఛ కావాలంటే

వివేకం వుండాలి. కాబట్టి వివేకాన్ని నిరోధిస్తున్నది

ఏది అనే సంగతి మీరు విచారణ చేసి తెలుసుకోవాలి. 

మీరు జీవితాన్ని తరచి తరచి చూసి తెలుసుకోవాలి. సామాజిక విలువలను, ఇంకా అన్నింటినీ

ప్రశ్నించాలి. భయపడి పోయివున్నారనే కారణంగా

ఏ ఒక్క దానికే అంగీకారం తెలుపకూడదు.

అసలు ప్రధానమైనది ఏమిటంటే స్వచ్ఛగా ఆలోచించడం, ఆవిధంగా మీ అంతట మీరే స్వయంగా

తెలుసుకొనడం ఆరంభించడం ఎంతో ముఖ్యం.

పశ్నించడానికి స్వేచ్ఛవున్నపుడే ఆలోచించి తెలుసు కొనడానికి అన్వేషించి కనుగొనడానికి స్వేఛ్చవున్నపుడు మాత్రమే వివేకం ఉదయిస్తుందని నిశ్చయంగా 

చెప్పవచ్చు. అప్పుడే మీ మనసు అతి చురుకుగా, 

అతి జాగరూకంగా అత్యంత నిర్దుష్టంగా తయారవుతుంది . అప్పుడు మీరు సంపూర్ణంగా సమన్వయత్వం చెందిన వ్యక్తిత్వం సాధిస్తారు. లోపల ఒక విధంగా భావిస్తూ

బయట మరో రకమైన కట్టుబాట్లకు లొంగిపోయి,

ఏం చేయాలో పాలు పోక భయంతో వణికి పోతున్న

ఒకప్రాణివలె ఉండరు.

భయభీతి నుండి విముక్తి

మనలో చాలా మందిలో భయం ఎన్నో విపరీతాలను సృష్టిస్తూ వుంటుంది.. రకరకాలైన

భ్రాంతులలో పడవేస్తుంది. సమస్యలను

తయారు చేస్తుంది . భయ భీతిని గురించి

బాగా లోతుకు వెళ్ళి చూసి పూర్తిగా అవగాహన 

చేసుకోనంతవరకు అదిమనం చేసే పనులను

వక్రంగా మార్చివేస్తుంటుంది . మన ఉద్దేశ్యాలకు

పెడర్థాలును కల్పిస్తుంది. మన జీవిత విధానాన్ని

వంకర టింకర చేసివేయగలదు భయం . 

మనిషికీమనిషికీ మధ్యన అడ్డుగోడలు లేపుతుంది.

అన్నిటి కంటే ప్రేమానురాగాలను హతమారుస్తుంది,

అన్నది మాత్రం పూర్తిగా నిజం. భయాన్ని 

గురించి యోచించిన కొద్దీ, బాగా ఆకళింపు చేసుకొని,

దానినుండి నిజంగా విముక్తి పొందిన కొద్దీ 

మనచుట్టూరావున్న వాటితో మనకు పరిచయం 

ఎక్కువవుతూ వుంటుంది. ప్రస్తుతం జీవితంలో మనకు

వున్న అర్థవంతమైన సంబంధాలు చాలా కొద్ది 

అవునుకదూ ? భయ భీతి నుండి మనల్ని విముక్తి 

చేసుకోగలిగితే మన సంబంధాలను విస్తుృత 

పరచుకోవచ్చును, గాఢమైన అవగాహన, నిజమైన

సానుభూతి, ప్రేమపూర్వకమైన జౌదార్యం పెంచుకోవచ్చు

ను? మన దృక్మండలాన్ని అపారంగా 

విస్తృతపరచగలుగుతాం కూడా.

మనలో ఒక నిశ్చింత కల్గించేదాన్ని మనం కోరుకుంటాం

అందుకు రకరకాలయిన రక్షణలను ఏర్పరచుకుంటాం. మానసికమైన, బాహిరకమైన కవచాలను 

ఏర్పరచుకుంటాం . ఇంటికిటికీలు, తలుపులు. 

అన్నీమూసివేసి లోపల కూర్చునప్పుడు చాలా భద్రంగా వున్నట్లు భావిస్తాం ; సురక్షితంగా ఉన్నామని ఎవరూ మనల్ని వేధించలేరు అని అనుకుంటాం. కాని జీవితమంటే

అది కాదు కదా మనకు బయటి దృశ్యాలు కనిపించాలి.

మనం అన్నింటినీ చూడాలి అని జీవితం ఎడతెరపి

లేకుండా మనతలుపులు తడుతూనే వుంటుంది.

మన కిటికీలు తెరవాలని నిరంతరం ప్రయత్నిస్తూనే

వుంటుంది. భయం వలన తలుపులకు తాళాలు

వేసుకొని, కిటికీల గడియలు వేసుకొని

మనం కూర్చుంటే తలుపులు మరింత గట్టిగా

కొట్టడం జరుగుతుంది. ఏదో ఒక రూపంలో

ఏర్పరచుకున్న భద్రతను అంటిపెట్టుకొని మనం

కూర్చున్న కొద్దీ జీవితం మనల్ని మరింతగా త్రోసి

పడవేద్దామని చూస్తుంది. మనం భయపడి, 

మనచుట్టూ మనమే గోడలు కట్టి మూసివేసుకున్నకొద్దీ

మన బాధలు కూడా ఎక్కువవుతూ ఉంటాయి. 

ఎందుకంటే జీవితం మనల్ని వదలిపెట్టదు కాబట్టి.

భద్రంగా వుండాలని మనం కోరుకుంటాం.

జీవితం వల్లకాదు పొమ్మంటుంది. దానితో పోరాటం

మొదలవుతుంది. అందువలన మిమ్మల్ని ఇరతరుల

నుండి పూర్తిగా దూరం చేసి ఏకాకులను చేసే

భయ భీతి భావాలను మీరు పసివయసునుండే

పశ్నించడం, ఆరంభించడం, ఛేదించి వేయడం

అత్యంత ప్రధాన మైన విషయాలని నేను 

అంటున్నాను. అంతే కాకుండా ఊహాలు, 

అభిప్రాయాలు, సంప్రదాయాలు అలవాట్లు అనే

గోడలను చుట్టూ నిర్మించుకొని మిమ్మల్ని

మూసి వేసుకోకుండా సృజనాత్మకమైన

జీవ చైతన్యం కలిగివున్న విముక్త మానవునిగా 

మీరు రూపుచెందడం చాలా ముఖ్యం. భయభీతి వున్నంతకాలం .అనుకరణ వుంటూనే వుంటుంది.

కేవలం అనుకరణ మాత్రమే చేసే మనసు 

యాంత్రికంగా తయారవుతుంది అవును కదూ? ఒక

యంత్రంలాగా తను చేయవలసిన పనులు 

నిర్వహిస్తూపోతుంది. సృజనాత్మకత వుండదు 

సమస్యలను పరిష్కరించలేదు. అటువంటి మనసు.

ఏవో కొన్ని కార్యకలాపాలను నిర్వహించవచ్చును.*****


* చిన్ముద్ర రహస్వార్థం *

ఋషులు మునీశ్వరులు లోక కళ్యాణార్ధము అరణ్యమునకు

వెళ్లి పద్మాసనము వేసుకొని, రెండు చేతులను మోకాలిపై

పెట్టిచిటికెన ఉంగరపు, మరియు మధ్య వేళ్ళను నిటారుగా

పెట్టడము, మరియు చూపుడు వేలిని బొటన వేలికి

దగ్గరగా పెట్టి ఏకాగ్రతగా ధ్యానము చేయడం మన

మందరము చూచిన విషయమే కాని మూడు వేళ్ళను అలా

నిటారుగా పెట్టడం - చూపుడు బొటన వ్రేళ్ళను అలా

ఎందులకు దగ్గరగా చేర్చడము లోని రహస్యం :-

1) కండ్లకు కనపడు స్థూల శరీరమును చిటికెన వ్రేలనియు

2) కండ్లకు కనపడని మనస్సు, బుద్ధి, చిత్తము, 

అహంకారములనెడి అంతఃకరణములె ఉంగరపు వ్రేలనియు

3) అనేక జన్మ - జన్మములుగా చేయుచు వచ్ఛుచున్న

పుణ్యపాపములనెడి రెండు కర్మలును తెలియజేయునది నడిమి వ్రేలనియు తెలియజేయుచున్నది. ఈ మూడు

వ్రేళ్ళను అలా నిటారుగా చాపడమంటే స్థూల శరీరమును,

శరీశ సంబంధీకులను, సూక్ష్మ అంతః కరణములైన

మనస్సు, బుద్ధి, చిత్త మహంకారములనెడి కర్మలను మర్చి

జీవాత్మ పరమాత్మలో ఐక్యమగుటయని చూపుడు

వ్రేలుని, బొటన వ్రేలికి కలపడము యొక్క రహస్యమ

ఇట్లు స్వామివారి భక్తులు.

***************

***స్వధర్మాలను ఆచరించని మానవుల జీవితాలకు ఏవిధంగానూ శాంతి సౌఖ్యాలు లభించవు.

కనుక తన శాంతి సౌఖ్యాల కోసమైనా ప్రతీ వాడూ తన ధర్మాలను ఆసక్తితో ఆచరించ వలసి ఉంది. సామాన్యుల దృష్టిలో,  పుణ్యాత్మునికి తరచుగా కష్ట నష్టాలు ఎదురౌతున్నట్లును, పాపాత్మునికి సుఖాలే కలుగు తూన్నట్లును పైకి కనిపిస్తుంది. అటువంటప్పుడు పుణ్యాత్ముడు తాను కష్టాలు అనుభవిస్తూన్నట్లు భ్రాంతి చెంది తన ధర్మం యెకల విరక్తి చెందడం అనేది, 

నిజంగానే  వారి కష్టానుభవానికే కారణమవుతుంది. పరమార్థంలో పాపాత్ముల పాపపరిణామం వారికి 

మర్మచ్ఛేదంగా మారడం మనం చూస్తున్నాం కదా! తన ధర్మం ఎడల వారికి చెందిన వారి గతే ఇట్టిది. కనుక వివేకం కలవాడు యెట్టి పరిస్థితిలోనూ స్మధర్మాచరణ విషయంలో పరిస్థితివిముఖత చూపరాదని ఫలితాంశం.****

*********


దివ్య సూక్తులు

1.సత్ సంస్కారములు, సద్గుణములు అలవరచుకొనుటయే నిజమైన విద్య.

2.మానవుడు భౌతికముగనే పారమార్ధికముగ

కూడ ఎత్తుగా పెరగవలసి యున్నది.

3. కాకి ఆకాశమునకు ఎగిరినా దాని దృష్టి మలిన వస్తువుల

పైననే ఉండును. కుక్క గంగ యొద్ద కేగినా గతుకు

నీళ్ళనే ఆశించును.

4) ఉత్తమ జ్ఞానికి లేనిపోని విమర్శలు చేయుటకు

వ్యవధి ఉండదు. ప్రేుతి ఉండదు.

5. ధర్మాచరణ లేని వానికి దుర్గతి కలుగును.

6.చదరంగము ఆడేవారి కంటె చూచువారికి సరియైన

ఎత్తులు గోచరించును.

7.చదువుట కంటె వినుట మేలు. వినుటకంటె ఆచరించు.

మేలు.

*********


* భారతధర్మం *

* అధర్మంగా సంపాదించిన ధనంతో ఏలోపాన్నితే

కప్పుకోవడానికి ప్రయత్నిస్తామో, ఆ లోపం సాగదు.

దానివల్ల వేరొక దోషం ప్రకటించ బడుతుంది.

* ధర్మం పై అను రాగం వున్నవాడు పరుష వాక్కులు

పలుకరాదు. పరుషవచనాలు హృదయాలను కాల్చుతాయి

సభ కాదు .

సభ కాదు

* ఏ సభలో పెద్దవాళ్ళుందరో అది

పెద్ద వాళ్ళున్నంత మా తోన కూడా

ఏ పెద్దలు ధర్మాన్ని పలుకరు వారో వారు పెద్దలే

కారు. నేనిలో సత్యం వుండదో అది ధర్మం కాజాలదు.

పది మోసంతో నిండివుందో, అది సత్యమూ కాదు

* మంచి బుద్ధి, నిగ్రహం, విద్య, పరాక్రమం,

మిష భాషిత్వం, శక్తి నను సరించుడిచి దానం

చేయుట. చేసిన మేలు మరవకుండుట.

ఈ ఏడు గుణాలు మనిషికి శోభనిచ్చేవి.

బుద్దమందుడి బాహువులు దీర్ఘమైనవి.

దేనినైనా అందుకోగలడు. (విదురనీతి)

మహాభారతం.



Friday, July 5, 2024

భగవదృష్టి - దివ్యదృష్టి

  

భగవదృష్టి - దివ్యదృష్టి


యో మాం పశ్యతి సర్వత్ర

సర్వం చ మయి పశ్యతి

తస్యాహం న ప్రణశ్యతి || గీత  6-30||

సచమే న ప్రరాశ్యతి

ఏ యోగి నన్ను సర్వత్ర సమస్త ఆత్మలలో

చూస్తాడో, సమస్తమైన ఆత్మ వస్తువును నాయందు చూస్తాడో ఆ యోగికి నేను సాక్షాత్కరింపకుండా వుండను. ఆ యోగి కూడా నా దృక్పథం నుండి తొలగడు.

ఆ యోగి ఉత్తమ భక్తుడు. ఆ యోగినులు వ్రజ గోపికలు.

పై శ్లోకం వంటిదే శ్రీమద్భాగవతంలో కూడా వుంది.

""సమస్త చేతనా చేతనాలలో తన ఉపస్య

భగవానుని దర్శించే వాడు అలాగే తన ఉపాన్య 

భగవానులో సమస్త చేతనా చేతనాలను దర్శించేవాడు

ఉత్తను భక్తుడు అని”

ఉత్తమ భక్తుని లక్షణమెటువంటిదో అనుభవ

గమ్యమానమైన మనస్సు తెలియయజేస్తున్నది. రెండవ

శ్లోకం. అనురక్తుడైన భక్తుడు తన ప్రియతముడైన

శ్రీకృష్ణుడ్ని, ఆయన నామాన్ని కీర్తిస్తూ ద్రవిత 

చిత్తుడవుతాడు. ఉన్మత్తుని వలె ఉచ్ఛస్వరంతో

హసిస్తాడు . దుఃభిస్తాడు. కేకలు వేస్తాడు..

గానం చేస్తాడు. తన్మయుడై నాట్యం చేస్తాడు.

స్మృతిని కోల్పోతాడు.

భగనానామాన్ని కీర్తించేటప్పుడు, అభిమానపడటం.

సిగ్గు పడడం, మూర్ఖ లక్షణ వునువుతుంది . సర్వశుభాలను ప్రసాదించే అప్రాకృతమూ దివ్యమూ అయిన భగవనామాన్ని సంకీర్తన చేయడంలో సంకోచించడం భగవంతుడ్ని తక్కువ చేయడమే

అవుతుంది. భాగవత వాఖ్యాత శ్రీ వీరరాఘవస్వామి

 " నడాంభిక మివపరాన్ పంచయితుం "తాను 

మహాభక్తుడననే బడాయిని చాటుకుని పరులను 

వంచించటానికి భక్తి పారవశ్యాన్ని చూపడం హేయ

మవుతుందని వాఖ్యానించారు. భక్తి పారవశ్యం లోకవంచన కాకూడదు.

భక్తుడు సమస్త స్థావర జంగమాలలో తన ఇష్టదైవాన్నే దర్శిస్తాడు.

భూమానందాన్ని అనుభవిస్తాడు. వ్రజ గోపికలు.

బృందావనంలోని తరులతా గుల్మాలను చూచి శ్రీ కృష్ణ

భావనా భావితలయ్యారు. ఫల భారంతో నేలకు వంగిన వృక్షశాఖలను చూచి అవి శ్రీకృష్ణునికి

ప్రణమిల్లుతున్నాయని భావించారు. పుష్పిత లతాతరువులు భగవంతుడ్ని పూజిస్తున్నాయని తలపోసాడు. చిగురు పెట్టిన చెట్లు పులకిస్తున్నాయనుకున్నారు. ఫల మధు ద్రవాలను ఆనంద భాష్పాలుగా ఎంచారు .

సమస్త వృక్ష లతలలో శ్రీ కృష్ణానుభూతిని పొందారు.

వ్రజ గోపికలు తమ వలెనే బృందావనంలోని

తరులతలు కూడా శ్రీ కృష్ణాను రాగంతో ఆనందించడం

చూచి విస్మయం పొందారని తాత్పర్యం.

శ్రీ కృష్ణ భక్తుడొక వృద్ధుడు బృందావనం

చూడటానికి బయలు దేరి మార్గమధ్యంలో ఒక

పట్టణ వీధిగుండా నడిచి పోతున్నాడట. అతని

నామాలు, నున్నని బోడితల చూచిన ఒక

దుర్మార్గుడికి ఆ బోడి తల మీద కర్రతో కొట్ట బుద్ధి పుట్టింది కొట్టాడు. ఆ భక్తుడు మూర్చపడిపోయాడు. ఎవరో సజ్జనులు అతడ్ని ఆసుపత్రికి చేర్చారు. తలకు కట్టు కట్టారు. కొంత సేపటికి ఆ భక్తునికి స్పృహ కలిగింది. ఆసుపత్రిలోని సేవకుడు వచ్చి వెచ్చని పాలగ్లాసు అతనికి అందిస్తూ "అయ్యా! ఈ పాలు త్రాగండి " అన్నాడు.

ఆనూట విని భక్తుడు నవ్వుకుంటూ "నీవు

భలే చిత్రమైనవాడవు సుమా ! అపుడు కర్రతో 

కొట్టావు. ఇప్పుడు ప్రక్క మీదున్న నాకు పాలగ్లాసు 

అతనికి అందిస్తున్నావు" అన్నాడు నిర్మలమైన నవ్వుతో.

పాపం ఆ సేవకుడు ఆ మాటలు విని

“అయ్యా ! మిమ్మల్ని కొట్టింది నేను కాదు.

ఎవడో మిమ్మల్ని కొట్టాడు. మీరు వివశులై పడిపోయారు. ఎవరో మిమ్మల్ని ఆసుపత్రిలో చేర్చారు. నేను 

ఈ ఆసుపత్రిలో పని చేసేవాడ్ని. నేను మిమ్మల్ని

కొట్టినవాన్నికాదు కాదని మొరపెట్టుకున్నాను.'

అవునవును. నాకు తెలుసు. నీవు చిత్ర

విచిత్రమైన వేశాలు వేస్తావు. కర్పతో కొట్టేవాడవు

నీవే . పాలు తాగమని ఇచ్చేవాడవు నీవే. నీవు ఇతరులను 

మోసగించగలవు. కానీ నన్ను మాత్రం మోసగించలేవు.

నీ మాయలన్నీ నాకు మొదటి నుంచే తెలుసు  " అన్నాడా

భక్తుడు. 

ఈ సమతా సంపన్నులైన భక్తులు దుఃఖరాజ్యానికి

బహు దూరంగా వుంటారు. వారికి వైరం వుండదు,

ప్రతీకారేచ్ఛవుండదు.

ఆ సేవకుడు ఆ భక్తునికి ఎలా తెలియ

చెప్పాలో తోచక సతమత మయ్యాడు ఉత్తమ

భక్తుడు సమస్త జనులలోను ఒకే ఒక తన

ప్రభువును దర్శిస్తాడని సారాంశం.

భక్తుడైన వాడెవడు తనను తాను భక్తుణ్ణని 

చెప్పుకోడు. అతని స్వభావం, అతని పనులు,

ఆచరణ మొదలైనవే అతడు భక్తుడని చెబుతాయి.

సత్పురుషుడైన భక్తునివద్ద కొంచెంసేపు కూర్చున్నవానికి దైవీగుణం కలిగిందంటే చాలు ఆయన

మహా భక్తుడని ప్రణమిల్ల వచ్చు...

సర్వత్రా భగవదృష్టియే దివ్య దృష్టి అవుతుంది. అది భగవత్ కృప వల్లనే ప్రాప్తిస్తుంది.**


అమ్మ - అమ్మలోని కమ్మదనం

  అమ్మ - అమ్మలోని కమ్మదనం

'అమ్మ' అనే మాటలోని కమ్మదనం గుఱించి ఎంత చెప్పినా తక్కువే! ఆ పద ఉచ్ఛారణతోనే మన మదిలో ఉద్విగ్నత, ప్రేమ భావం ఉప్పొంగుతాయి. ఈ ప్రపంచము లోనికి రాక పూర్వము తల్లి గర్భమే మన నివాసం. తొమ్మిది నెలలపాటు మానవుడు తల్లి గర్భములో ప్రాణం పోసుకొని జీవించడానికి అవసరమైన మేధ, అవయవములు పెంపొందించుకుంటాడు. మనిషి తొలుత తల్లిలోని శరీరాంతర్భాగమై ఎదిగి అమ్మలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తాడు. ఈ భూమిపై మనుగడ సాధించడానికి అమ్మ తన బిడ్డకు అర్హత కలిగిస్తుంది. ఈ శరీరం ద్వారా ఇహంలోనూ, పరంలోనూ ఏది సాధించినా మనిషికి ఆలంబన, ప్రాతిపదిక తల్లే ! తన సంతానం సమాజంలో గౌరవంగా జీవించాలనీ, పరంపరాభివృద్ధి సాధించాలనీ అమ్మ మనసా వాచా కర్మణా అభిలషిస్తుంది. అందుకోసం ఆ తల్లి చేసే త్యాగాలు అపారమైనవి. తనను తాను జ్వలింప జేసుకొంటూ తన సంతానానికి వెలుగును ప్రసాదిస్తుంది. *** కష్ట సాధ్యమయిన అమ్మ పాత్ర అమ్మలోని అవ్యాజ ప్రేమానురాగాలు ఏ కొలబద్దకూ అందనివి. అమ్మ పాత్ర అత్యంత కష్ట సాధ్యమైనది. ఈ పాత్ర నిర్వహించడంలో అమ్మ శారీరక మానసిక బాధలను కూడ లెక్క చేయదు. అటువంటి తల్లికి నేటి సమాజంలో లభిస్తున్న స్థానం దయనీయమైంది. కుటుంబంలోని వ్యక్తుల నుండి ప్రేమానురాగాలు కరువై వృద్ధాశ్రమాల్లో జీవిస్తున్న తల్లుల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంది. జీవిత చరమాంకంలో నానమ్మగానో,అమ్మమ్మగానో మనుగడ సాగించాల్సింది పోయి 'ఆయాలు'గా, అనాధలుగా జీవిస్తున్నారు. కన్నా! “రా!" అని లాలించి పెంచిన తల్లిని కన్నవారు - కాశీకైనా కాటికైనా పొమ్మని సూచిస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. 米米米 అమ్మ గర్భమే గర్భగుడి 15 దైవ జీవ భావాలకు ఆలవాలమైన అమ్మ గర్భమే శిశువు ఆవిర్భానికి కొలువైన గర్భగుడి. అమ్మకు అమ్మ అయి పుడితే తప్ప తీరనిది ఈ జన్మాంతర ఋణభారం. నెల తప్పడం తల్లితనం పరీక్ష ఉత్తీర్ణతలో మొదటి మెట్టయితే... క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో పండంటి బిడ్డను కనటం చివరి మెట్టు. ప్రాణానికన్నా తాను ఎక్కువగా ప్రేమించే నాధుని నిజ ప్రాణ ప్రతిబింబాన్ని ఆ నాథుని చేతిలో పెట్టాలనే ఏ వివాహిత అయినా కోరుకుంటుంది. ఆ ప్రయత్నంలో తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని నైజం ఆమెది. (-ఈనాడు సంపాదకీయం, తేది 24-09-2011) మమ్మీగా మారిన అమ్మ *** 'నమాతుః పరదేవతా' తల్లిని మించిన దైవం లేదు. తల్లిని మించిన గురువు లేడు. తల్లిని మించిన హితుడు లేడు. తల్లిని మించిన పరతత్వం లేదు. తల్లిని మించిన వస్తువు లేనే లేదు. ప్రతీ జీవికీ తల్లే పరమాత్మ! భారతీయులకు తల్లి దైవ సమానం. ప్రపంచంలో ఏ సంస్కృతీ నేర్పని, నేర్వలేని సంస్కారం మన భారతీయులది. 'మాతృదేవోభవ' అని చెప్పిన హిందూ ధర్మానికి, సంస్కృతికి చేతులెత్తి నమస్కరించాలి. సనాతన ధర్మ సౌరభాలు మాతృభూమి, మాతృభాష, మాతృసంస్కృతి అంటూ మాతృదేవత గొప్పదనాన్ని తెలియ జెప్పింది మన కర్మభూమిలోనే, మన జన్మభూమిలోనే! విద్యకు అధిష్ఠాన దేవత సరస్వతి! ధనానికి మూల దేవత లక్ష్మి! బలానికి అధి దేవత పార్వతి! మంత్రానికి మూల దేవత గాయత్రి! అందరూ మూర్తులే! ప్రతి మనిషికీ తల్లే ప్రధమ గురువు. ప్రతిబిడ్డ మొదటి పాఠాలు తల్లి వద్దే నేర్చుకుంటాడు. ప్రతీ శిశువు తన నోటి నుండి మొదటిసారిగా పలికే మాట 'అమ్మ'. కాని ఈ నాటి తల్లులందరూ విదేశీ భాష మోజులో 'అమ్మా' అని అనిపించుకోవడము చిన్నతనంలా భావిస్తున్నారు. తద్వారా తమ విలువలను తామే పోగొట్టుకుంటున్నారు. పరదేశ సంస్కృతితో పెరిగిన పిల్లలు పెద్ద అవగానే తల్లిదండ్రులకు దూరమవుతున్నారు. కొన్ని దేశాలలో చనిపోయినవారి భౌతిక కాయాన్ని భద్రపరిచేవారు. అటువంటి దానిని 'మమ్మీ' అంటారు. అంతటి అశుభమైన పదం పిల్లల నోటంట పదే పదే పలికించుకొని మురిసిపోతున్నారు, అశుభాన్ని ఆహ్వానించుకుంటున్నారు ఇప్పటి తల్లులు. 'అమ్మ' పదం అమృత సమానము 'మమ్మీ' పదం మృత్యు సమానము. * * * ప్రేమించే గొప్ప హృదయం అమ్మది. మన ముఖం చూడక ముందే, మన గొంతు వినక ముందే, మన గుణం తెలియక ముందే, మనని ప్రేమించే గొప్ప హృదయం-అమ్మ! తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు జీవితాన్నిచ్చింది. - అమ్మ! అనేక జన్మలెత్తుతున్న అమ్మ శ్లో॥ న పిత్రో రధికం కించి - త్రిలోక్యాం తనయస్యహి | గర్భధారణ పోషాభ్యాం - పితుర్మాతాగరీయసీ ॥ (-సంస్కృత కాశీఖండము) ముల్లోకములలోనూ తల్లే అధికము. గర్భధారణ, పోషణ అనెడివి ఉన్నతండ్రి కంటె తల్లియే అధికము. ఇది మానవులలోనే కాక సకల జీవరాశులలోను ఉన్నది. ప్రసవమనునది స్త్రీకి పునర్జన్మయే. కొన్ని వర్ణములలో పురుషునికి ఒక సంస్కారము చేత ద్విజన్మత్వము కలుగును కాని స్త్రీ ఒకే జీవితములో బహు ప్రసవముల ద్వారా అనేక జన్మలెత్తుచున్నది. కడుపుతో ఉన్న స్త్రీ గర్భమును తత్త్వవేత్తలు దేవాలయములోని గర్భాలయమని పరిగణింతురు. పురుషుని కంటే స్త్రీలో సహనము, సంయమనము, సాహసము, ఔచిత్యము, కుశలత, నిశిత బుద్ధి - ఇత్యాదులు అధికముగా ఉండును. ఎన్ని పురుష జన్మలెత్తిననూ కనీసము ఒక జన్మలో నైనను స్త్రీగా జన్మించనిదే పరిపూర్ణత రాదని పెద్దలు చెప్పుదురు. సాటిలేని గొప్పదనం అమ్మది (- గాయత్రీ దివ్యశక్తి గ్రంథములోనిది) *** సాటిలేని గొప్పదనం అమ్మది శ్లో॥ ఉపాధ్యాయాత్ దశాచార్యః - ఆచార్యాణాం శతం పితా | సహస్రంతు పితౄన్ - మాతా గౌరవేణాతిరిచ్యతే |Comed తా॥ పదుగురు ఉపాధ్యాయుల కంటె ఒక ఆచార్యుడు, నూర్గురు ఆచార్యుల కంటె ఒక తండ్రియు, వేయిమంది తండ్రుల కంటే ఒక తల్లియు గౌరవము చేత గొప్ప అగును. *** ఆదిశంకరాచార్యుల వారి మాతృపంచకం ఆదిశంకరాచార్యుల వారు సన్యాసాశ్రమము స్వీకరించినప్పుడు ఆయన తల్లి తల్లడిల్లినప్పుడు, తల్లితో 'అంత్యదశలో ఉన్నప్పుడు తనను తల్చుకోగానే వస్తాను' అన్నారు. ఆవిధంగానే తల్లి ఆర్యాంబ కాలడిలో మరణశయ్యపై ఉండి తనను తల్చుకోగానే వచ్చి ఉత్తరక్రియలు (అంత్యక్రియలు) నిర్వహించారు. ఆ సందర్భంలో ఆదిశంకరాచార్యులవారు చెప్పిన ఐదు శ్లోకాలు ‘మాతృపంచకం'గా ప్రసిద్ధి చెందాయి. మనస్సులను కదిలించాయి. 1వ శ్లోకం శ్లో॥ ముక్తామణిస్తం నయనం మమేతి - రాజేతి జీవేతి చిరం సుతత్వం | ఇత్యుక్త వత్యా స్తవవాచి మాతః - దదామ్యహం తండులమేవ శుష్కమ్ ॥ తా॥ అమ్మా ! ‘నువ్వు నా ముత్యానివిరా ! నా రత్నానివిరా! నా కంటి వెలుగువు. నాన్నా! నువు చిరంజీవిగా ఉండాలి' అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలను వేస్తున్నాను. నన్ను క్షమించు. 2వ శ్లోకం శ్లో|| అంబేతి తాతేతి శివేతి తస్మిన్ - ప్రసూతికాలే యదవోచ దుచ్చెః | కృష్ణతి గోవింద హరే ముకుందే - త్యహో జనన్యై రచితోయ మంజలిః || తా॥ పంటిబిగువున నా ప్రసవకాలములో వచ్చే ఆపుకోలేని బాధను 'అమ్మా ! అయ్యా ! శివా ! కృష్ణా ! హరా! గోవిందా !' అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను. 3వ శ్లోకం శ్లో॥ ఆస్తాం తావదియం ప్రసూతి సమయే దుర్వార శూలవ్యథా నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యా చ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభార భరణ క్లేశస్య యస్యా క్షమః దాతుం నిష్కృతిమున్నతోపి తనయః తస్యై జనన్యై నమః తా॥అమ్మా! నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి శూలవ్యధను (కడుపునొప్పిని) అనుభవించావో కదా! కళను కోల్పోయి, శరీరం శుష్కించి ఉంటుంది. మలముతో శయ్య మలినమైనా - ఒక సంవత్సర కాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా! ఎవరూ అలాంటి బాధను సహించలేరు. ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి ఋణాన్ని తీర్చుకోగలడా? అమ్మా! నీకు నమస్కారం చేస్తున్నాను. 4వ శ్లోకం శ్లో॥ గురుకుల ముప సృత్య స్వప్న కాలేతు దృష్ట్యా యతి సముచిత వేషం ప్రారురోద త్వముచ్చైః గురుకుల మథ సర్వం ప్రారుదత్తే సమక్షం సపది చరణయోస్తే మాతరస్తు ప్రణామః తా॥ కలలో నేను సన్యాసి వేషంలో కనపడేసరికి బాధపడి మా గురుకులానికి వచ్చి పెద్దగా విలపించావు. ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ బాధ కలిగించింది. అంత గొప్పదానివైన నీ పాదాలకు నమస్కరిస్తున్నాను. 5వ శ్లోకం శ్లో॥ న దత్తం మాతస్తే మరణ సమయే తోయ మపివా స్వధా వా నో దత్తా మరణదివసే శ్రాద్ధ విధినా న జప్త్వా మాతస్తే మరణ సమయే తారక మను రకాలే సంప్రాప్తే మయి కురు దయాం మాతర తులామ్ తా॥ అమ్మా! సమయం మించిపోయాక వచ్చాను. నీ మరణ సమయంలో కొంచెం నీళ్ళు కూడ నేను నీ గొంతులో పోయలేదు. శ్రాద్ధ విధిని అనుసరించి 'స్వధా' ను ఇవ్వలేదు. ప్రాణము పోయే సమయంలో నీ చెవిలో తారకమంత్రాన్ని చదవలేదు. నన్ను క్షమించి నాయందు దేనితోను సమానము కాని దయ తల్లీ! * * * - ఆది శంకరాచార్యులు పిన్నవయస్సులోనే భవబంధాలను త్యజించి సర్వసంగ పరిత్యాగి అయ్యారు. ఆయనను సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుని సనాతన ధర్మ సౌరభాలు అవతారంగా భావిస్తారు. అటువంటి ఆయన తన తల్లి మృత్తికి శోకిస్తూ పలికిన శ్లోకాలు కన్నతల్లి స్థానాన్ని విశదపరుస్తున్నాయి. 米米米 తల్లి ఋణం తీర్చలేనిది దేవ, ఋషి, పితృ ఋణాలు తీర్చవచ్చునేమో గాని మాతృఋణం తీర్చలేనిది. మోక్ష మార్గాన్ని చూపే గురువు కన్నా, మోక్ష స్వరూపమైన తండ్రికన్నా, జన్మనిచ్చిన తల్లి భూమి కన్నా విలువైనది. తల్లిని పూజించడం కంటే గొప్ప లేదు! తల్లి ఋణం తీర్చలేనిది, తల్లి శాపం త్రిప్పలేనటువంటిది. అనుభవించక తప్పదు. తల్లిని గౌరవించకపోయినా, హీనంగా చూసినా లేదా వృద్ధాప్యంలో వదిలేసినా రౌరవాది నరకాలు తప్పవని శాస్త్ర కర్తలు నిర్ధారించారు. 米米米 శ్లో॥ జ్ఞాన మూలమిదం వేదమ్ భార్యా మూల మిదం గృహమ్ కృషి మూల మిదం ధ్యానమ్ ధనమూల మిదం జగత్ ॥ తా॥ వేదమే జ్ఞానానికి మూలము. గృహమునకు మూలము భార్య, ధాన్యమునకు మూలము వ్యవసాయము. జగత్తునకు మూలము ధనము. 



********************************************************** amma prema.pdf - Google Drive amma prema.pdf - Google Drive https://drive.google.com/file/d/1oPF9SHRdnIsauDu3bH46kcTFNor9ix6K/view?usp=drive_link 

మంచిమాట ..... మిమ్మల్ని క్రిందికి లాగినప్పుడు వినయంగా ఉండడం గొప్పకాదు, కానీ మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతున్నప్పుడు వినయంగా ఉండడమే గొప్పు..

Tuesday, July 2, 2024

లలిత గీతములు & భక్తి గీతములు గానం: P. శంభుప్రసాద్: PART 02

చిగురుటాకు మనసనేది లేనినాడు వాణీ వీణా వాదనమున.. ఎదురు చూసిన వెర్రి శబరికి జయ జయ జయ లలితాంబిక సిరులే ఉన్నా.. సౌఖ్యం ఉన్నా అంజలి ఘటియింతు ఏడు కొండల పైకి ఎక్కాలి నీ నవ్వే చాలురా పాలింపవే నను గీర్వాణీ వందనమిదెగైకొనవో లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమారే ....

లలిత గీతములు & భక్తి గీతములు గానం: P. శంభుప్రసాద్: PART 01

లలిత గీతములు & భక్తి గీతములు గానం: P. శంభుప్రసాద్ కవివైనీలో కదిలేఅందం.. ఓ చెలీ ప్రియసఖీ హృదయతంత్రులు మీటి 3. హైలెస్సా..ఆటుపోటులున్నా..ఆశలనుగుతున్నా. 4. నాలో అందం ఈ రూపమే... 5. కలలో నీవైతే... కలయే నిజమైతే 6. కళ్యాణి.. నీ నడకలలో తడి ఆరని 7. వేకువచ్చు వేళాయే.. వెళ్ళివత్తునే 8. వచ్చెనిదె మధుమాసము 9. శిథిలమైన శిలను నేను... 10. నీ చిరునవ్వు సరదాల లోన... 11. పాడనా ఈ గీతం... 12. కోయిలా... కోయిలా.. పాడవే కోయిలా 14. సఖీ నీకై సదా నాలో రచించేనే వసంతం.