KTR Speech on Hyderabad Slang: కేటీఆర్ చెప్పిన హైదరాబాద్ తెలుగు యాస.. అదుర్స్ అంటున్న యూత్!
- Published by:Kumar Krishna
- news18-telugu
Last Updated:
KTR Speech on Hyderabad Slang: తెలంగాణలోని పవర్‌ఫుల్ నేతల్లో కేటీఆర్ ఒకరు. ఆయన ప్రసంగాలు ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. సంథింగ్ ఏదో ఒక కొత్త విషయం ఉండి తీరుతుంది. తాజాగా ఆయన మరోసారి తన స్టైల్ ఆఫ్ డైలాగ్స్‌తో ఆకట్టుకున్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం ముంబైలో నిర్వహించిన ఎన్‌డీటీవీ యువా 2025 కాన్క్లేవ్‌లో జనరేషన్ జెడ్ (జెన్‌జెడ్) యువతకు ప్రేరణాత్మక చాట్‌లో పాల్గొన్నారు. భారతదేశంలో యువత అభివృద్ధి అవకాశాలు, ఆర్థిక వ్యవస్థలోని లోపాలు, మోదీ ప్రభుత్వ విధానాలపై ఈ ఈవెంట్‌లో కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, యువత ఆకాంక్షలను అవగాహన చేసుకోకపోతే, భారత్‌లో 'నేపాల్ లాంటి' యువత అల్లర్లు రావచ్చని హెచ్చరించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎన్‌డీటీవీ యువా కాన్క్లేవ్, యువత అభివృద్ధి, మార్పు వాళ్లను కేంద్రీకరించి నిర్వహించినది. కేటీఆర్ ఫైర్‌సైడ్ చాట్‌లో భవిష్యత్తు ఆకాంక్షలపై మాట్లాడారు. జెన్‌జెడ్ అంటే.. 1997-2012 మధ్య జన్మించినవారు. వీరు 13-28 సంవత్సరాల వయస్సు కలిగిన యూత్. "యువత గొంతుకను అణచివేస్తే, డెమాక్రసీ బలహీనపడుతుంది. తెలంగాణలో మేము యువతకు అవకాశాలు కల్పించాం, కానీ దేశవ్యాప్తంగా ఇది లోపించింది" అని అన్నారు. నేపాల్‌లో యువత ఉద్యమం, ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా ఇచ్చిన సంఘటనను ఉదాహరణగా చెప్పారు. "అక్కడ యువత 'అన్‌ఎంప్లాయ్‌మెంట్ చైన్స్' గురించి మాట్లాడారు. భారత్‌లో కూడా ఇలాంటివి రావచ్చు, కానీ మనం దాన్ని నివారించాలి" అని అన్నారు.
No comments:
Post a Comment