Tuesday, March 3, 2026

YENKI PATALU - 30 AUDIOS # AIR Archives (1955) by # AIR Archives (1955)

Narsimha Swami Bangaru Palliki Sri Laxmi Narasimha Patalu Yadagirigutta Templ AND 9 More Bhakti videos

Sri Ayyappa Swami Divya Mahimalu Ayyappa Swamy Songs 2026 Sabarimala Ayyappa#More 9 Bhakti Videos

10. Sreekara Subhakara Pranava Swarupa Lyrical Trinetram S. P. Balasubrahmanyam Telugu Hit Song

02. Sri Raghavendra Swamy Darshanam Mantralayam Special Songs 2026 God New Songs Vmc Deveotional

YENKI PATALU - NANDURI SUBBA RAO

YENKI PATALU - NANDURI SUBBA RAO

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః Om Namo Bhagavate Vasudevaya Narayana Hari Govinda Bhakti Patham

Mantralaya Raghavendra Swamy Devotional Song Hema Chandra Ravindra Gopala Pramod Puligilla by Hema Chandra

Monday, March 2, 2026

Sri Sukh Brahmma Ashramam, Sri Kalahasthi, AP Guru Peetam 1st March 2026 ETV Life Spiritual

“Ai Mere Watan Ke Logon” song #Lata Mangeshkar Live Performance

 

 “Ai Mere Watan Ke Logon” song #Lata Mangeshkar  Live Performance

Here are less-known and truly interesting facts about “Ai Mere Watan Ke Logon” 🇮🇳 — many Indians don’t know these even today:

🌟 1. Lata Mangeshkar did not take a single rupee

Lata ji sang the song free of cost.

She said:

“This song is not for money. It is for my country.”

🌟 2. Poet Pradeep wrote it in just one night

Kavi Pradeep wrote the entire song overnight, deeply disturbed by news of soldiers dying in the 1962 war.

He later said he could not sleep while writing it.

🌟 3. No hero, no actress, no film — only the nation

At that time, patriotic songs were usually part of movies.

But Pradeep strictly refused to sell it to any film producer.

He said:

“This song belongs only to Bharat Mata.”

🌟 4. Nehru cried silently, not openly

During the live performance, Jawaharlal Nehru:

removed his rose from his coat

held his handkerchief to his eyes

sat silently till the song ended

Many people noticed tears falling on his kurta.

🌟 5. After the song, Nehru hugged Lata ji

After the performance, Nehru went backstage and said:

“Tumne mujhe rula diya.”

(You made me cry.)

This moment became legendary in Indian cultural history.

🌟 6. The song almost got rejected

All India Radio initially felt:

it was too sad

not “entertaining enough”

might lower public morale

But after the Republic Day performance, AIR played it repeatedly.

🌟 7. The word “China” was never mentioned

Though the song was about the 1962 war, Pradeep never mentioned China.

He wanted the song to be:

about sacrifice

not hatred

not revenge

Only remembrance.

🌟 8. Soldiers cried hearing it on borders

Indian Army units later reported that when the song was played:

jawans wept openly

many stood up and saluted the radio

It became an emotional anthem in military camps.

🌟 9. It is played only on special national occasions

Doordarshan and AIR follow an unwritten rule:

not played casually

reserved for national remembrance days

Out of respect.

🌟 10. Even today, no remake is allowed

The government and Pradeep’s family have never allowed remix versions.

They believe:

“Some songs must remain pure.”

🌟 11. Lata ji herself said — this was her greatest song

Among thousands of songs she sang, Lata Mangeshkar once said:

“If I am remembered for only one song, let it be Ai Mere Watan Ke Logon.”

🌟 12. No musical instruments in the beginning

The song begins softly to resemble:

silence after death

emptiness of war

mothers waiting at home

Only later does music slowly rise.

🌟 13. Pradeep refused any award for it

He said:

“The tears of my Prime Minister are greater than any award.”

🌟 14. The song united a broken nation

After the 1962 defeat, India felt humiliated and broken.

This song:

restored emotional strength

united people beyond politics

reminded the nation of courage

🌟 15. Many freedom fighters called it a “second national anthem”

Though unofficial, many leaders said:

“If there is one song after Jana Gana Mana, it is this.”

🇮🇳 Final truth

This is not just a song.

It is:

history

prayer

tribute

tear

promise

That’s why even after 60+ years, when it plays —

India becomes silent.



🇮🇳🫡🚩🔥💞

ఆత్మ యొక్క యిట్టి స్వభావమును మననము చేయుచుండినచో

  *స్థూల పంచభూతములు స్థూలమగు శరీరమునే బాధింపగలవు కాని మనసుకు కాదు అట్టిచో అతి సూక్ష్మమగు ఆత్మనెట్లు అయ్యవి భాధించగలవు...? || గీత -2 అ -23 ||

*ఆత్మ యొక్క యిట్టి స్వభావమును మననము చేయుచుండినచో 

జీవునకు అపరిమిత ధైర్యము చేకూరగలదు. || గీత -2 అ -22 ||

*జ్ఞానము సంపాదించి కర్మ సంచయ మొనర్చుకొని, మరల జన్మగాని,

 మరణకు గాని లేకుండ చేసుకొనుటయే సర్వోత్తమమని భగవానుడు 

మున్ముందు తెలుపుతున్నాడు.|| గీత -2 అ -25  ||

*మనస్సులయించినపుడు శేశించు వస్తువే అత్మ,

మనస్సును శుద్ధమొనప్పుట ద్వారా అద్దానిని అధిష్ఠానమందు

లయింపజేయునపుడు మిగులునదియే ఆత్మ.

ఈప్రకారముగ మనోవిలయముచే లభించు వస్తువు మనస్సున

 కెట్లు గోచరించపగలదు?

శరీరము నశించినను ఆత్మ నశింపదని చెప్పినందువలన

శరీరము కంటె వేరై ఆత్మ సాక్షిగనున్నాడని స్పష్టమగుచున్నది.

కావున మనుజుడు నశించు శరీరముతో తాదాత్మ్యము 

చెందక నహింపని ఆత్మయే తానని నిరంతరము 

భావించుచుండవలెను. దానిచే అపరిమిత

ధైర్యము, ఆనందము కలుగును. నిర్భయత్వము జనించును,

మరణ భయము పటాపంచలై పోవును. || గీత -2 అ -20  ||

*నిష్కామకర్మ, భక్తి, వైరాగ్యము, ధ్వానము, అమానిత్వాది సద్గుణములు మున్నగు సాధనముల ద్వారా హృదయమును వినిర్మల మొనర్చుకొని ఆత్మవిచారణ ద్వారా అద్దానిననుభూత మొనర్చు 

కొనవలయును (ఆత్మను). || గీత -2 అ -29 ||

*తాను దేహము కాదనియు, దేహియగు ఆత్మయే యనియు 

తలంచుట మాత్రమే యగును. దేహ భావనచే దుఃఖము,

ఆత్మ భావన చే   దుఃఖరాహిత్యము జీవులకు కలుగుచుండును.

|| గీత -2 అ -30 ||

|| గీత -2 అ -28 ||తా:- పుణ్యకార్యతత్పరులగు ఏ జనులయొక్క పాపము నశించిపోయినదో, అట్టివారు(సుఖదుఃఖాది)

రూప జ్ఞానమునుండి విడువబడినవారై దృఢవ్రతులై నన్ను సేవించుచున్నారు.

వ్యాఖ్య:- పరమాత్మను దృఢవ్రతులై సేవించినవారికే బంధవిముక్తిలభించును. కాబట్టియే అనేకులు దైవసాక్షాత్కారమునకై పెక్కు వ్రతములు, నియమములు శీలించుచుందురు. మౌనవ్రతము, ఉపవాసవ్రతము, బ్రహ్మచర్య వ్రతము, స్వాధ్యాయ వ్రతము మున్నగువానిని ఆచరించుదురు. కాని వానియందు పెక్కురికి దృఢత్వము (స్థిరత్వము) ఏర్పడుటలేదు. దానికి కారణమేమియో భగవాను డిచట స్పష్టముగ తెలిపిరి. అనేక జన్మార్జిత పాపమే దానికి కారణము. ఆ పాపము హృదయమున నున్నంతవఱకు పరమార్థసాధనలందు అడ్డుకలుగుచునేయుండును. మురికిగుడ్డకు రంగు అంటనట్లు, చవిటినేలలో విత్తనము మొలవనట్లు, పాపకల్మషయుక్తమగు హృదయమున పరమార్థబీజము లంకురింపజాలవు. అట్టివారొకవేళ వ్రతములను వానియందు దృఢత్వముకలుగదు. విరేచనమునకు ప్రారంభించినను చక్కగ కొనసాగించలేరు. మందుతీసికొనినవాడు ఇంటియందు మెదలక ఉండదలచినచో నెట్లు సాధ్యపడదో, ఆ మందు కడుపులో త్రిప్పి వానిని బయట కెట్లు సాగనంపునో, అట్లే పాపము, రజోగుణము చిత్తమునగలవాడు ధ్యాననిష్ఠయందు కూర్చొనినను, అవి వానిని లేపి బహిర్ముఖునిగా నొనర్చును. కాబట్టి భగవానుని దృఢవ్రతములతో  సేవింపవలెననిన లోనగల పాపము నశింపవలెను. అది యెట్లు నశించునో ఆ పద్ధతినిగూడ శ్రీకృష్ణపరమాత్మ ఈశ్లోకమందు విశదీకరించిరి.

పుణ్యకర్మలచేతను, అనేక సత్కార్యము లాచరించుటవలనను, నిష్కామకర్మయోగానుష్ఠానము చేతను జీవునిపాపమంతయు నశించిపోవును. కావున సాధకుడు మొట్టమొదట అనేక సత్కార్యములను, దానధర్మములు, పరోపకారము, దివ్యమంత్రజపము - మున్నగువానిని విరివిగ ఆచరించవలెను. కొందఱు శుష్కవేదాంతులు “పుణ్యకార్యములుకూడ బంధనమును కలుగజేయును, కావున వాని నాచరించరాద”ని చెప్పుదురు. అది వారియొక్క ఉన్మత్తప్రలాపమేకాని, అన్యముకాదు. ఏలయనిన భగవానుడు గీతయందు పుణ్యకార్యములను, సత్క్రియలను తప్పక చేయవలెననియే పెక్కుచోట్ల ఆదేశించిరి. ఇంతియేకాదు వానిని వదలవద్దనికూడ హెచ్చరించిరి*. భగవద్వాక్యమునందు విశ్వాసముగలవారు ఆ యాదేశమును తప్పక పాలించవలెను. పుణ్యకార్యములను జేయువానికి, శుభాచరణశీలునకు దుర్గతి యెన్నడును కలుగదనికూడ నిదివఱలో భగవానుడు చెప్పియుండుట గమనింపదగినది  కేవలము అతీతస్థితి యందుండువానికి,

ఇంద్రియమనంబులను దాటియున్నవానికి, నిశ్చల సమాధినిష్ఠునకు పుణ్యము, పాపము లేవని చెప్పిన వాక్యమును సామాన్యులగు సాధకులకు అన్వయించ రాదు. ఏలయనిన,డానిచే ఆ సాధకుని చెడగొట్టినట్లేయును. వారికి ఉభయభ్రష్టత్వము కలుగజేసినట్లేయగును. తురీయస్థితియందున్న అట్టి జీవన్ముక్తులు కూడ వ్యుత్థానదశయందు లోకాదర్శము కొఱకు పుణ్యకార్యములను, సత్క్రియలను చేయుచునేయుందురు. ఈ ప్రకారముగ పుణ్యకార్యములచే పాపము నశించినవారు సుఖదుఃఖాదిద్వందమోహరహితులై 

పరమాత్మను దృఢవ్రతములతో సేవించుందురు. దానిచే వారికి ఆత్మసాక్షాత్కారము లభించి బంధవిముక్తి సిద్ధించుచున్నది. ఈ శ్లోకముద్వారా శ్రీకృష్ణపరమాత్మ జనుల కీప్రకారముగ హెచ్చరికచేయుచున్నారు-

‘ఓ జీవులారా! మున్ముందు మీచిత్తములందుగల పాపపంకిలమును, జన్మజన్మాంతరమునందు  గావింపబడిన  దుష్కార్యములకు సంబంధించిన కల్మషబీజములను, సత్క్రియలద్వారా పుణ్యకార్యాచరణముద్వారా క్షాళనముచేయుడు. అపుడే మీకు సుఖదుఃఖాదిద్వంద్వవ్యామోహ మంతరించి దైవవ్రతమందు దృఢత్వమేర్పడును. దానిచే మోక్షము సన్నిహితమగును'. కాబట్టి సాధకులు భగవద్వాక్యమునందు విశ్వాసముగలిగి పుణ్యాచరణతత్పరులై మెలగవలెను.  

ఈశ్లోకముద్వారా మఱియొకవిషయము స్పష్టమగుచున్నది. అది యేది యనిన - పరమార్ధరంగమున సాధకుడు కొన్నిదృఢనియమములను, వ్రతములను ఏర్పఱచుకొనవలెను. లేనిచో మాయ దారి ఇవ్వదు. దుర్బలనియమములచే మాయ లొంగదు. మనస్సు స్వాధీనపడదు. రేకుగొడ్డలిచే బలమైనవృక్షము తెగదుగదా! 'ఈ రోజున ఇన్ని వేల జపముచేయనిదే భుజింపను, ఇన్ని అధ్యాయములు పారాయణము చేయనిదే మఱియొకపనిని తాకను' - ఈ ప్రకారముగ దృఢనిశ్చయములను గావించుకొనవలెను.

ఈ శ్లోకమువలన ఈ క్రిందివిషయములు స్పష్టపడుచున్నవి 

(1) మోక్షము పొందవలెననిన సాధకుడు దృఢవ్రతములను శీలింపవలెను.

(2) దృఢవ్రతము గలుగవలెననిన చిత్తమునందలి పాపము నశించవలెను.

(3) పాపము నశించవలెననిన పుణ్యకార్యములను, సత్కర్మలను లెస్సగ నాచరింపవలెను.

ప్ర:- భగవంతుని దృఢవ్రతులై ఎవరు సేవింపగలరు?

ఉ:- పాపము నశించినవారు.

ప్ర:- పాప మెట్లు నశింపగలదు?

ఉ:- పుణ్యకార్యములచే.

ప్ర:- పాపము నశించిన కలుగు ఫలితము లెవ్వి ?

ఉ:-(1) ద్వందమోహవినాశము (2) ధ్యానద్రుడత్వము.

*************************************************************************

Sarigamalu Movie songs

లేలే బాబా నిదురలేవయ్యా #sai baba songs



Neerajanam Melody Songs



Sunday, March 1, 2026

Mesmerizing Song Of Lord Krishna In Telugu Krishna Govinda Krishna Gopala Appala Prasad Garu by Appala Prasad

Nee Guna Ganamu Nee Pada Dhyanamu Hey Radheshyam

Chaitanyavignanam Swamisundarachaitanyananda

Narayana Krishna Hari Narayana Krishna

MURALIMANOHARA Sachin Limaye

Narayana Nee Namame Gati Ika Korikalu Maaku Konasagutaku

Om Namah Shivaya Instrumental

రామ రామ జయరాం #swami_sundara_chaitanyananda

రఘుపతి నామము #swami_sundara_chaitanyananda

SHRAVYA MUSIC

ఓం సాయిఈశ్వర # melody fusion songs

TELUGU WIKI QR CODES: సుందర చైతన్యానంద;చైతన్య భగవద్గీత;చైతన్య రామాయణము;సుందర చైతన్య ఆశ్రమం;చైతన్య భాగవతము#SHARE ALL

 ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా ARCHIVE ORG. లో post చేయబడిన videos & audios & pdf books & images అన్నీ ఈ QR CODE ద్వారా ఆ web లో ఇవ్వబడిన links ద్వారా view or download చేసికొన వచ్చును ఈ QR CODE images ను download చేసికొని ఆత్మ బంధువులకు xerox చేసి share చేసి పూజ్య గురుదేవులు  మనకు అందించిన జ్ఞానమును విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పమును మనం అందరం కలసి ముందుకు తీసికొని వెళదాం .. జై గిరిధారి .. జైజై గిరిధారి


SARVAVEDASARAM SAI SANKEERTHANAM

Sri Rama Nee Nama Mokate Nityamura by Ghantasala

Top 20 Shri Krishna Bhajans Morning Bhajans, Krishna Songs Best Collection Of Krishna Bhajans

LIVE 75th Independence Day Celebrations In Hyderabad Tank Bund TV 9

Cinematic Eagle View Durgam Lake Hyderabad City Part 2 4 K DJI

CM KCR Speech At Swatantra Bharatha Vajrotsavaalu HICC Hyderabad T News

KCR .బయోగ్రఫీ KCR . Biography KCR Real Story

దరిపల్లి జయకుమార్ ఆచార్య Mridangam& Tabala#TELUGU WIKI QR CODE

 

జోగవజ్జుల దత్తాత్రేయులు FLUTE ARTIST TELUGU WIKI QR CODE:

 

SUNDRA CHAITANYANANDA TELUGU WIKI QR CODE VIEW&SHARE

 

Saturday, February 28, 2026

టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) #TVRK_Murthy Books & Telugu Wiki Link

  

TVRK_Murthy Books & Telugu Wiki Link:

https://w.wiki/HN5F

Books Link: 

https://archive.org/details/@yedavalli_sudarshan_reddy/lists/5/tvrk_murthy?sort=title


Dear Devotees,

For books, please contact +918688616060 — WhatsApp message only. 

Share your complete Address, phone number, and pincode 

పుస్తకాల కోసం దయచేసి+918688616060 కు (వాట్సాప్ సందేశం మాత్రమే) పంపండి.

పూర్తి చిరునామా, ఫోన్ నంబర్, మరియు pincode తప్పనిసరి ఉండాలి. 


Team – Lord of Seven Hills




ఆలయ ప్రాంగణంలో అమానవీయం#నమస్తే తెలంగాణ#వనపట్ల సుబ్బయ్య 94927 65358#jaitelangana #kcr

నమస్తే తెలంగాణ E-PAPER ఆలయ ప్రాంగణంలో అమానవీయం మహాయోగి దున్న ఇద్దాస్ ప్రబోధించిన నేల. అక్క మహాదేవి నడయాడిన నేల. పుట్టపాగ మహేంద్రనాథ్, ఎస్ జైపాల్రెడ్డి, సురవరం సుధాకర్రెడ్డి, పాలెం సుబ్బయ్యల పురిటిగడ్డ. కుల రహిత సమాజానికి, సర్వ మానవ సౌభ్రాతృత్వానికి, సామాజిక వికాసానికి ఎందరో కారణజన్ములు జన్మించిన కందనూలు (నాగర్ కర్నూల్) నేలలో కుల అహంకారానికి రెండు నెలల పసిపాప బలికావడం మానవత్వానికి మచ్చ. కుల వివక్షకు వ్యతిరేకంగా పత్రికలు, ప్రజా వేదికలు, సంఘాలు నిత్యం రాస్తూ మాట్లాడుతూనే ఉన్నాయి. బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్, కబీర్ నారాయణ, గురు సంత్ రవిదాస్ వంటి మహనీయుల బోధనలు నిత్యం ప్రతిధ్వనిస్తున్నా, కులం పేరుతో దూషిస్తూ అంటరానితనం పాటించడం నేరమని ఘోషిస్తున్నా అడుగడుగునా కులోన్మాదం పడగెత్తడం అమానవీయం. - వనపట్ల సుబ్బయ్య 94927 65358 పసికూనలు. దేవుళ్లతో సమానం. కాలెత్తి ఎలా తన్నబుద్దయింది. ఆడబిడ్డంటే అమ్మగదా! అమ్మనెట్లా చంపబుద్ధవుతుంది దేవుడు అందరికీ సమానమే కదా వెలివేతలెందుకు మల్లన్న దేవుడు ఓ కులం జాగీరా? కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలకు శాంతిభద్రతలు ఎండమావులు అయ్యాయి. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలపై దాడులు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. తెలంగాణ సభ్యసమాజం తలదించుకునేటట్టుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంతమంది పోలీసులు నేరస్తులకు అండగ ఉండటం విచారకరం. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం నిబంధనలను నిదితులను గాలికి వదిలేసిన ఘటన కుమ్మెర దేవాలయ జాతరలో జరిగింది. 'నా భర్తను కొట్టకండయ్యా..పచ్చిబాలింతను... రెండు నెలల పసికందు నా బిడ్డ ముఖమన్నా చూడండి.. మీ కాల్మొక్కుత' అని కాళ్లమీద పడి చిలికేశ్వరం గణేశ్ భార్య మౌనిక వేడుకున్నా కనికరించని కుల దురహంకారులు కాళ్లతో తన్నడంతో పసిబిడ్డ మృతి చెందింది. ఈ అనాగరిక ఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకి పోతున్నా కనీసం స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తున్నది. జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మెర గ్రామంలో ఏటా శివరాత్రి సమయంలో (మల్లికార్జునుడు) మల్లన్న దేవుడి జాతర జరుగుతుంది. ఈ నెల 18న గ్రామానికి చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన చంద్రకళ, కీర్తి, చిలికేశ్వరం గణేశ్, మౌనిక దైవ దర్శనం కోసం వెళ్లారు. రజక వర్గానికి చెందిన చిలికేశ్వరం గణేశ్, దళిత సామాజిక వర్గానికి చెందిన మానికది కులాంతర వివాహం. వీరికి రెండు నెలల పాప ఉన్నది. ఆలయానికి వెళ్లిన సమయంలో వంద రూపాయలు ఎంట్రీ టికెట్ విషయంలో ఆలయ నిర్వాహకులకు గణేశ్ కు మధ్య వాదన జరిగిగింది. 'గ్రామంలో జరుగుతున్న జాతరకు స్థానికులకు టికెట్ లేదు. కదా, మేము దేవుణ్ని మొక్కుతాం' అని అన్నారు. 'ఇంతకుముందు దర్శించుకున్నోల్లెవరూ డబ్బులు ఇవ్వలేదు కదా… అందరూ ఉచితంగానే దర్శనం చేసుకుంటున్నారు. మమ్మల్నే ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? అని అడిగారు. 'మమ్మల్నే నిలదీస్తవా' అంటూ ఆహంకారంతో నిర్వాహకులు ఆలయం తలుపులు మూసేశారు. దేవాలయ జాతర నిర్వహకులైన ఒకే వర్గానికి చెందిన పలువురు గణేశ్ పై దాడికి పాల్పడ్డారు. కులం ఆధారంగా ఆలయ ప్రవేశానికి నిరాకరించారని వారిపై జరిగిన అనాగరిక దాడిని బట్టి తెలుస్తున్నది. ఇప్పుడు ఆ తల్లి ముఖంలో చూడండి భరతమాత గోసను.. ఆ తల్లి.. గర్భశోకాన్ని ఏ దేవుడు తీర్చుతాడు... ఏ ఆలయ నిర్వాహకులు ఓదార్చుతారు. శ్రీనివాసరెడ్డిపై గణేశ్ చేసిన దూషణతో కూడిన ఆడియో క్లిప్ గ్రామ వాట్సాప్ గ్రూప్ ప్రచారమైందని, దానికి మీరే కారణమంటూ విద్వేషం పెంచుకున్న ఆ ఊరి గ్రామ పెత్తందారులు. గణేశ్ ను పిలిపించారు. అక్కడే ఉన్న కొబ్బరికాయల గదిలో అతనిని నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక అరుస్తుంటే అతని భార్య మౌనిక, తల్లి చంద్రకళ కన్నీరుమున్నీరయ్యారు. తన భర్తను వదిలిపెట్టండని మౌనిక ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు సరికదా… కాలుతో తన్నడంతో ఆ తల్లి చేతుల్లోని రెండు నెలల పసిపాప కింద పడిపోయింది. బాధితులు వెంటనే పసిబిడ్డను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యం అందుతూనే ఈ నెల 21న చిన్నారి మరణించింది. కుల అహంకారదాడి.. పసి బిడ్డను బలి తీసుకున్నది. తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పుకొంటూ పాలన సాగిస్తున్న. కాంగ్రెస్.. రాచరికపు పాలనను చూపిస్తున్నది. నల్లగొండ, సూర్యాపేటలో ఇలాంటి అహంకార పాలననే నడుస్తున్నది. వెలుగులోకి రాని ఘటనలెన్నో... నిందితులు స్థానిక శాసనసభ్యుడికి, అధికార పార్టీకి వత్తాసు పలుకడంతో బాధితులిచ్చిన ఫిర్యాదుపై సకాలంలో పోలీసులు స్పందించకపోగా బాధితులు పైనే ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టడం ఎంత దుర్మార్గం. బీసీల్లో సామాజిక చైతన్యం రావాలి. అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. చైతన్యం లేకపోవడం వల్ల కూడా అవమానిస్తూ దాడులు, హత్యలు చేస్తున్న దాడులు పెరుగుతున్నాయి. తిరిగి బాధితులపైనే కేసులు మోపుతున్నారని అనడానికి కుమ్మెర ఆలయం వద్ద ఘటనే సాక్ష్యం. కుమ్మెర ఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ముగ్గురు నిందితు లను అరెస్టు చేశామని, మిగతా ఐదుగురు పరారీలో ఉన్నారని చెప్తూ పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజా సంఘాలు, ప్రతి పక్షాల నేతలు ఆదివారం నుంచి వరుసగా ధర్నాలు చేస్తున్నారు. సమాజం, ప్రభుత్వం ఒక తల్లిలా, ఒక తండ్రిలా వ్యవహరించాలి. పేద వర్గాల వారిని కులాలు, ప్రాంతాలు, భక్తి పేరుతో వివక్ష చూపిస్తూ ఆధిపత్యవర్గాల వారికే కొమ్ము కాస్తూ సమాజ వికాసానికి విరుద్ధంగా నిలబడటం చరిత్రకు విద్రోహం, భారత రాజ్యాంగంలో చెప్పినట్టు ప్రతి మనిషికి ఒకే విలువ. ఒకే ఓటు, ఒకే గౌరవం అనే సూత్రాలు మహోన్నతమైనవి. ఆ సమానత్వాన్ని కలకాలం నిలబెట్టాలి. సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించిననాడే మన ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా నిలబడగలుగుతుంది. ఇక కుమ్మరలో చిన్నారి మృతి విషాదకరం. ఈ ఘటనపై సీఎం రేవంత్ నోరు తెరువకపోవడం విచారకరం. ఇప్పటికైనా స్పందించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డిమాండ్ చేస్తున్నాం. (వ్యాసకర్త: తెలంగాణ వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు)

Satya Sodhana-Shakti Sadhana#Dr_యడ్లపల్లి_మోహన్ రావు#సత్య శోధన శక్తి సాధన #pdf

Thursday, February 26, 2026

సిగ్గు శరం ఉందా..మా జోలికొస్తే🔥🔥 .| Madhu Park Residents Fires on CM Revanth

Annamayya Ashtapada Padmaaradhana అన్నమయ్య అష్టపద పద్మారాధన by Shantha Vasantha Trust

ఆ పిల్లాడిని చూస్తే అర్ధం అవుతుంది ఈ ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరిస్తోందో!

Kallem Naveen Reddy Today at 15:40 · ఆ పిల్లాడిని చూస్తే అర్ధం అవుతుంది ఈ ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరిస్తోందో!😡😡 ఆ గుండెను భాదుకునే దృశ్యం నన్ను ఎంతగానో కలిచి వేసింది!

ఇల్లు కూల్చి విగ్రహం కట్టడమేంది Tushar Gandhi Big Shock To Revanth Reddy Gandhi Statue Issue

కేసీఆర్ ఉద్యమ చరిత్ర పై చిన్నారి చిలక పలుకులు.. Cute Little Girl Words About History Of KCR

ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా ARCHIVE ORG. లో post చేయబడిన videos-audios-pdf - images అన్నీ download చేసికొన వచ్చును

  ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా ARCHIVE ORG. లో post చేయబడిన videos-audios-pdf - images అన్నీ download చేసికొన వచ్చును

ఆత్మ బంధువులకు తెలియజేయునది ఏమనగా ARCHIVE ORG. లో post చేయబడిన videos &audios&pdf books&images అన్నీ (మీకు నచ్చి నవి ) మీరు download చేసికొని మీరు whatsup ద్వారా share చేసికొన వచ్చు.
HOW TO DOWNLOAD INTERNET ARCHIVE ORG. FILES ON YOUR DESKTOP: GOOGLE DRIVE UPLOADED VIDEO LINK: https://drive.google.com/file/d/13YLphZ4HECLjxNg2lBFhHJwj4zMMXqff/view?usp=drive_link
THIS IS BEST ADVANTAGE WITH ARCHIVE ORG.WEB.
MY UPLOADS ARCHIVES ORG. LINK:
https://archive.org/details/@sudarshan_reddy330
https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+Sundara+Chaitanyananda https://archive.org/details/@sudarshan_reddy330?query=swami+Vidyaprakashananda+giri
Sundara Chaitanya Telugu wiki link:
https://w.wiki/F7kt
swami Vidyaprakashananda giri Telugu wiki:
https://w.wiki/F8JA
VIEW OUR BHAKTI BLOG:
https://telugudevotionalswaranjali.blogspot.com/2026/01/how-to-download-internet-archive-org.html
https://archive.org/details/@sundarachitanyam_ysreddy/lists/1/chitanya-bhajans-
My profile:
https://www.linkedin.com/in/yedavalli-sudarshan-reddy-203a3017/?lipi=urn%3Ali%3Apage%3Ad_flagship3_feed%3B7YczNulvR2WvQ5c9ShIg0w%3D%3D

KCR SONGS 26 VIDEOS GOOGLE DRIVE LINK FREE DOWNLOAD

  KCR SONGS 26 VIDEOS GOOGLE DRIVE LINK FREE DOWNLOAD

https://drive.google.com/drive/folders/1s7w1qnOb9Ll1H8QcGDZme1aI2GhnJACK





Monday, February 23, 2026

AYYAPPA MELODY SONGS#spbalasubramaniam

జీవిత పరమార్థం #PURPOSE OF LIFE


for salvation.























Guru: Who is that? Child! Why are you so anguished? Student I am blind and groping in darkness unable to perceive the purpose of this life. G: Do you think there is a purpose to this life? S: Isn't there any, master! There were Rishis who learnt and taught Vedas and Upanishads, there kings and Monarchs who conquered the worlds and also the mean and the meaningless. What happened to them all after death, Master? G: You innocent duckling! When the whole world is mad of sensual pleasures with this body, why do you bother what happens after death? Forget about that inquisitiveness. I will teach the way to possess all the eight coveted treasures. Enjoy them. S: No master! No! I enjoyed them all and learnt that they are ephemeral and mean. I hold no desire for them. There is one question that plagues me. Where do we come from? Where do we go? Enough if you clear this doubt. G: When it is beyond the realm of divinity to grasp it, what to speak of mortals? S: If seers like you deny teaching us about it, master, where have we to go? Do you condemn us to this world of strife and the circle of life and death forever? Is there no way out, master for us? G: Why not? There is. This body is equipped to learn the temporal as well as the spiritual or eternal knowledge. This body is the raft for both for anchoring in Sansara or navigate to salvation. Infatuated with the enticing ephemeral world and confusing it to be the only and the lasting, we are rolling on the Potter's Wheel of life and death cycles. We have to realise that all that we see is transitory and there is some primal cause which is permanent that is responsible for this apparent drama. One has to self-experience it internally and that is the purpose of life. S: How can I get that self-realisation, master? G: There are several schools... like the school of intellect, the school of devotion etc. But it is the concerted opinion of elders that Rajayoga is the easiest to follow for salvation. S: G: Rajayoga? Who is going to teach me that, master? When the time comes, God himself shall come to you as Guru and shall teach you. S: For a man groping in utter darkness, you chanced upon me like a beacon. You are my Guru. You are my God. Kindly teach me the secret of that Yoga and unveil the truth. G: Then let me teach you the arcane knowledge. Pay attention to it. Just as you can't convert metal to gold without arresting its quintessence, you can't see the truth unless you arrest your mind. Mind is the chief hurdle that stands between us and salvation. It is the cause of our temporal bonds. If you can conquer your mind, you can conquer everything else. This is called Yoga. When you stand in the state of Samadhi subduing the wavering mind, and the sensual desires, your mind assumes infinite power. Then there is nothing you can't do. The nature that toyed with you thus far becomes itself a toy in your hands. It surrenders to you. Is this what is meant by salvation, master? S: G: No, my child. This is the first step to it. And if you continue to meditate with unwavering mind, and without being fooled by that infinite power, you come out as a self luminous, blissful, eternal and self evident truth. That is what is meant by Tat Tvam Asi. You can see yourself in me. So go ahead and enjoy the fruits of Rajayoga. S: Guru is the creator, Guru is the sustainer, and Guru is the annihilator Guru is a veritable Supreme Being, and to that Guru, I bow my head. 


ఎవరు? నాయనా! నీవు ..... ఎందుకింత ఆవేదన పడుతున్నావు? జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధుణ్ణి, జీవితానికి పరమార్థమంటూ ఒకటుందనుకుంటున్నావా? లేదా స్వామీ? వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు, దేశ దేశాలు జయించిన చక్రవర్తులు సీదా సాదా అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే! వీరంతా మరణించిన తరువాత ఏమౌతున్నారు స్వామి? పిచ్చివాడా! లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే మరణించిన తరువాత ఎమౌతారనే విచారం నీకెందుకు? ఆ విచారం వదలుకో ! నీకు అప్లైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామీ! అవన్నీ అనుభవించి క్షణికములని, క్షుద్రములని తెలుసుకున్నాను. వాటిపై నాకు వాంఛ లేదు. నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే! మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం? ఎక్కడికి పోతున్నాం? ఈ సందేహం నివారించండి! ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదే, మానవులకు సాధ్యం అవుతుందా? మీవంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిక్కెవరు? స్వామీ! మేమీ దుఃఖ భాజనమైన సంసారం లో కృశించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసిందేనా? మానవునికి తరుణోపాయం లేదా స్వామీ? లేకేం నాయనా ఉంది ... ఈ శరీరం విద్యావిద్యలు రెంటితోనూ పుట్టింది. సంసార యాత్రకు మోక్ష యాత్రకు ఇదే సాధనం అవిద్యచే మొహితుడవై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని, దుఃఖ భాజనములమై చావు పుట్టుకుల కుమ్మరిసారిలో తిరుగుచున్నాము. ఇదంతా అనిత్యమని, ఈ నాటకానికంతా కారణమైన మహా చైతన్యం వేరే ఉందని, అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మను భావము పొందాలి అదే జీవిత పరమార్థం.. ఆ ఆత్మానుభవం నాకెట్లా కలుగుతుంది స్వామీ? భక్తి మార్గం తో కొందరు జ్ఞానమార్గం తో కొందరు సాధించారు, కాని, జీవన్ముక్తి కి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం. రాజ యోగమా?! నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ? ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు. కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు, వెలుగు వలె మీరు లభించారు. మీరే నా గురువులు నా దైవం. ఆ యోగ రహస్యం నాకు బోధించి, సత్య స్వరూపం చూపించండి. అతి గుప్తమైన ఆత్మ విద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము. రసాన్ని కట్టేస్తేనే కాని స్వర్ణం కానట్టు, మనస్సుని కట్టివేస్తే కాని సత్యము కనిపించదు. మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం. మనస్సుని స్వాధీనం చేసుకుంటే, మనకు స్వాధీనం కానిదే లేదు. ఆ సాధనే యోగామంటారు. సాంగయోగాన్ని క్రమంగా సాధించి, చిత్త వృత్తులనణచి, సమాధి స్థిరుడవైనప్పుడు, నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది, అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు, నిన్నింత వరకు తన చేత చిక్కిన్చుకుని ఆడించే ప్రకృతి, నీ స్వాధీనం అవుతుంది. 'మోక్షం' అంటే అదేనా! స్వామీ? కాదు నాయన ! అది మోక్షానికి మొదటి మెట్టు. ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక, సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే, స్వయం ప్రకాశము, సచ్చిదానంద మయము, శాశ్వతము అయిన స్వస్వరూపానుభావం కేవల జ్ఞాన రూపంగా నీవనుభవిస్తావు.. ''అంటే అదే! అప్పుడు నువ్వు నేను ఒక్కటే! రాజ యోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు ! గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

వివేకానందవాణి

 

మన దేశం యొక్క ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిపాశ్చాత్య ప్రజలకు పంచిపెట్టడానికిభారత దేశం యొక్క వాస్తవ స్వరూపాన్నిప్రపంచానికి వివరించడానికి శ్రీ వివేకానంద స్వామి 1893వ సంవత్సరంలో కన్యాకుమారి దగ్గర ధర్మదీక్ష స్వీకరించిఅమెరికా దేశానికి ప్రయాణమై వెళ్ళారు. అక్కడ చికాగో నగరంలో జరిగినవిశ్వమత మహాసభలో పాల్గొనిఅమెరికా అంతటా తిరిగిధర్మప్రచారం చేశారు. అది జరిగి ఈ 1993వ సంవత్సరానికి నూరేళ్ళయ్యింది. ఆ ధర్మయాత్ర శతజయంతి సందర్భాన రాజమహేంద్రవరంలోని 'శ్రీరామకృష్ణ మఠంవారు ఆంధ్ర ప్రజాభ్యుదయాన్ని ఆశించివివేకానంద స్వామి వారి బోధనలను ఈ వివేకానంద వాణి రూపంలోవెలువరిస్తున్నారు.

సోదరులారా!
నేను చెప్పబోయే ఉపదేశాలను మీరు సావధానంగా వినండి. మననం చేసుకోండి. వాటికి కార్యరూపం కల్పించిచిత్తశుద్ధితో ఆచరణలో పెట్టండి. పదిమందిలో ప్రచారం చేయండి. నా ఉపదేశాలు సత్ఫలితాలను ఇచ్చాయనీలోకమంతటికీ ఋజువు చేయవలసిన బాధ్యత మీది.

ఉత్తిష్ఠతజాగ్రతప్రాప్యవరాన్‌ నిబోధత!

శ్రీ రామకృష్ణ పరమహంస పేరు వినని వారు  ఎవ్వరూ భారత దేశంలో వుండరు. వారి మహిమ ఖండాంతరాలకు కూడా వ్యాపించింది. నా వాక్కులలో ఏమాత్రం సత్యం వున్నాఆధ్యాత్మిక ప్రకాశం వున్నాఅది నా గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస ప్రసాదమే! దోషాలు మాత్రం నావి.

వర్తమాన ప్రపంచానికి శ్రీ రామకృష్ణులు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసాదేవాలయాలనుమసీదులనుచర్చీలను లక్ష్యపెట్టవద్దు. మత సంప్రదాయాలనుసిద్ధాంతాలను లెక్కచేయవద్దు. ప్రతీ మనిషిలోనూ ఆధ్యాత్మిక శక్తి నిక్షిప్తమై వుంటుంది. దానిని పెంపొందించుకున్నవాడే శక్తి వంతుడు ధన్యుడు. అన్ని మతాలలోనూఅన్ని ధర్మాలలోనూ ఎంతో కొంత మంచి వుండక తప్పదు. అందువలన దేనినీఎవ్వరినీ తూలనాడకూడదు.

మతం అంటే సంప్రదాయాలుసంకీర్తనలు కాదని... మతం అంటే 'ఆత్మ సాక్షాత్కారంఅనీ ఆచరణ రూపంలో ఋజువు చేయండి. అనుభవించగలిగిన వాడే ఆత్మశక్తిని తెలుసుకోగలరు. దానిని సిద్ధింపజేసుకున్నవారే ఇతరులకు బోధించగలరు. అలాంటి వారే మానవజాతికి వెలుగుబాట చూపగల దివ్యజ్యోతులు. ఇదీ వారి సందేశం.

ఇలాంటి మహనీయులు ప్రభవించిన దేశం ఔన్నత్యాన్ని అందుకుంటుంది. లేని దేశాలు అథః పతితం అవుతాయి. అందుకే 'ఆత్మసాక్షాత్కారం చేసికో!అని మా గురువుల ఆదేశం. నీతోటి వారికోసం త్యాగం చేయమనీవట్టి మాటలతో కాకచేతలతో ఆ ఆదర్శాన్ని నిరూపించమనీ వారి ఉద్బోధ. ఆ స్థితిని చేరుకున్నవారికిప్రపంచ మతాలన్నిటి మధ్య సామరస్యమే కానీవైరస్యం లేదనే నిజం బోధ పడుతుంది. మానవజాతి సముద్ధరణకు ఆ పరిజ్ఞానమే మార్గం. తక్కిన మత బోధకులందరూతమ తమ పేరులతో కొత్త కొత్త మతాలను సృష్టించుకున్నారు. కానీశ్రీ రామకృష్ణ పరమహంస ఆ పని చేయలేదు. అన్ని మతాల మధ్య అంతర్గతంగా వుండే సమైక్యభావాన్ని విశదీకరించడమే వారి ఆశయం. నేటి మతాలన్నీ ఒకే ఒక సత్యమైననిత్యమైన మూలమతంలో అంతర్భాగాలే అన్నది వారి సందేశం.

భగవంతుడు ఎక్కడో వున్నాడని వెతుకులాడడం వెర్రితనం. ఆలయాలలోమందిరాలలో దేవులాడడం అజ్ఞానం. ఆ దేవుడు నిజానికి నీలోనే వున్నాడు. తెలుసుకోగలిగితే నీవే ఆ భగవంతుడివి! ప్రకృతి నీపై కప్పిన సన్నటి ముసుగును మంచి తలపులతోమంచి చేతలతో తొలగించుకునినిన్ను నీవు దర్శించుకో! భగవంతుడు ప్రతి వ్యక్తిలోనూ వున్నాడని అప్పుడు మీకే అర్థమౌతుంది. భగవంతుడిని సేవించడం అంటేఆ భగవంతుడి బిడ్డల్నిభగవత్ స్వరూపులైన నీ తోటివారిని సేవించటమే అనీఅప్పుడు నీవే గ్రహించగలుగుతావు. భగవంతుడిని పూజించటానికి ఎన్నెన్నో రూపాల్నీప్రతిమల్నీ సృష్టించుకునే నీవుసజీవ మానవ రూపంలో వున్న భగవదంశను గుర్తించ లేకపోతున్నావు. గుళ్ళుగోపురాలలో కాదుమావన దేహంలో వున్న భగవంతుడ్ని దర్శించు. నీ తోటి మనిషే నీ ఆరాధ్య దైవం.

విగ్రహ రూపంలో భగవంతుడ్ని పూజించేవాడు అల్పజ్ఞాని. దరిద్రులలోదుర్భరులలోబాధితులలో భగవంతుడిని సేవించేవాడు మహాజ్ఞాని. అంతేకాదు అందరిలోనూఅన్నిటిలోనూ భగవంతుడిని చూడగలిగిన నాడునీవు దేనిని త్యజించనక్కరలేదు. సన్యాసివై అడవులపాలు కానక్కరలేదు. అయినవారిలోతోటివారిలోసర్వజీవరాశిలోసర్వసృష్టిలోసుఖంలోదుఃఖంలోజననంలోమరణంలో... సర్వత్రా నువ్వు భగవంతుడిని చూడగలుగుతావు. ఇదే మన వేదాంత సారం. హిందూమత సారం.
         
          మన పురాణాలుశాస్త్రాలుచరిత్రసాహిత్యం... అన్నీ ప్రజల్ని భయపెడుతున్నాయి. "నీవు నరకానికి పోతావునరకానికి పోతావు" - అని ఘోష పెడుతున్నాయి. దాని వల్లనే ఈ జాతికి నరనరానా అలసత్వమునిర్లక్ష్యము పేరుకు పోయాయి. ఇక మనం ఈ వైఖరిని మార్చుకోవాలి. వేద వేదాంత సారమేమిటోసరళమైన భాషలో ప్రజలకి తెలియజెప్పాలి. చదువునీతిసత్ప్రవర్తన సంతరించుకుని... ఛండాలుడు కూడా యథార్థ బ్రాహ్మణునిగా రూపొందటానికి అవకాశం కల్పించాలి. పిన్నలనుపెద్దలనుస్త్రీలనుపురుషులను ఆ మార్గంలో ఉత్తేజ పరచాలి. శారీరకంగానుమానసికంగాను ఈ జాతి శక్తి వంతం కావడానికి కృషి చేయాలి.
          మరొక్క విషయం కూడా గుర్తుంచుకోండి. పాశ్చాత్యుల భౌతిక బలంహిందువుల ఆధ్యా్త్మిక బలం ఈ రెండిటి సమ్మేళనంతో ఏర్పడే ఆదర్శ సమాజాన్ని మనం నిర్మించుకోవడానికి యత్నించాలి. బాహ్య ప్రకృతిని జయించే శక్తిని పాశ్చాత్యుల నుండి భారతీయులుఅంతః ప్రకృతిని జయించే శక్తిని భారతీయుల నుండీ పాశ్చాత్యులు నేర్చుకోవాలి. అప్పుడే అంతర్గత బహిర్గత శక్తుల్ని జయించగల్గిన ఏకైకఉదాత్త మానవ సమాజం ఏర్పడుతుంది.
          మిత్రులారా! స్థిమితంగా కూర్చుని ఒక్కసారి ఆలోచించండి! అంతరంగంలోనికి దృష్టి సారించండి. మన బ్రతుకులకి ప్రయోజనమేమిమన జీవితాలకు పరమార్థం వుందాఅల్పముదీనము అయిన ఈ నర జీవితాన్ని వ్యర్థంగా గడిపివేయడమేనాఅని ప్రశ్నించుకోండి.
          ఒక ఉత్తమ ఆదార్శాన్ని పెట్టుకునిదాని కోసం జీవితాన్ని అర్పించటం నిజమైన ఘనకార్యం. అదే బ్రతుకులకు చరితార్థం. భారతదేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తి నిర్వహించవలసిన కర్తవ్యం అదే! ఇంతకాలం మనం సోకమయిమైన జీవితాలను గడిపాము. ఇక దుఃఖించి ప్రయోజనము లేదు. లేచి మన కాళ్ళ మీద మనం నిలబడాలి. పురుషులం అనిపించుకోవాలి. మనల్ని పురుషుల్ని చేసే విద్యలుసిద్ధాంతాలే మనకు ఇప్పుడు అవసరం.
          శారీరకంగామానసికంగాఆధ్యాత్మికంగా మనల్ని దుర్బలుల్ని చేసే ఏ విద్యనైనా సరే నిర్దాక్షిణ్యంగావిషప్రాయంగా తోసి పుచ్చాలి. భయరాహిత్యమే మోక్షమార్గమన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈనాడు మనకు కావలసింది బలం. కండ బలంబుద్ధి బలంఆత్మ బలం - ఇవి మూడూ కావాలి. ఇనుప నాడులుఉక్కు కండరాలు కావాలి.
          క్లైబ్యం మాస్మగమః పార్థనైతత్వై యుపపద్యతే
          క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వాఉత్తిష్ఠ పరంతపా!
అన్న గీతా వాక్యాన్ని గుర్తుంచుకోండి.
----
          ఎవరు ఏ ఘనకార్యాన్ని సాధించాలన్నామూడు విషయాలు ముఖ్యం. అందులో మొదటిది భూతదయ. అనగా సానుభూతి. అనగా ప్రేమ. 'ఆత్మవత్‌ సర్వభూతానిఅని ఉపనిషద్వాక్యం. జగద్రహస్యాలన్నిటికీ ప్రేమే సింహద్వారం వంటిది. దానికి దుస్సాధ్యమూ లేదుపరాజయమూ లేదు. అందుకే ముందుగా మనం పరుల పట్ల సానుభూతిని అలవరచుకోవాలి. లక్షల కొలదీ జనం పశుప్రాయులుగా జీవిస్తున్నారే అని దుఃఖించాలి. లక్షల కొలదీ ప్రజలు తిండికి లేక మలమల మాడి పోతున్నారే అని పరితపించాలి. అది మొదటిది.
          ఇక రెండవది. సంకల్ప శక్తి. పర్వతాల వంటి ఆటంకాలు ఎదురైనావాటిని దాటి వెళ్ళగలగాలి. ఆ ప్రయాణంలో సకల ప్రపంచమూ మిమ్మల్ని ఎదిరించవచ్చు. అయినవారే విరోధులు కావచ్చు. సకలైశ్వర్యాలు సమసిపోవచ్చు. అయినా సరేజంక కుండా ధర్మాన్నే అంటిపెట్టుకుని నిలబడగలగాలి. దానినే స్థిర చిత్తం అంటారు.
          మూడవది త్యాగ శక్తి. ఈ మూడూ మీలో వుంటేమీరు సాధించలేనిది లేదు. మీరు ఏ పర్వత గుహలలో నివశించినామీ సంకల్పాలు రాతి గోడల్ని భేదించుకునిశతాబ్దాల కాల *ఎవరికల్ని ఛేదించుకునిలోకమంతటా స్పందిస్తాయి. అందరి మనసులను ప్రభావితం చేస్తాయి.
          సీతా మహాసాధ్వి జన్మించిన ఈ భారతావనిలో స్త్రీ కి వున్న ప్రాశస్థ్యం మరి ఏ దేశంలోనూ లేదని నా నమ్మకం. మన *వేదోక్త ధర్మాలువిధులు ఇతరులందరికీ ఆదర్శప్రాయమైనవని నా అభిప్రాయం. అయితే ఈనాడు భారతీయ స్త్రీ ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటున్న యథార్థాన్ని మాత్రం కాదనలేం. కానీవిద్య ద్వారా పరిష్కరించుకోలేని సమస్య వాటిలో ఒక్కటి కూడా లేదని నేను చెప్పగలను. విద్య అంటే ఏమిటిచిలుక పలుకులు వల్లించేది విద్య కాదు. బుద్ధి బలాన్నిధర్మ చింతనను పెంపొందించేది విద్య. ఆ విద్యకు మతం ప్రాతిపదిక కావాలి. ఆ విధమైన శిక్షణలో పెరిగిన స్త్రీలు ఈనాడు దేశానికి అవసరం. సంఘమిత్రలీలఅహల్యాబాయిమీరాబాయి మొదలైన స్త్రీ రత్నాల అడుగుజాడల్లో నడవగలిగిన నిర్భయులు అవసరం. స్త్రీల మాతలుధర్మమూర్తులూ అవసరం. కానీమన సమాజంలో స్త్రీ ని మనం ఏ విధంగా చూస్తున్నామువారికి ఎటువంటి స్థానాన్ని కల్పించాముస్మృతులుశాస్త్రాలు సృష్టించికఠోర నియమాలను విధించివారిని కేవలం బిడ్డల్ని కనే యంత్రాలుగా తయారు చేశాము. జగన్మాత ప్రతిరూపాలైన స్త్రీల పట్ల మనం అవలంబించవలసిన వైఖరి ఇదేనా?
          స్త్రీ.... మాయా రూపిణీ అనీస్త్రీలు జ్ఞానార్జనకు అర్హులు కారనీ కొందరు వాదిస్తారు. అలా అనీ ఏ ధర్మశాస్త్రంలో వుందోవారిని చెప్పమనండిపురోహిత బ్రాహ్మణ వర్గం తమ ఆధిక్యత నిలుపుకోవటం కోసంవేదాలు చదివే అధికారం ఇతర కులాలకు లేదు అని నిషేధించివారితో పాటు స్త్రీలను కూడా వెలిపెట్టారు. అంతేకానీఅది శాస్త్ర విహితమూ కాదుధర్మ సమ్మతమూ కాదు. మైత్రేయీగార్గీ మొదలైన స్త్రీలు ఇతర ఋషులతో పాటు సరిబంతిలో కూర్చుని ఆధ్యాత్మిక చర్చలు జరిపినట్లు మన వేదాలే చెబుతున్నాయి కదా! ఆనాడు స్త్రీలకున్న ఉన్నత స్థానంవిద్యార్హత ఈనాడు ఎందుకు వుండకూడదుఅసలు స్త్రీని గౌరవించనీగౌరవించలేని ఏ దేశమూ చరిత్రలో బాగుపడలేదుఇక ముందు కూడా బాగుపడదు. మన దేశం ఇలా పతనం కావడానికి కూడా కారణం అదే! "స్త్రీలు పూజింపబడే తావుదేవతలకు ప్రీతి పాత్రమైనది" - అని మనుస్మృతి చెబుతున్నది. 'కలకంఠి కంట కన్నీరొలికిన సిరి యింట నుండనొల్లదు' - అనే నానుడి కూడా మీరు వినే వుంటారు. అసలు స్త్రీ స్వరూపిణీ అయిన పరాశక్తి దయలేనిదేత్రిమూర్తుల కూడా ఏ పని చేయడానికైనా అశక్తులు. 
          "శైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే!" - అటువంటి జగన్మాత అంశలో అవతరించిన వారు స్త్రీలు. వారిని పూజించుకోవడం మన ధర్మం.
----
          ఆత్మ విశ్వాసం కోల్పోయిన వ్యక్తి కానీజాతి కానీ పతనం కాక తప్పదు. భగవంతునిలో నమ్మకం లేని వాణ్ణి నాస్తికుడు అని అంటారు. కానీనా దృష్టిలో తనలో తనకు నమ్మకం లేనివాడే అంటేఆత్మవిశ్వాసం లేనివాడే నాస్తికుడు. ఉపనిషత్తులు పదే పదే చెప్పే మాట ఒక్కటే! అభయ్‌! నిర్భయుడవు కమ్ము! అని. 
          ఇతరులకు ఉపకారం చేయడమే మన ధర్మం. ప్రపంచానికి మేలుచేయడమే మన కర్తవ్యం. పాప పుణ్యాలు అనేవిమన మానసిక ప్రవృత్తి మీద ఆధారపడి వుంటాయి. ఉదాహరణకు నిప్పు తీసుకోండి. అది మంచిదాచెడ్డదాచలికాచుకున్నప్పుడు మంచిదనుకుంటాముచెయ్యి కాలినప్పుడు చెడ్డదనుకుంటాము. అలాగే ప్రపంచంలో మంచి చెడులు స్వతః సిద్ధాలు కావు. మన స్వభావాన్ని బట్టిమన ఆలోచనలుచేతలను బట్టి ఏర్పడతాయి. ఇతరులకు ఉపకారం చేసేటప్పుడు కూడా 'మనము వాళ్ళను ఉద్ధరిస్తున్నాముఅనే భావంతో చేయకూడదు. నిజానికి ఇతరులకు మేలు చేయడం ద్వారా మనకి మనమే మేలు చేసుకుంటున్నాము. ఒక సత్కార్యం యొక్క ఫలితాన్ని పొందేది ఇచ్చేవాడే కానీపుచ్చుకునే వాడు కాదు.
          సూర్యుడు సముద్ర జలాన్ని ఆవిరి రూపంలో స్వీకరించితిరిగి వర్షరూపంలో ఇచ్చివేస్తున్నట్లుగా మనం చేసే మంచి పనులుమనల్ని సర్వదా కాపాడుతాయి.
---
           విద్య యొక్క ఏకైక లక్ష్యం వ్యక్తి నిర్మాణం. మనిషిలో అంతర్గతంగా వున్న పరిపూర్ణత్వాన్ని వెలుపలకు తెచ్చే సాధనమే విద్య. అదే నిజమైన శిక్షణ. జ్ఞానం లేక ఎఱుక లేక తెలివి అనేది మనిషికి పుట్టుకతోనే వచ్చే శక్తి. అయితే అది అతని లోపల అణిగి వుంటుంది. అంతర్గతంగా వున్న జ్ఞానాన్నిబహిర్గతం చేసుకోవడానికి ఉపకరించేది విద్య. చిన్న విత్తులోనుంచి పుట్టిన మర్రిచెట్టు మహావృక్షం అయినట్లుగామనిషిలో నిక్షిప్తమై వున్న జ్ఞానము గురు మూలంగా పెరిగిపెద్దదై విశ్వాన్నే ఆవరిస్తుంది.   
---
          పేద ప్రజలు దేశానికి వెన్నెముక వంటి వారు. ఎండనకావాననకా నిరంతరమూ కష్టించిఆహారాన్ని పండించిఅందరినీ పోషించే ఆ కష్ట జీవులు లేకపోతే దేశమే లేదు. వారు ఒక్కరోజు పనిచేయడం మానివేస్తేపెద్ద పెద్ద పట్టణాలలోనగరాలలో జన జీవనం స్తంభించి పోతుంది. అలాంటి వారికి మనం ఏం చేయగలుగుతున్నామువారి దౌర్భాగ్యాన్ని మార్చడానికి లేశమైనా ప్రయత్నిస్తున్నామావారికి కూడూ గుడ్డా సమకూర్చగలుగుతున్నామాపైపెచ్చు లోకంపోకడలు తెలియని కొందరు అమాయకులనుపగలూ రాత్రీ ఒళ్ళు విరుచుకున్నాపట్టెడు అన్నానికి నోచుకోని నిర్భాగ్యులను... 'నన్ను ముట్టుకోకునన్ను ముట్టుకోకుఅని తరిమి కొడుతున్నాము. అస్పృశ్యులని పేరు పెట్టి వెలివేస్తున్నాము. ఇది ఎంత అమానుషమో ఆలోచించారాఈ దురాచారాన్ని తుడిచిపెట్టాలి. ఈ అస్పృశ్యతా బంధాల్ని తెంచి వెయ్యాలి. ఆ దయనీయ దీన జనావళిని శ్రీ రామకృష్ణుని పేరు చెప్పిచేరదీసి మన సోదరులుగా స్వీకరించాలి. వారి కళ్ళు తెరిపించిచైతన్యవంతుల్ని చేయాలి. దేహాలు వేరు కానీవారిలోనూ మనలోనూ వున్న ఆత్మ ఒక్కటే!

శరీరంలో ఒక్క అవయవం దెబ్బతిన్నామిగితా అవయవాలన్నీ కుంటుబడుతాయి. ఈ సత్యాన్ని అగ్ర వర్ణాలు గ్రహించక పోబట్టే దేశంలో పలు ప్రాంతాలలోఈ అస్పృశ్యులు అనబడేవారు క్రైస్తవ మతం స్వీకరిస్తున్నారు. వారందుకు పాల్పడుతున్నది ఆకలి మంట చల్లార్చుకోవడానికి కాదు. అగ్రవర్ణ హిందువుల కర్కశత్వాన్ని భరించలేక. కనుక ఈ దీన జన సముద్ధరణ జరిగితేనే గానీజగన్మాత ప్రసన్నురాలు కాదూ అనీప్రతి ఒక్కరూ విస్పష్టంగా గ్రహించాలి. జీవారాధనే శివారాధన! ఈ పవిత్ర సత్యాన్ని మీ హృదయాలలో ప్రతిష్ఠించుకోగలిగితేమీరూ మీ జీవితాలూ ధన్యమౌతాయి.

-----------

ఆది శంకరుల దృష్టిలో జ్ఞానము - కర్మము పరస్పర విరోధ ప్రవృత్తులని కొందరు భావిస్తారు. అది పూర్తిగా నిజంగా కాదు. జ్ఞానమే మోక్షానికి స్వతంత్రమైన సాధనమనిజ్ఞాన సిద్ధి కలిగిన వానికి కర్మతో నిమిత్తం లేదని - శంకరులు చెప్పిన మాట యథార్థమే! అయితేకర్మానుష్ఠానము వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుందనిఅంతఃకరణ శుద్ధి లేనిదేజ్ఞాన సిద్ధి కలగదనీఆ విధంగా కర్మ.... జ్ఞానోత్పత్తికి కారణమౌతుందని కూడా శంకరులు అంగీకరించారు. కనుక సూక్ష్మ దృష్టితో చూస్తేజ్ఞాన కర్మముల మధ్య వైరుధ్యము లేదు.
జీవన్ముక్తులైన కొద్దిమంది మానవుల సంగతి వదిలివేస్తేసాధారణ మానవులెవ్వరూ 'కర్మఅనగా పని చేయకుండా ఉండలేరు. మనిషిది కర్మ స్వభావం. అది ప్రకృతి సిద్ధమైనది. కనుక సత్కర్మలని ఆచరిస్తూజ్ఞానోదయానికి మార్గం సుగమం చేసుకోవడం వివేకుల లక్షణం. కేవలం వేదాంత గ్రంథాలు పఠించినంత మాత్రాన ప్రయోజనమేమిటివిశుద్ధమైన అద్వైత తత్త్వాన్నిమన జీవితాలలో ఆకళింపు చేసుకోవాలి. దాని మహత్వాన్ని నిరూపించాలి. ఆది శంకరులు తన అద్వైత తత్త్వాన్ని అడవులలోకొండలలో విడిచి వెళ్ళారు. దానిని అక్కడి నుండి తరలించిజనమధ్యంలో ప్రతిష్ఠించిప్రచారం చేయడానికే నేను వచ్చాను. ఆ అద్వైత గర్జన ప్రతీ వ్యక్తి హృదయంలోనూ ప్రతి ధ్వనించాలి. ఆ మహాకార్యంలో మీరందరూ నాకు తోడుపడండి. భాగస్వాములు కండీ!
-----
ఏ ఉద్యమం చేపట్టాలన్నాముందుగా మనల్ని మనం సంస్కరించుకోవాలి. ఎంతో కాలంగా మన హృదయాలలో ఓర్వ లేని తనం గాఢంగా నాటుకు పోయింది. ఒకరిని చూస్తేఒకరికి అసూయ. ఆధిక్యం అనేది అతనికే ఎందుకుండాలినాకెందుకు వుండకూడదుఅన్న ఈర్ష్య! ఇది చాలా క్షుద్ర భావం. దీనిని ముందుగా మనం వదిలించుకోవాలి. ప్రతీ వ్యక్తీ నాయకత్వం వహించాలి అనుకునేవారే కానీవిధేయులుగా నడుచుకుంటూ సహకరించడానికి సిద్ధపడేవాడు అరుదు.
పూర్వకాలంలో ఈ 'విధేయత'ను నేర్పడానికేబ్రహ్మచర్య ధర్మం వుండేది. అది ఇప్పుడు కనిపించదు.

మిత్రులారా!
మొట్టమొదట విధేయత నేర్చుకోండి. నాయకత్వం దానంతట అదే వస్తుంది. మొట్టమొదట సేవకులుగా వుండటం నేర్చుకోండిఆ తరువాత స్వామిగా వుండే అర్హత లభిస్తుంది.
ఓర్వలేని తనాన్ని వదిలించుకోవటం ఒక్కటే ఇందుకు మార్గం. మన పూర్వులు అద్భుత కావ్యాలు ఎన్నో చేశారు. ఆ ఘనకార్యాలు గురించిమనం ఈనాడు వారి పట్ల భక్తి ప్రపత్తులతో గర్వంగా చెప్పుకుంటున్నాము. అలాగే రేపటి తరాల వారు కూడా వెనక్కి తిరిగి చూసిమనల్ని గురించి అంతే గర్వంగా చెప్పుకోగలగాలి. అందుకు అనువుగా మనం ప్రవర్తించాలి. ఈర్ష్యాసూయలతో మగ్గిపోతే ముందుతరాలు మనల్ని క్షమించవు.
----
అన్ని కోరికలనూ అరికట్టేది భక్తి. ప్రతిఫలాపేక్ష లేనిది భక్తి. 'మనసా వాచా కర్మణా ఆ భగవానుడినే స్మరిస్తూఒక్క క్షణమైనా ఆ స్మరణ మానుకోలేని పారవశ్య స్థితే భక్తిఅని నారద మహర్షి వర్ణించారు. దేవునిపై భక్తి కూడా ఒక రకమైన పిచ్చి అని మా గురుదేవులు అనేవారు. అది మనిషికి మేలు చేసే పిచ్చి. ఏసుక్రీస్తుబుద్ధుడురామకృష్ణ పరమహంస మొదలైన అవతార పురుషులు మనలో ఈ భక్తి భావాన్ని ప్రకోపింప చేయగలిగిన సమర్థులు. ఒక్క చూపుతోఒక్క స్పర్శతో.... మనలో ఆ పరమానుభూతిని సృష్టించగల దివ్యశక్తి వాళ్ళది. అదే గురుమహిమ.
-----
నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే వుంది. నిన్ను తీర్చి దిద్దుకోగల శక్తి నీలోనే వుంది. నేటి మన సుఖ దుఃఖాలకు పూర్వజన్మ పరిపాకమే కారణమని మనం నమ్మితేఈనాడు మనం చేసే కర్మలపైనే మన భవిష్యత్తు కూడా ఆధారపడి వుంటుందనేది సత్యమే కదా! అందుకే "మన జీవితాలకు మనమే బాధ్యులం".
సాధారణంగా మన బాధలన్నింటికీ దేవుడోదెయ్యమో కారణమనుకోవటం పరిపాటి అయిపోయింది. విధిని నిందించటం అలవాటైపోయింది. కానీఏ విత్తు నాటితేఆ చెట్టే మొలిచినట్లుగా.... మనం ఎలాంటి పనులు చేస్తామోఅలాంటి ఫలితాలనే అనుభవిస్తాము. అంటేమన విధిని మనమే నిర్ణయించుకుంటాము. ఇక ఇతరులను నిందించటం ఎందుకు?
గాలి బాగా వీస్తున్నప్పుడు తెర చాపలెత్తిన పడవులు ముందుకు దూసుకుపోతాయి. తెరచాపలు దించుకున్న పడవలు ఎక్కడివి అక్కడే వుండిపోతాయి. అది ఎవరి తప్పువీచే గాలి తప్పాఆ గాలిని సృష్టించిన దేవుని తప్పాకనుక పురుష ప్రయత్నం ముఖ్యం. దాని నుండేమనలో నుండేమన భవిష్యత్తును తీర్చి దిద్దుకోగలిగిన శక్తిఆవిర్భవిస్తుంది. చెడుతలపులుచెడు చేతలుక్రూర మృగాల్లాగా మనని మ్రింగి వేస్తాయి. మంచి తలపులుమంచి చేతలు... దేవతలై మనల్ని కాపాడుతాయి. మన వేదాంతం బోధించేది ఇదే!
          ఈ జీవితం ఒక సత్యం. ఆ జీవిత మార్గం కంటక మయం కావచ్చు. అప్పుడు నీలో నిబిడీకృతమై యున్న ఆత్మశక్తిని మేలుకొల్పు. దాని సాయంతో నిష్కంటకంగా పయనం సాగించు.
---
నిజమైన సన్యాసికి మత ప్రమేయం లేదు. అతడు అన్ని మతాల సారాన్ని జీర్ణించుకున్న జీవన్ముక్తుడు. తాత్విక సిద్ధాంతాలకు అతీతుడైన సిద్ధుడు. అందుకే సన్యాసి అయిన వాడు గృహస్థులతో కానీధనవంతులతో కానీ సంబంధం పెట్టుకోకూడదు. పేదవారి సేవకే తన శక్తి యుక్తుల్ని వినియోగించాలి. మన దేశంలో సన్యాసులు తరచూ శ్రీమంతుల నాశ్రయించివారి ప్రాపు కోరడం వల్లనే సన్యాస ధర్మం చెడిపోతున్నది. ఒక వెలయాలు ధనవంతుల కోసం ఆరాటపడితే అర్థం వుంది కానీఐహిక వాసనలన్నీ త్యజించిన సన్యాసికి ధనవంతులతో పని ఏమిటికాంతా కనకాలకు దూరంగా వుండవలసినవాడు... వాటికి దగ్గర కావడం ఎంత అపచారం?

మా గురుదేవులు శ్రీ రామకృష్ణ పరమహంస కాంతా కనకాలతో లేశమైనా ప్రమేయం లేనివారితోనే మాట్లాడాలని అభిలషించేవారు. అలాంటి వారితోనే తనకు సంబంధం కల్పించమనీజగన్మాతను ప్రార్థించేవారు. ఐహిక బుద్ధి కలవారిని ముట్టుకోవడానికి కూడా నిరాకరించేవారు. "ఆత్మ విముక్తి", "లోకకళ్యాణము" - ఇవి రెండే సన్యాసాశ్రమ పరమార్థాలు.

ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయ చ! - అందుకు అనుసరించ వలసిన విధులలో కాంతా కనక విసర్జన ముఖ్యమైనది. ఆ నియమ పాలనం కోసం పూర్వకాలంలో సన్యాసులు భిక్షా విధి పాటించేవారు. ప్రతి దినమూ వారికి భిక్ష పెట్టటము గృహస్థ ధర్మంగా వుండేది.  కానీవర్తమాన సమాజంలోమారిపోయిన పరిస్థితులలో ఈ మాధుకర జీవనము సాధ్యమూ కాదుసముచితమూ కాదు. కనుక సన్యాసులు కూడాతమ కనీస అవసరాలకు కావల్సిన ఏర్పాట్లు చేసుకోవడం ఈనాడు ధర్మ విరుద్ధం కాదు. అయితేవారు తమ శక్తినిసమయాన్ని అంతా సన్యాసాశ్రమ పరమార్థాల కోసమే వినియోగించటం న్యాయం.
-----
ఈనాడు మన దేశంలో ఎటు చూచినా మద్రాస్‌బొంబాయిపంజాబ్‌బెంగాల్‌... ఏ ప్రాంతాన్ని పరికించినా కల్లాకపటముసోమరితనము... తాండవమాడుతున్నాయి. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. పెద్ద పెద్ద చదువులు చదివిన వారుమేధావులు ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏం చేస్తున్నారుఏమీ లేదు. పరాయి భాషలోపరాయి భావాలతో బుర్రలు నింపుకునిఏవేవో డిగ్రీలు సంపాదించుకునిమేము మేధావులము అని విర్రవీగే వారందరూ ఒక్కసారి ఆగి ఆలోచించండి! మీ చదువులన్నీ దేనికిగుమస్తా ఉద్యోగాల కోసమామీకు ఈ దేశం సంగతి పట్టదారత్న గర్భా అని పేరు పొందిన ఈ భారతదేశం ఈనాడు పట్టెడు మెతుకులకోసం పరితపించి పోతుంటేమీలో చలనం కలగదాఈ క్షుదార్తిని తీర్చలేని మీ చదువులు దేనికి?

రండి! మనుషులు మధ్యకు రండి! మతిని పెళ్ళగించండి. మీ చదువులతోమీ పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానంతోకొత్త సాధనాలు కనిపెట్టికొత్త పద్ధతులతో ఆహారం పండించండి. ప్రజల ఆకలి బాధ తీర్చండి. మీ పురాణాలనుధర్మశాస్త్రాలను గంగలో పారవేయండి. కూటికీబట్టకు కరువైన ప్రజలు ధర్మ పన్నాలు వింటారాముందు వారికి ఆకలి తీరే మార్గం చూపించండి. ఆ తరువాత ధర్మబోధన చేయండి. ముందు మీ ఆత్మశక్తిని మేల్కొల్పండి. ఆ శక్తితో ప్రజల భౌతికావసరాలు తీరే వెరవు చూపించిఆ పైన వారిలో ధర్మవికాసం కల్పించండి. అదే మీ కర్తవ్యం! ఆ కృషి ఇప్పుడేఈ క్షణమే ప్రారంభం కావాలి. ఈ దేశం తిరిగి కోలుకుంటుంది. ఆ శుభ సమయం ఆసన్నమయ్యింది. శ్రీ రామకృష్ణ పరమహంస అవతరణతోఈ కర్మభూమిపై అరుణోదయమైంది. అనతి కాలంలోనే మధ్యాహ్న సూర్యప్రభలతో ఈ దేశం దేదీప్యమానం కాక తప్పదు.
------
ప్రకృతికి తల ఒగ్గటం కాదు. దాన్ని జయించటమే మానవ జన్మకు సార్థక్యం.

మనిషిలో శక్తికి మూలం పరోపకారముపవిత్రత. మృగత్వం నుండి మానవత్వానికిమానవత్వం నుండి దైవత్వానికి నడిపించేదే మతం.

భగవంతునిలోని సగుణ భావమే సృష్టి.

నిజాన్ని వెయ్యి విధాలుగా నిర్వచించవచ్చు. అందులో ప్రతి విధమూ నిజమే అవుతుంది.

నీపై నీకు నమ్మకం కుదరనంతకాలందేవునిపై నమ్మకం కుదరదు.

సత్యం కోసం దేనినైనా వదులుకోవచ్చు. కానీసత్యాన్ని మాత్రము దేనికోసమూ వదులుకోకూడదు.

పాప పుణ్యాలనేవి లేవు. ఉన్నది అవిద్య. అంటే అజ్ఞానం మాత్రమే!

అద్వైత తత్త్వాన్ని అర్థం చేసుకుంటే అవిద్య నశిస్తుంది.

ధనికులకు దాసోహం అయిన క్షణం నుంచి మతం మలినమైపోతుంది. దుఃఖం అనే కిరీటం ధరించి సౌఖ్యం మనిషి ముందు నిలుస్తుంది. అందుకే సౌఖ్యాన్ని కోరేవాడుదుఃఖాన్ని కూడా భరించాలి.

-----

ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేదే మతం. అది వాద ప్రతివాదాలకుసిద్ధాంతాలకు కట్టుబడేది కాదు. ఈ పరమ సత్యాన్ని విభిన్న మతాలు.... విభిన్న మార్గాల ద్వారా ప్రతిపాదిస్తాయి. విభిన్న వ్యక్తులు.... విభిన్న కోణాల నుండి దర్శిస్తారు. ఏకం సత్‌ విప్రా బహుధా వదంతి - అన్నది మన వేదవాక్యం.

అయితేసముద్రంలో ఆటుపోటు వచ్చినట్లుగాఒక జాతి ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఆటుపోటు అనేవి వస్తాయి. ఆ విధంగా మతక్షయం కలిగే సమయాలలో ధర్మ సంరక్షణార్థం మహాప్రవక్తలుఅవతార పురుషులు ఉద్భవించిజాతిని లోకాన్ని కాపాడుతారు. కనుక అలాంటి వారి అందరి ఉపదేశాలూ మనకు అనుసరణీయాలే! ఆ మహోపదేశాలలో అగ్రగణ్యమైనది గీతోపదేశము. అందులో శ్రీకృష్ణ భగవానుని బోధనలు అన్నింటిలోకి శిరోధార్యమైనది ఆయన చెప్పిన నిష్కామ కర్మ. అంటే ఫలితాన్ని అపేక్షించకుండా కర్మను ఆచరించడం.
బ్రహ్మణ్యాధాయ కర్మాణిసంగం త్యక్త్వా కరోతి యః,
లిప్యతేనస పాపేన పద్మపత్ర మివాంభస!
ఎవడు ఫలాపేక్ష లేకుండా బ్రహ్మార్పణంగా కర్మను ఆచరిస్తాడోతామరాకు మీద నీరు అంటని విధంగాఅతణ్ణి ఏ పాపమూ అంటుకోదు. కనుక మనం రాత్రి పగులు నిర్విరామంగా పనిచేస్తూ వుండాలి. స్వార్థ రహితంగా చేస్తూ వుండాలి. ఫలితాన్ని ఆశించుకుండా చేస్తూ వుండాలి. అప్పుడే నిజమైన మనశ్శాంతి లభిస్తుంది.

ఎవడు నిరంతర కర్మాచరణ నడుమ స్థిర శాంతిని పొందగలడోఎవడు నిరంతర శాంతి నడుమ అవిశ్రాంత కర్మాచరణము కొనసాగించగలడోఅతడే యోగి - అని భగవద్గీత చెబుతున్నది.

శ్రీకృష్ణుడు చెప్పిన మరొక గొప్ప యోగం నిస్సంగత్వం. అంటే మమకారాన్ని వదులుకోవటం. నా భార్యానా బిడ్డలు అని శరీర ధారుల పట్ల మమకారాన్ని పెంచుకుంటేవారు శాశ్వతులు కారు గనుక దాని వలన లభించేది దుఃఖమే!

అలా కాకుండా ఆ శరీర ధారుల లోపల వుండే భగవదంశలను గుర్తించిదానిపై మమకారం నిలుపుకుంటేఅది శాశ్వతమైనది కాబట్టిఏ దుఃఖమూ అంటదుమోక్షం ప్రాప్తిస్తుంది. అదే రహస్యము. అనగా నశ్వరమైన దేహం పట్ల నిస్సంగత్వమూనిత్యమైన ఆత్మ పట్ల సంగత్వమూ పెంచుకోమనీ - గీతావాక్యం.

అందుకే హిందువులు ఏ పని చేసినా... కృష్ణార్పణంభగవదర్పణం అనడం అలవాటయ్యింది.  

ఇక బుద్ధ భగవానుడు ఏమన్నాడో ఆలకించండి. స్వార్థాన్ని సమూలంగా పెరికి వేయి. పెళ్ళాంబిడ్డలుప్రాపంచిక సౌఖ్యాలు అన్నిటినీ త్యజించు. పరిపూర్ణమైన స్వార్థ రాహిత్యమే నీ ధ్యేయం. - అన్నది బౌద్ధ ధర్మం.

స్వార్థం మనిషిని బానిసను చేస్తుంది. పశువుగా మారుస్తుంది. అన్ని అనర్థాలకూ మూలమైన స్వార్థాన్ని అనగా కోరికలను త్యజించాలి అని బుద్ధభగవానుడు ఉపదేశించాడు.

ఇక ఏసుక్రీస్తుదేవుని రాజ్యం అందుబాటులో వున్నదిసిద్ధం కా! - అని ఆయన పిలుపు. ఆ అద్భుత సంఘటన ఏ నిమిషాన్నైనా జరుగవచ్చు. అందుకే క్రీస్తు మహాశయుని గంభీరమైన పిలుపుకి తలవొగ్గి ముందుకు సాగాలి.

అదే విధంగా మహమ్మద్‌ ప్రవక్త కూడా 'మానవులందరూ సోదరులేఅన్న సమతా ధర్మాన్ని బోధించాడు. వీరందరూ విభిన్న మతాల ద్వారా ఒకే సత్యాన్ని ప్రబోధించిన మహాపురుషులు. అయితే మానవ సమాజంలో వ్యత్యాసాలకుఘర్షణలకుపీడనకు మతమే కారణమని కొందరు వాదిస్తున్నారు. అది ఎంత మాత్రమూ యథార్థము కాదు. అది మతంలో వున్న దోషం కాదు. మత పరమార్థాన్ని సరిగా అర్థం చేసుకోలేనిఆచరణలో పెట్టలేని మన లోపం. సమాజ లోపం. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి చేయవలసింది మతనింద కాదు. స్వచ్ఛమైన మత బోధనలను ప్రజలలో ప్రచారం చేయడమే!

ఈ దేశంలో రాజకీయసాంఘిక సిద్ధాంతాల్ని ప్రచారం చేసే ముందుమన వేదాలలో ఉపనిషత్తులలో వున్న ధార్మిక సత్యాలను బయటపెట్టిపల్లె పల్లెనావాడవాడనా ప్రజానీకానికి వినిపించాలి. కులవర్ణలింగ భేదం లేకుండా కార్మికకర్షకవర్తకపాలక వర్గాలందరిలో సర్వ జనావళిలో ఈ ధర్మప్రచారం సాగించాలి. అదే నా ఆశయం. అదే నేను ఆశించే విశ్వజనీన మతం.

అసతోమా సద్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
మృత్యోర్మా అమృతంగమయా

ఓం శాంతిః శాంతిః శాంతిః