Tuesday, September 23, 2025

BHAKTI VIDEOS

BHAKTI VIDEOS

bhakti videos

నిజమైన భక్తి - దేవుణ్ని ప్రశ్నిస్తే...? జిందగీ-చింతన || నమస్తే తెలంగాణ హైదరాబాద్-సోమవారం 13-03-2023



నమస్తే తెలంగాణ హైదరాబాద్-సోమవారం 13 మార్చి 2023

జిందగీ-చింతన

నిజమైన భక్తి

భక్తి అనేది ఓ మధురమైన భావన. భగవంతుడి కోసం తన అనుకున్న సర్వస్వాన్నీ అర్పించటమే భక్తి. నిజమైన భక్తి అనుభవైకవేద్యమైనదే తప్ప ఇదీ అని చెప్పగలిగేది కాదు. అందుకే నిజమైన భక్తుడు నిరంతరం సాధన చేస్తూనే ఉంటాడు.

దేవుణ్ని ప్రశ్నిస్తే...?

భక్తి ఉన్నంత మాత్రాన ప్రశ్నించకూడదనేమీ లేదు. ప్రశ్నకు తగిన సమాధానం దొరికితే భక్తి మరింత పెరుగుతుంది. కార్యకారణ సంబంధాలను విశ్లేషించిన తరువాత ఏర్పడే భక్తిలో గాఢత ఎక్కువగా ఉంటుంది. కొడుకుకు ఏదైనా సందేహం వస్తే తండ్రిని ప్రశ్నిస్తాడు కదా! అనుమానం నివృత్తి చేసుకుంటాడు కదా! మరి జగత్తుకు తండ్రి అయిన దేవుడిని ప్రశ్నిస్తే మాత్రం తప్పేముంది. దేవుడు కూడా తనను నిలదీసే భక్తులను ఎక్కువ అనుగ్రహిస్తాడు. కత్తి పదునుతేలాలి అంటే సానబెట్టాలి.

భక్తికీ అంతే! ఆటవికుడైన తిన్నడు పరమశివుడిని అంత తేలిగ్గా నమ్మలేదు. 'అసలు నువ్వెవరు?' అని ప్రశ్నించాడు. 'నీ జాడ ఎక్కడ?' అని నిలదీశాడు. భగవంతుడి జాడను తెలుసుకున్నాకే విశ్వసించాడు. పరమ భక్తుడిగా మారాడు. భాగవతం రాసిన పోతనామాత్యుడు పరమ భాగవతోత్తముడు. అయితేనేం. ఆయన దేవుడి గురించి బోలెడన్ని ప్రశ్నలు సంధించాడు. భగవంతుడిని ప్రేమించడం భక్తికి తార్కాణం. ఆయన కోసం అర్రులు చాచడం, ఆరాట పడటం, ఏడ్వటం, బాధ పడటం... అన్నీ భక్తికి నిదర్శనాలే. భగవంతుడికి అన్నీ అర్పించడమే భక్తి. కలిమి లేముల్లో, సుఖదుఃఖాల్లో... ఒకటేమిటి ప్రతిస్థితిలో, ప్రతి అవస్థలో, అన్ని వ్యవస్థల్లో, అంతటిలో భగవంతుడిని చూడగలగడమే భక్తి. అనుక్షణం అణువణువునా పరమాత్మను హృదయంలో దర్శించడం భక్తి అవుతుంది. భగవంతుడిని అనుభవించటం భక్తి. అనుభవంలోకి తెచ్చుకోవటం భక్తి. తమ మనస్సుకు నచ్చిన ఇష్టదైవాన్ని ప్రసన్నంచేసుకునేందుకు భక్తులు తమకు తోచిన రీతిలోmప్రార్థిస్తుంటారు. మంత్రాలు పఠిస్తారు. పూజలు,జపాలు చేస్తారు. ఇంకొంతమంది కోరికలు నెరవేరడానికి ఉపవాసాలు ఉంటుంటారు. వ్రతాలు చేస్తుంటారు. ఇవన్నీ భక్తి కలిగిన వారు చేసే వివిధ సాధనా మార్గాలు మాత్రమే. అంతేకానీ పరిపూర్ణ భక్తికి ప్రతీకలు మాత్రం కావు. భగవంతుడిని ఆరాధించే కొద్దిసేపైనా ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మణా భగవంతునిపైనే మనసును లగ్నం చేసి తనను తాను భగవంతుడికి అర్పణ చేసుకోవడమే అసలైన భక్తి అవుతుంది. ఇటువంటి భక్తి అత్యంత అమోఘమైంది. భగవంతుడికి భక్తులను దగ్గర చేసేది ఇటువంటి భక్తిమార్గం మాత్రమే.

భగవంతుడిని మనసా స్మరిస్తూ, అన్యథాశరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని మనల్ని మనం ఆయనకు అర్పించుకోవడమే భక్తి. ఏమీఆశించకుండా, కేవలం ఆ సర్వేశ్వరుడిని స్మరించడమే భక్తి. రాముడిపై హనుమంతుడికి ఉండేది భక్తి. శివుడిపై నందీశ్వరునికి ఉండేది భక్తి. గురువుపై శిష్యునికి ఉండేది భక్తి. భగవంతుడితత్వం తెలుసుకున్న వారికి భక్తి గుండెలోతుల నుంచీ పొంగుకొస్తుంది. ఆయన మీద విశ్వాసం ఉన్న వారు చేసే ప్రతీ పనిలోనూ భక్తి అంతర్లీనంగా ఉంటుంది. భక్తి అంటే భగవంతుని వద్దకు వెళ్లి మన కోర్కెల చిట్టా చదవటం కాదు. ముడుపుల పేరుతో దేవుడితో లావాదేవీలు జరపడం అంతకన్నాకాదు. ఇవన్నీ కేవలం సాధనా మార్గాలు మాత్రమే. కోర్కెల గురించి మాత్రమే సర్వాంతర్యామిని ప్రార్థించాలనుకునేవారికి అసలు భక్తితత్వం బోధపడలేదని తెలుసుకోవాలి. పరమాత్మసర్వాంతర్యామి. ఆయనకు తెలియనిది లేదు. అలాంటి సర్వవ్యాపకుడికి మన కోర్కెలు తెలిపి, 'ఇదీ నా ఫలానా అవసరం, దాన్ని తీర్చు' అని చెప్పుకోవడం హాస్యాస్పదమే కదా! మనతోపాటు, మన భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని సృష్టించిన ఆ దేవదేవుడికి, మనకు ఏం కావాలో ఏం అక్కర్లేదో తెలియదా..?

భగవంతుడిపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉండాలి. మరి భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలి? ఎవరు చెబుతారు? అనే ప్రశ్న ఉదయించినప్పుడే ఆలోచన, సాధన మొదలవుతాయి. అవే క్రమంగా పరిశోధనగా మారతాయి. నచికేతుడి తండ్రి వాజశ్రవుడు. అతడు విశ్వజిత్ అనే యాగం చేస్తూ అందులో భాగంగా అనేక దానాలు చేస్తుంటాడు. తండ్రి చేస్తున్న దానాల్ని గమనించిన నచికేతుడు ‘నాన్నా! నన్ను ఎవరికి దానంచేస్తావు?' అని అడిగాడు. యాగ పనులతో తీరికలేకుండా ఉన్న వాజశ్రవుడు పిల్లవాడి మాటలకు

విసుగెత్తి 'నిన్ను యముడికి దానం ఇచ్చాను' అన్నాడు. వెంటనే నచికేతుడు తనను తాను సమర్పించుకునేందుకు యముడి వద్దకు వెళ్లాడు. యముడు పిల్లాడిని చూసి ముచ్చటపడి మూడు వరాలు ఇస్తానంటాడు. అందులో ఒక వరంగా బ్రహ్మజ్ఞానం గురించి చెప్పమంటాడు నచికేతుడు. పసిబాలుడు ఊహించని వరం కోరేసరికి ఆశ్చర్య

పోతాడు యముడు. అనేక ఆశలు చూపించి అతని దృష్టి మరల్చాలని చూస్తాడు. కానీ, నచికేతుడు దేనికీ లొంగడు. తన ప్రశ్నకు సమాధానం కావాలని పట్టుబడతాడు. బాలుడి పట్టుదలకు సంతోషించిన యముడు అతడికి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు. అదే కఠోపనిషత్తుగా అవతరించి అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నది.

ఇలా తెలుసుకోవాలన్న తపన ప్రశ్నించిన భక్తుడి తోపాటు మనందరినీ తరింపజేసింది.

భగవంతుని పొందడానికి భాగవతంలో శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం ఇలా తొమ్మిది రకాల మార్గాలు సూచించారు. ఇవే నవవిధ భక్తిమార్గాలుగా ప్రసిద్ధి. ఏ మార్గాన్ని ఎంచుకున్నా అంతిమంగా భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. నిర్మలమైన భక్తికి భగవం

తుడి అందదండలు ఉంటాయి. నిశ్చలమైన భక్తుడికి స్వామి కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది.

డా కప్పగంతు రామకృష్ణ


BHAKTI VIDEOS

BHAKTI VIDEOS

భజన ఉద్యమం - శతకోటి హరేరామ నామ యజ్ఞం#అప్పాల రసరాజు, పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు, 96764 54189

 
భజన ఉద్యమం - శతకోటి హరేరామ నామ యజ్ఞం || అప్పాల రసరాజు, పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు, 96764 54189
భజన ఉద్యమం - శతకోటి హరేరామ నామ యజ్ఞం 
పుణ్యం పొందే మార్గాలు ఎన్నో! కృత యుగంలో తపస్సు.. త్రేతా యుగంలో యజ్ఞం..ద్వాపరంలో ధర్మాచరణం.. మరి కలియుగంలో ...? స్మరణం.. సంకీర్తనం..నామ భజన ! భక్తి ఉద్యమ సారథులు ఎందరో ఆచరించిన మార్గం ఇది. అదే ఆధ్యాత్మికబాటలో మొదలైనదే భజన ఉద్యమం. శతకోటి హరేరామ నామ జప యజ్ఞంగా పల్లెపల్లెకూ విస్తరిస్తున్నది. 'నగర సంకీర్తన'గా పల్లవిస్తున్నది. రామనామ భజనలో ప్రతి ఊరునూ ఓలలాడిస్తున్నది.
అనగనగా ఓ పల్లె.. తొలి ఏకాదశి.. తొలిపొద్దు పొడవలేదింకా! ఆషాఢ మేఘాలు చిరుజల్లులు కురిపిస్తున్నాయి. రామాలయం సన్నిధికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. తాళాలు సరిచూసుకుంటున్నారు కొందరు. తప్పెట్లు లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇంకొందరు. పది నిమిషాలకు భక్తజనమంతా గుమిగూడారు. భక్తిభావంతో ముందుకు కదిలారు. అందరి నోటా ఒకటే మాట..
'హరేరామ హరేరామ రామరామ హరేహరే| హరే
కృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||' 
ముప్పయి రెండు అక్షరాల మోక్ష మంత్రం ఇది. వారిది పైపై పెదాల కదలిక కాదు! హృదయాంతరాల్లోంచి పెల్లుబికిన మహా మంత్రం! సామూహిక భజన!! తాళానికి తగ్గట్టుగా భజన. భజనకు తగ్గట్టుగా తాళం. అది భక్తి రాగం, 
దైవ తాళం. గమకాల గమనాలు తెలియకున్నా.. రుద్ర నమకమంత కమ్మగా సాగే భజన. రామపరివారం తమ వెనకాలే కదులుతుందన్న అనుభూతికి లోనవుతూ తన్మయులై చేసే భజన! ఊరంతా కలియ తిరుగుతూ 
'కలౌ తు నామ మాత్రేణ పూజయేత్ భగవాన్ హరిః' సూత్రాన్ని నిజం చేస్తూ సాగిపోయే భజన. సిద్దిపేట
జిల్లా జగదేవప్పూర్ గ్రామం నుంచి మొదలైన 'నగర సంకీర్తనం' ప్రస్తుతం చేర్యాల, మునిగడప, మర్కూకు, ఎర్రవల్లి, రాజపేట, ప్రజ్ఞాపూర్, దామరకుంట, యాదగిరిగుట్ట, చుంచనకోట, బైరాన్పల్లి ఇలా నలభై గ్రామాల్లో కొనసాగుతున్నది. ఈ ఆధ్యాత్మిక భజన యాత్రను 108 గ్రామాలకు విస్తరించే యోచనలో ఉన్నారు నిర్వాహకులు.
ఎందుకీ భజన? లోక రక్షకుడైన రాముడి అనుగ్రహం కోసం. భద్రగిరి రామయ్య మనల్ని భద్రంగా చూడాలనే సంకల్పంతో మొదలుపెట్టిన పుణ్యక్రతువు ఇది. సిద్దిపేట జిల్లా మర్కూకు మండలంలో ఉన్న పాండురంగ ఆశ్రమం వ్యవస్థాపకులు యతివర భావానంద భారతీ స్వామి దివ్య సంకల్పమే ఈ భక్తి ఉద్యమం. వందేండ్లకు పూర్వమే
తెలంగాణలో 'రామ నామ' సంకీర్తనకు విశేషప్రచారం కల్పించిన మహనీయుడు ఆయన. వారి పూర్వాశ్రమ కుమారుడు మహాత్మ అప్పాల విశ్వనాథ శర్మ 'భగవత్ సేవా సమాజం' అనే సంస్థను స్థాపించి భగవన్నామ ప్రచారం నిర్వహించారు. వారి అడుగుజాడల్లో ఈ భక్తి ఉద్యమం మళ్లీ పురుడు పోసుకున్నది. లోక కల్యాణార్థం చేపట్టిన
‘శతకోటి హరేరామ నామ జప యజ్ఞం'లో అశేషసంఖ్యలో భక్తులు భాగమవుతున్నారు. ఊరూరూ దాటుకుంటూ, వాడవాడలో ఆగుకుంటూ, మనిషి మనిషినీ కలుపుకొంటూ.. గొంతులన్నీ ఒక్కటై 
'తక్కువేమి మనకురాముండొక్కడుండు వరకు' అని ధీమాగా పాడుకుంటూ హరి నామ స్మరణలో
ఓలలాడుతున్నారు.
పక్షం రోజులకు ప్రతి ఏకాదశికీ 'నగర సంకీర్తనం'. దీనికి తోడుగా నిత్యం రామనామ జపం. ఎక్కడి వారు అక్కడే, ఎప్పుడంటే అప్పుడే.. పవిత్రమైన మనసుతో 'హరేరామ.. హరేహరే’ మంత్రాన్ని పఠించడమే! సాయంత్రానికి జప
సంఖ్య వాట్సాప్ గ్రూప్లో తెలియజేస్తారు. ఇప్పటి వరకు జప సంఖ్య 30 కోట్లు పూర్తయింది. రోజురోజుకూ ఆదరణ పెరుగుతుండటం, భగవత్ అనుగ్రహంతో వచ్చే ఏడాది పూర్తయ్యేనాటికి శతకోటి నామ స్మరణ పూర్తవుతుందని పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు పేర్కొంటున్నారు. 2024 పుష్యమాసంలో ఏడు రోజులపాటు జప హోమం, 
పూర్ణాహుతి నిర్వహించాలని సంకల్పించారు. ఈ భజన ఉద్యమంలో అందరూ భాగస్వాములే. రమ్యమైన రామనామాన్ని మనసారా ఆలపిద్దాం. కష్టాలు తీర్చే కృష్ణ మంత్రాన్ని కమనీయంగా పలుకుదాం!
హరేరామ హరేరామ రామరామ హరేహరే ||
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరేహరే||
... కణ్వస
• అందరి సహకారం
రాముడి కార్యం ఏదైనా ఘనంగానే జరుగుతుంది. 'నగర సంకీర్తనం' కూడా ఇందుకు మినహాయింపు కాదు! 
జగదేవ్పూర్ నుంచి ప్రారంభమైన ఈ భక్తిఉద్యమం ఊరూరా విస్తరిస్తున్నది. వందలాది మంది పరోక్షంగా నిత్యం 16 జపమాలల  హరేరామ నామస్మరణ చేస్తుండటం విశేషం. గ్రామవాసులు ఎందరో ఈ క్రతువుకు ఇతోధికంగా అండగా
నిలుస్తున్నారు. పాండురంగ ఆశ్రమం నిర్వహిస్తున్న ఈ క్రతువులో భాగమవ్వడం అదృష్టంగా భావిస్తున్నా.
• ఆదరాసుపల్లి శ్రీధర్, జగదేవ్ పూర్
• నాదం - సాదం
దైవనామాన్ని సంకీర్తన చేసిన క్షణం నుంచే దైవానికి మరింత చేరువ
అవుతాం. భజనలో తెలియకుండానే ప్రయత్నం లేకుండానే మనసు భగవం
తుడి వశం అవుతుంది. గంటల తరబడి చేసే సాధనలో మనసును నిలుపు
చేయడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. అందుకే పాండురంగ ఆశ్రమ
వ్యవస్థాపకులు యతివర భావానంద భారతీ స్వామివారు భజన మార్గాన్ని
ఉపదేశించారు. వారి తర్వాత ఆశ్రమ నిర్వాహకులు విశ్వనాథ శర్మ దానిని
కొనసాగించారు. ఆయన వారసులుగా ఈ భజన ఉద్యమానికి శ్రీకారం
చుట్టాం. 'నాదం- సాదం' నినాదంతో ముందుకుసాగుతున్నాం.
అప్పాల రసరాజు, పాండురంగ ఆశ్రమ నిర్వాహకులు, 96764 54189

Sunday, September 21, 2025

రేవంత్ పై రెచ్చిపోయిన సామాన్యుడు.. || Hydra Victim Fires On CM Revanth Reddy || Gajularamaram

KTR Speech on Hyderabad Slang: కేటీఆర్ చెప్పిన హైదరాబాద్ తెలుగు యాస.. అదుర్స్ అంటున్న యూత్!

  

KTR Speech on Hyderabad Slang: కేటీఆర్ చెప్పిన హైదరాబాద్ తెలుగు యాస.. అదుర్స్ అంటున్న యూత్!

Last Updated:

KTR Speech on Hyderabad Slang: తెలంగాణలోని పవర్‌ఫుల్ నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆయన ప్రసంగాలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. సంథింగ్ ఏదో ఒక కొత్త విషయం ఉండి తీరుతుంది. తాజాగా ఆయన మరోసారి తన స్టైల్ ఆఫ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు.

కేటీఆర్ చెప్పిన హైదరాబాద్ తెలుగు యాస.. అదుర్స్ అంటున్న యూత్!
కేటీఆర్ చెప్పిన హైదరాబాద్ తెలుగు యాస.. అదుర్స్ అంటున్న యూత్!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ముంబైలో నిర్వహించిన ఎన్‌డీటీవీ యువా 2025 కాన్క్లేవ్‌లో జనరేషన్ జెడ్ (జెన్‌జెడ్) యువతకు ప్రేరణాత్మక చాట్‌లో పాల్గొన్నారు. భారతదేశంలో యువత అభివృద్ధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థలోని లోపాలు, మోదీ ప్రభుత్వ విధానాలపై ఈ ఈవెంట్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, యువత ఆకాంక్షలను అవగాహన చేసుకోకపోతే, భారత్‌లో 'నేపాల్ లాంటి' యువత అల్లర్లు రావచ్చని హెచ్చరించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్‌డీటీవీ యువా కాన్క్లేవ్, యువత అభివృద్ధి, మార్పు వాళ్లను కేంద్రీకరించి నిర్వహించినది. కేటీఆర్ ఫైర్‌సైడ్ చాట్‌లో భవిష్యత్తు ఆకాంక్షలపై మాట్లాడారు. జెన్‌జెడ్ అంటే.. 1997-2012 మధ్య జన్మించినవారు. వీరు 13-28 సంవత్సరాల వయస్సు కలిగిన యూత్. "యువత గొంతుకను అణచివేస్తే, డెమాక్రసీ బలహీనపడుతుంది. తెలంగాణలో మేము యువతకు అవకాశాలు కల్పించాం, కానీ దేశవ్యాప్తంగా ఇది లోపించింది" అని అన్నారు. నేపాల్‌లో యువత ఉద్యమం, ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా ఇచ్చిన సంఘటనను ఉదాహరణగా చెప్పారు. "అక్కడ యువత 'అన్‌ఎంప్లాయ్‌మెంట్ చైన్స్' గురించి మాట్లాడారు. భారత్‌లో కూడా ఇలాంటివి రావచ్చు, కానీ మనం దాన్ని నివారించాలి" అని అన్నారు.

ETV_Sri_Bhagavatam#241_Episodes_ LINKS& from 01 to 20 EPISODES VIEW NOW


#om namo bhagavate vasudevaya

Harish Rao # Deshapathi Excellent Speech In Book Launch Event | Sunitha Ravulapalli | Begumpet | T News

తలకిందులైన ఎన్నికలు?ఓటర్లను నిర్ణయిస్తున్న ఇసి?Govt selecting voters-Parakala #telakapalli

Kaleshwaram Documentary Anugula Rakesh Reddy

BRS MLC Deshapati Srinivas Excellent Song On Bathukamma Telangana Bhavan T News

సెప్టెంబర్ 17 విమోచనమా..? విద్రోహమా..?పాత గాయాలను గెలకొద్దు | telangana liberation day | V Prakash