Sunday, November 24, 2024
AYYAPPA SONGS LATEST VIDEOS UPDATED #MUST WATCH
Saturday, November 23, 2024
నమస్తే తెలంగాణ & TELANGANAM 24 NOV 2024
#చింతన#గీతాజయంతి_సందర్భంగా_గీతామృతస్నానం#DR_VAISHNAVANGRI_SEVAK_DAS #9821914642
'సకృద్ గీతామృత స్నానం సంసార మలనాశనం' అని 'గీతా మహాత్మ్యం' పలుకుతున్నది. అంటే, “భగవద్గీత' అనే అమృత జలంతో స్నానం చేసేవారికి సంసారమలం నశించిపోతుంది. కామక్రోధలోభమోహ మదమాత్సర్యాలే మనిషికి ఆరు శత్రువులు. వాటివల్లనే శోకమోహాలు కలుగుతాయి. ఫలితంగా జన్మమృత్యు పరంపర కొనసాగుతుంది. 'గీతామృత స్నానం' ఆ సంసార మలాన్ని తొలగిస్తుంది. 'గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ నవిద్యతే' అనికూడ 'గీతామహాత్మ్యం' పలికింది. అంటే, గీతా గంగాజలాన్ని తాగేవారికి పునర్జన్మే ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు 'గీతా సందేశం' మధ్యమధ్యలో దాని మహిమను పదేపదే చెప్పాడు. 'ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే'. 'అర్జునా! నువు నాపట్ల ఏనాడూ అసూయ లేనివాడవు. కనుక, ఈ పరమగుహ్యమైన జ్ఞానాన్ని, అనుభూతిని నేను నీకు చెబుతున్నాను' (భగవద్గీత: 9-1) అన్నాడు. అంటే, 'గీతాసందేశం అత్యంత రహస్యమైందని, అసూయా రహితుడైన కారణంగా అర్జునునికి తాను చెబుతున్నానని' భగవంతుడు అన్నాడు. 'పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్' (భగవద్గీత: 14-1) అని మరొక చోట అన్నాడు. అంటే, 'దేనిని తెలిసికొనిమునులందరు పరమసిద్ధిని పొందారో.. ఆ సమస్తజ్ఞానంలో ఉత్తమమైన, పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని తిరిగి నేను చెప్పబోతున్నాను'. ఇదే గీతా మహిమ. భగవంతుడు చేసిన గానమే భగవద్గీత. 'యుద్ధంలో బంధుమిత్రులను, గురువులను వధించి పొందే విజయం తనకు వద్దని' అర్జునుడు తీవ్ర దుఃఖితుడై కర్తవ్య విముఖతను ప్రదర్శించాడు.
అప్పుడు అతనిలో తిరిగి 'కర్తవ్య పరాయణత్వాన్ని' నింపడానికి శ్రీకృష్ణ భగవానుడు చేసిన గానమే 'భగవద్గీత'. అది విన్న అర్జునుడు తన మోహాన్ని, దుఃఖాన్ని,సందేహాలను విడిచిపెట్టి యుద్ధం చేశాడు. చివరకు సంపూర్ణ విజయం సాధించాడు. అందుకే, భగవద్గీత 'విజయగీతి'గా ప్రఖ్యాతి చెందింది. ఇది అర్జునుణ్ని 'అనూహ్య విజయం వైపు'కు నడిపించింది. మానవాళిని కూడా ఓటమినుండి విజయం వైపుకు నడిపించే దివ్య సందేశమే 'భగవద్గీత'. సంపూర్ణ వెలుగులు సందేహాలు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనిషి తనకంటే ఉన్నతుడైనవాడని భావించే మరొక మనిషిని ఆశ్రయిస్తాడు. ఆ వ్యక్తి పలికే సలహాలను పాటించే ప్రయత్నమూ చేస్తాడు.
అతడు బద్ధుడై ఉంటాడుకనుక, అతని మాటలు పూర్తిగా లాభకరమవుతాయనీచెప్పలేం. మనిషి సత్వరజస్తమో గుణాలతో బంధితుడైఉంటాడు. 'జన్మమృత్యు జరావ్యాధుల'నే నాలుగు కష్టాలతో బంధితుడై ఉంటాడు. ఆకలిదప్పులు వంటి ఆరుక్లేశాలూ అతణ్ణి కట్టిపడేస్తాయి. అన్నిటికీ మించి అతడునాలుగు దోషాల నడుమ బంధితుడై ఉంటాడు. అవి:పొరపాట్లు చేయడం (ప్రమాద), మోహానికి గురికావడం (భ్రమ), అసమగ్రమైన ఇంద్రియాలనుకలిగి ఉండటం (కరణ పాటవ), మోసప్రవృత్తిని కలిగి ఉండటం (విప్రలిప్స). ఇవి బద్ధమనిషిని పీడించేనాలుగు దోషాలు. అందుకే,అతడు పలికే మాటలుసంపూర్ణం, కాలాతీతం,సార్వజనీనం కాలేవు.అయితే, భగవంతుడుపూర్ణుడు, గుణాతీతుడు,నాలుగు దోషాలకు అతీతుడుకాబట్టి, ఆయన వాక్కు కాలాతీతం, దేశాతీతమై ఉంటుంది.సర్వకాల సర్వావస్థలకూ అది అన్వయమవుతుంది. భగవద్వాణియైన భగవద్గీత ఈరకంగానే 'కాలాతీత సందేశం' అయింది.
'శ్రుణు మే పరమం వచః. నా ఉత్తమమైన సందేశాన్ని విను' అని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతా సందేశం మధ్యలో చెప్పాడు. భగవద్వాణి మనకు జీవితంలో సంపూర్ణ వెలుగులను ప్రసాదిస్తుంది.
మూడు రహస్య జ్ఞానాలు'భగవద్గీత'లో
మూడు రహస్యాలు వున్నాయి. అవి: రహస్యం, రహస్యతరం,రహస్యతమం.
'ఈ జగత్తులో తాను అవ్యక్త రూపంలో వ్యాపించి ఉన్నానని' శ్రీకృష్ణ భగవానుడు'గీతాసందేశం'లోచెప్పాడు. ఇది రహస్యజ్ఞానం.
ప్రతి జీవి హృదయంలో తాను పరమాత్మునిరూపంలో నిలిచి ఉండి, అతని జీవనగతులను నిర్దేశిస్తున్నానని,ఎవరైతే ఆ రూపాన్ని శరణు పొందు తారో వారు పరమశాంతిని, పరమపదాన్నిసైతంపొందగలరని' గీతాచార్యుడు ఉద్ఘాటించాడు.
ఇది'రహస్యతర' జ్ఞానం. అయితే, తననే స్మరించడం, తనకుభక్తులు కావడం, తనను పూజించడం, నమస్కరించడమనేది 'రహస్యతమ'జ్ఞానమని శ్రీకృష్ణుడు అన్నాడు.
'సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ. సమస్త ధర్మాలను త్యజించి కేవలం నన్ను శరణు పొందు' అని శ్రీకృష్ణుడు పలికిన విషయమే 'రహస్యతమ' జ్ఞానం.
అణువణువునా భగవత్ప్రేమ భగవంతుడు నిరాకార బ్రహ్మ రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నాడనే 'రహస్య జ్ఞానం' ద్వారా మనిషి పాపభీతితో జీవిస్తాడు.
నిజానికి ధర్మాచరణలోనే ఉంటాడు. పుణ్యకార్యాలనే చేపడతాడు. ఆ విధంగా అతని జీవితం పురోగమిస్తుంది. సకల జీవుల హృదయాలలో ఉన్న పరమాత్ముని రూపజ్ఞానమే 'రహస్యతర'జ్ఞానం. దానిని తెలుసుకోవడం ద్వారా మనిషి జగత్తులో అభయత్వాన్ని పొందుతాడు. తన కార్యాలలో నిశ్చయంగా విజయాన్ని సాధిస్తాడు. సర్వదా ఉన్నత జన్మలనే పొందుతాడు. బుద్ధిమంతుడు కోరుకునేవి ఇవేగాఇక సచ్చిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుని గురించి సంపూర్ణంగా తెలుసుకొని, ఆయనను శరణాగతి పొందడం ద్వారా మనిషి మానవజన్మను సఫలం చేసికొని, మోక్షాన్ని పొందుతాడు. భగవత్ప్రేమను తన అణువణువులోనూనింపుకొంటాడు. సకల మానవాళికి శ్రేయోభిలాషి అవుతాడు. తరతరాలకు మార్గదర్శకుడువుతాడు. ఈ 'రహస్యతమ'జ్ఞానాన్ని తెలుసుకొన్న వారికి ' రహస్య, రహస్యతర జ్ఞానాల వల్ల కలిగే ప్రయోజనాలు కూడానిశ్చయంగా కలుగుతాయి.
DR. VAISHNAVANGRI SEVAK DAS
CELL: 9821914642
అనివార్యం.. గీతా శ్రవణం!
మనిషి బతికి ఉండాలంటేశ్వాసతీసుకోవడం అనివార్యం. అది ఇష్టముంటే చేసేది, ఇష్టం లేకపోతే ఆపే పని కాదు కదా. అలాగే, మానవజన్మను సఫలం చేసుకొని,ఇహపరాలలో విజయం సాధించాలంటే భగవత్సందేశ రూపంలోని 'భగవద్గీత'ను విని, ఆచరించవలసిందే. వినకపోతే వినాశనం తప్పదని గీతాచార్యుడే హెచ్చరించాడు. 'నువు నాపట్ల చిత్తం కలవాడవైతే నా అనుగ్రహంతో జీవితంలోని అన్ని ఆటంకాలనూ దాటుతావు. కానీ, నా మాటలు వినకుండా, నేను చెప్పినట్లు చేయకుండా, నీ ఇష్ట ప్రకారంపనిచేస్తే.. నశిస్తావు' (భగవద్గీత: 18-58) అని శ్రీకృష్ణుడు తీవ్రంగా పలికాడు. కాలాతీతమైన గీతాసందేశాన్ని ప్రామాణిక పరంపరలో తెలుసుకొని, నేర్చుకొని నిత్య జీవితంలో ఆచరించాలి. గీతాసంస్కృతిని అలవరచుకోగలిగితే సర్వాభీష్టాలను పొందగలం. జీవితంలోని సర్వరంగాలలోనూ విజయాలను సాధించగలం. ఈ స్వానుభవంతో గీతాసందేశ మహిమను సమస్త ప్రపంచానికి చాటి చెప్పవచ్చు. అప్పుడు ప్రపంచ జనులంతా సుఖజీవులవుతారు. సర్వేజనా సుఖినోభవంతు!