Thursday, October 16, 2025
SWAMI VIDYA PRAKASHANANDA GIRI
swami sundara chaitanyananda #special video #must watch
Tuesday, October 14, 2025
#Chaitanya_Ganam_01#lyricsvideo #swami_sundara_chaitanyananda #yedavalli_sudarshan_reddy
Monday, October 13, 2025
ETV_Sri_Bhagavatam 241 episodes link#archive.org#view or download
SRI BHAGAVATAM ETV EPISODES #yedavalli_sudarshan_reddy
SRI BHAGAVATAM ETV EPISODES FROM 01 TO 241 LINK:
Sunday, October 12, 2025
Yedavalli_Sudarshan_Reddy#youtube_channel#subscribe#share#daily_Bhakti_videos#10#uploaded_in_our_Channel
Friday, October 10, 2025
SREE BHAGAVATAM ETV SERIAL TOTAL 241 EPISODES FREE DOWNLOAD LINK
Sri Bhagavatam ETV Episodes -1 to 241
SREE BHAGAVATAM ETV SERIAL
TOTAL 241 EPISODES FREE VIEW OR DOWNLOAD LINK:
Thursday, October 9, 2025
భగవద్గీత సారాంశము
పరమాత్మనేనమ మః శ్రీ గురుధ్యానము:
భగవద్గీత సారాంశము
వ్యర్థంగా ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు?
ఎవరు నిన్ను చంపగలరు? ఆత్మకు చావులేదు, పుట్టుకాలేదు జరిగిన దానిగురించి బాధ,
జరిగిందీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ, అంతా మన మంచికే. జరగబోయే దాని గురించి
ఆతృతావద్దు. జరుగుతున్న వర్తమానం మీద శ్రద్ధ వహించు. నీదేమి పోయిందని దుఃఖిస్తున్నావు? వెంట ఏమి తెచ్చావని నీవు పోగట్టుకున్నానని బాధ పడడానికి ? నువ్వేం ఉత్పత్తి చేసావు, అది నాశనమైందని చింతించడానికి ? నువ్వేమీ వెంట తీసుకుని రాలేదు. సంపాదించిందేదో
ఇక్కడే సంపాదించావు.,. ఇవ్వడం కూడా ఇక్కడి వారికే ఇచ్చావు అంతేకాదు, తీసుకున్నది కూడా,
పరమాత్మ దగ్గర నుంచే తీసుకున్నావు. ఇవ్వడం కూడా, పరమాత్మకే ఇచ్చావు. ఖాళీ చేతులతో, వచ్చావు, తిరిగి ఖాళీ చేతులతోనే వెళ్తావు. ఈ రోజు నీదనకుంటున్నది, నిన్న వేరొకరిది, మొన్న ఇంకెవరిదో. దీనిని నీదనుకుని మురిసి పోతున్నావు. ఈ ఆనందమే, నీ దుఃఖాలకు మూలం.
మార్పు జీవన సిద్ధాంతం. నీవు మృత్యువని భావిస్తున్నావే, నిజానికి అది జీవితం. ఒక్క క్షణంలో నీవు కోటిశ్వరుడవు కాగలవు, మరుక్షణంలో దరిద్రుడవూ కాగలవు. నాది. నీది, చిన్న, పెద్ద, స్వపర,
వంటి భేద భావాల్ని తొలగించుకో, అప్పుడు అన్నీ నీవిగా, అందరూ నీవారుగా, నీవు అందరికీ చెందిన వ్యక్తిగా భావించుకోగలుగుతావు.
ఈ శరీరం నీది కాదు, నువ్వీ శరీరానికి చెందిన మనిషివీ కాదు. ఈ శరీరం అగ్ని, నీరు, గాలి, మట్టి, ఆకాశం - వీటితో తయారైంది. తిరిగి వాటిలోనే ఐక్యమైపోతుంది. కాని, ఆత్మ శాశ్వతమైనది,
మరి నీ వెవరు ?
నిన్ను నీవు పరమాత్మకు అర్పితం చేసుకో. ఇదే నీకు సర్వోత్తమమైన ఆధారం. ఇది తెలిసినవారికి భయము, చింత, దుఃఖము కలుగవు..
నీవు చేసే ప్రతి పనినీ ఈశ్వరార్పితం చెయ్యి. ఇలా చేయడం వలన నీకు సదా జీవన్ముక్తికి సంబంధించిన అనందం కలుగుతుంది.
(కృష్ణం వందే జగద్గురుమ్)