Friday, April 11, 2025

జిడ్డు కృష్ణమూర్తి సంబంధ 14 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు

 


ఆ ఎరుకే ఆధ్యాత్మికత!       …జిడ్డు కృష్ణమూర్తి

లౌకికం, ఆధ్యాత్మికం అని జీవితాన్ని రెండుగా విభజించి చూస్తుంటాం. మన

ఆలోచనలు, ఉద్వేగాలు- వాటికి మనం ప్రతిస్పందించే తీరు, ఇతరులతో సంబంధ

బాంధవ్యాలు - ఇదంతా సాధారణ జీవితం. అలవాటుగా జరిగిపోయే వాటి గురించి

అంతగా పట్టించుకోము. మరోవైపు- దైవారాధన, తీర్ధయాత్రలు, ధార్మిక ప్రవచనాలను

వినడం, మత గ్రంథాలను చదవడం- ఇవన్నీ చాలా జాగ్రత్తగా, భక్తితో చేయాల్సినవని

భావిస్తాం. వాస్తవానికి, ప్రాపంచిక జీవితంలో అంతా మంచి జరగాలనే ఆధ్యాత్మిక

విషయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. మరి ఆ ఫలితం దైనందిన జీవితంలో

కనిపిస్తోందా? మన బాధలకు కారణమైన అసూయా ద్వేషాలు, కోపతాపాలు,

భయాలు, కోరికలు, దుఃఖం, ఇతర సంఘర్షణలను దూరం చేసుకోగలుగుతున్నామా?

కనీసం తగ్గించుకోగలుగుతున్నామా? లేదు కదా! దీనికి పరిష్కారం ఎక్కడుంది?

ప్రయోగశాలలో జరిగే ప్రతి ప్రయోగానికీ ఒక ఫలితం ఉంటుంది. ఆ అనుభవ

సారమే క్రమంగా శాస్త్రీయజ్ఞానంగా మారుతుంది. అలాగే లౌకిక జీవితంలో జరిగే అతి

సాధారణ ఘటననూ ఒక ప్రయోగ అవకాశంగా చూడవచ్చు. ఆ నిశిత పరిశీలన నుంచే

ఆధ్యాత్మిక వివేకం జనిస్తుంది. బాహ్య ప్రపంచంలో ఒక సంఘటన జరగ్గానే దానిపట్ల

తక్షణ అభిప్రాయం, తీర్పూ లేకుండా మన ప్రతిస్పందనల విషయంలో

విషయంలో గాఢమైన ఎరుక(ఎవేర్నెస్)తో ఉండగలగడమే  చాలా 

కీలకం. అలాంటి 'స్వీయ ఎరుకే అంతిమ జ్ఞానోదయానికి మొదటి మెట్టు- అంటారు

జిడ్డు కృష్ణమూర్తి లాంటి తాత్వికులు. ఆధునిక వ్యక్తిత్వ వికాస గ్రంథాల నుంచి

ప్రాచీన ఆధ్యాత్మిక చింతన వరకూ అన్నింట్లో అంతర్లీనంగా ఉన్న సారాంశమిదే! దీన్ని

ఆచరణలో పెట్టడమే మనం చేయాల్సింది.

ఉదాహరణకు ఎవరో మనల్ని తిట్టారు. దానికి వెంటనే బాధపడటమో, లేదా కోపంతో మళ్లీ

తిట్టడమో, కొట్టడమో. ఇలా ఏదో ఒకటి చేస్తాం. కోపం వల్ల గొడవ మరింత పెద్దదవు

తుంది. ఒకవేళ 'కోపం మంచిది కాదు' అని తమాయించుకున్నా, మనలోని ఆగ్రహం

పూర్తిగా తొలగిపోదు. దీనికి భిన్నంగా కోపం కలిగిన వెంటనే అందులో కొట్టుకుపోకుండా-

ఒక ధరాపార్టీలా ఆ ఆవేశం అనే ఆలోచన నుంచి బయటకు వచ్చి గమనిస్తే దాని తీరు

తెన్నులు అర్ధమవుతాయి. అప్పుడు కోపం దానంతటదే మాయమవుతుంది. అంటే, అనా

లోచిత 'ప్రతిక్రియ' స్థానంలో ఎరుకతో కూడిన ప్రతిస్పందన' చోటు చేసుకుందన్నమాట.

ఇలా లౌకిక వ్యవహారాల్లో ఎరుకను జోడించడమే అసలైన ఆధ్యాత్మిక సాధన.

జీవితంలో ప్రశాంతతకూ, ఆనందానికీ అదే సిసలైన మార్గం. దీన్ని వదిలేసి ఇంకేం చేసినా

అది కేవలం కాలక్షేపమే అవుతుంది. మన అంతర్గత భయాలు, కోరికలు, నమ్మకాల

తాలూకు బాహ్య వ్యక్తీకరణగానే అంతా మిగులుతుంది. దీనికి భిన్నంగా- నిత్య జీవితంలో

ప్రతి సందర్భంలోనూ ఎరుకతో ప్రవర్తించగలిగితే అదే నిజమైన పరివర్తన అని

తెలుస్తుంది. అదే నిజమైన ధ్యానం. అలాంటి నిరంతర ఎరుకలోనే అలౌకిక ఏకాంతం,

నిజమైన ప్రేమ, కరుణలు జనిస్తాయి. ఆ వెలుగులో లౌకికం ఆధ్యాత్మికం అనే విభజన

చెరిగిపోతుంది. సమస్త దుఃఖాలూ అంతమై జీవితమే ధ్యానంగా ప్రకాశిస్తుంది.

ఈదర రవికిరణ్

మంచి పని చేయడానికి తప్పుడు మార్గాన్ని ఎంచుకోకూడదు. అన్యాయం తన పట్ల జరిగినా,

పక్క వాడిపట్ల జరిగినా... ఎవరూ సహించకూడదు. దేవుడు ఒక్కడే. ఆయనే అందరినీ సృష్టించాడు. స్త్రీ అయినా పురుషుడైనా అందరూ స్వేచ్ఛగా పుట్టారు. అన్ని హక్కుల్నీ అందరూ సమానంగా అనుభవించాలి.

జ్యోతిరావు పులె


జిడ్డు కృష్ణమూర్తి  సంబంధ 14 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు

------------------------------------------------

కృష్ణమూర్తి తత్త్వం

www.freegurukul.org/g/JidduKrishnamurthi-1



తెలివిడి నుంచి స్వేఛ్చ

www.freegurukul.org/g/JidduKrishnamurthi-2



ఈ విషయమై ఆలోచించండి-2

www.freegurukul.org/g/JidduKrishnamurthi-3



మహాతాత్వికుడు జిడ్డు కృష్ణమూర్తి అవగాహన

www.freegurukul.org/g/JidduKrishnamurthi-4



శ్రీలంక సంభాషణలు

www.freegurukul.org/g/JidduKrishnamurthi-5



నిరంతర సత్యాన్వేషి కృష్ణమూర్తి తత్త్వదర్శన కరదీపిక www.freegurukul.org/g/JidduKrishnamurthi-6



స్వీయ జ్ఞానం

www.freegurukul.org/g/JidduKrishnamurthi-7



ఈ విషయమై ఆలోచించండి-1

www.freegurukul.org/g/JidduKrishnamurthi-8



గతం నుండి విముక్తి

www.freegurukul.org/g/JidduKrishnamurthi-9



నీవే ప్రపంచం

www.freegurukul.org/g/JidduKrishnamurthi-10




జిడ్డు కృష్ణమూర్తి అవగాహన-1

www.freegurukul.org/g/JidduKrishnamurthi-11



జిడ్డు కృష్ణమూర్తి జీవితము-భాషణము

www.freegurukul.org/g/JidduKrishnamurthi-12



మన జీవితాలు

www.freegurukul.org/g/JidduKrishnamurthi-13



ముందున్న జీవితం

www.freegurukul.org/g/JidduKrishnamurthi-14


FOR MORE BOOKS PL CLICK THIS LINK: https://archive.org/search?query=%E0%B0%9C%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81+%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF

SRI MADBHAGAVADGITOPANISHATTULU CHAPTERS 01A&01B-02A-2B-2C-2D-2E