Tuesday, October 17, 2023

సుందర సత్సంగము

సుందర సత్సంగ్ కార్యక్రమము 
1.ఓంకారము 2. ప్రార్థన 3. గణేశస్తుతి 4. గురుస్తోత్రం 5. భజన 6. భగవద్గీత - 
ఒక అధ్యాయము పారాయణ 7. విష్ణుసహస్రనామములోని కొన్ని నామాలపై వ్యాఖ్యను చదువుట 8. చంద్రభాగా తరంగాలు - ఒక కథను చదువుట 9. కలికల్మష నాశన మహామంత్రం... హరేరామ... హరేరామ 10. భజన 11. అష్టకము 12. అంతరేక్షణ 1. గత వారములో నిత్యము ధ్యానము చేయుట జరిగినదా? 2. ఏ ఆధ్యాత్మిక గ్రంథమును చదివితివి? 3. ఎన్ని గీతాశ్లోకాలు కంఠస్థము చేసితివి? 4. ఎన్ని గంటలు మౌనము పాటించితివి ? 5. ఎంత దానము చేసితివి ? 6. ఎన్ని పర్యాయములు కోపము వచ్చినది ? ఎందులకు? కోపము వచ్చినందుకు నీవు అనుసరించిన స్వయం ప్రాయశ్చిత్తమేమి ? 7. ఎంతమందిని విమర్శించితివి ? దానివలన ఏమి లభించినది. 
8. ఈ వారములో ఏ సద్గుణము నలవరచు కొంటివి ? 9. ఏ దుర్గుణమును పోగొట్టుకొంటివి ? 10. ఏ ఇంద్రియము నిన్ను ఎక్కువగా బాధించుచున్నది ? దానిని జయించుటకు నీవు అనుసరించు సాధనమేమి? 13. ధ్యానము 14. హారతి... ఓం జయగీతామాతా 15. ఓం నమో భగవతే వాసుదేవాయ 16. శ్రీ రామ జైరామ జై జై రామ ఓం. 17. మృత్యుంజయ మహామంత్రము. శాంతిమంత్రము సుందర సత్సంగము ప్రతిజ్ఞ సుందర సత్సంగ సభ్యులమైన మేము ఒక కుటుంబములోని వ్యక్తులవలె ప్రేమతో అవగాహనతో జీవించెదముగాక! సత్యమునే భాషిస్తూ, సత్యమై భాసించెదము గాక ! సర్వజీవులకు ప్రేమను పంచుతూ, ప్రేమలో చరించెదము గాక ! నిరంతరం తపోధ్యానాదులతో శాంతి జీవనమును సాగించెదముగాక ! నిస్వార్ధబుద్ధితో, త్యాగనిరతితో సేవా కార్యక్రమాలలో పాల్గొనెదము గాక ! మూఢవిశ్వాసాలకు స్వస్తిచెప్పి, విజ్ఞానముతో సత్యద్రష్టలైన మహర్షుల మార్గములో చరించి, తరించెదముగాక ! అహంకార శత్రువును అంతమొందించుటలో వీర సైనికుని వలె పోరాడెదముగాక ! జ్ఞానమును అనుభవించుట అద్దానిని ఇతరులకు అందించుట ఇదియే మా జీవిత లక్ష్యమగు గాక! అవి ప్రతిజ్ఞ చేయుచున్నాము. 
 గీతామాతా! హారతి గైకొనుమా ఓం జయగీతా మాతా ! ఓం జయగీతా మాత 
భవ బంధము తొలగించి ముక్తినొసగు దాత ఓం కర్మ భక్తి జ్ఞాన యోగములు 
నీ ఆభరాణాలు అమ్మా నీ ఆభరణాలు ముక్తినొసగు నీ సన్నిధి కరుణించుము మాతా |ఓం 1. సీతవు నీవే సావిత్రివి నీవే నీవే గాయత్రివి అమ్మా గంగాయమునా సరస్వతులలో పవిత్రతవునీవే ||ఓol| 2. జాగ్రత్స్వప్న సుషుపులలో సాక్షివై యుండి - 
దివ్య తురీయాతీత బ్రహ్మవు నీవే చిన్మయ స్వరూపిణి ||ఓం|| 3. విషాదమును దాటించి సాంఖ్యము బోధించి అమ్మా కర్మ జ్ఞాన సన్యాసము ధ్యానమును తెలుపు మమ్ము ఆత్మలో నిలుపు ||ఓం|| 4. విజ్ఞానమును తెలిపి అక్షర బ్రహ్మమును పలికి రాజగుహ్య విభూతి దర్శన భక్తిని, అందించు మాకు ముక్తి ప్రసాదించు క్షేత్రము కాదని, క్షేత్రజ్ఞుడ నేనని గుణత్రయము వివరించు పురుషునిలో మమ్ముంచు దైవాసుర సంపత్తి శ్రద్ధను బోధించు మోక్షరూపముగా ఉంచు ||ఓం|| 5. అమ్మవు నీవు ఆత్మవు నీవు అంతయు నీవేలే ఉన్నదంతయు నీవేలే సుందరమగు చైతన్యము నీవు లక్ష్మివి నీవేలే మోక్ష లక్ష్మివి నీవేలే ||ఓం|| 
 శాంతిమంత్రమలు 1. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా త్పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమే వా వశిష్యతే | ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తి : *అదంతయు పూర్ణము. ఇదంతయు పూర్ణము. పూర్ణమునుండి పూర్ణము ఆవిర్భవించెను. పూర్ణము నుండి పూర్ణమును తీసివేయగా పూర్ణమే శేషించును. 2. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు సర్వేషాం శాంతిర్భవతు సర్వేషాం పూర్ణం భవతు సర్వేషాం మంగళం భవతు ఓం శాంతి శ్శాంతి శ్శాంతి : *సర్వులకు శుభము కలుగు గాక ! సర్వులకు శాంతి కలుగు గాక! సర్వులకు పూర్ణత్వము సిద్ధించుగాక ! సర్వులకు మంగళము చేకూరుగాక ! 3. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః *ఓం. నన్ను అసత్తు నుండి సత్తునకు గొనిపొమ్ము. తమస్సు నుండి వెలుగులోనికి గొనిపొమ్ము. మృత్యువు నుండి అమృతత్వమునకు నడిపింపుము. 4. ఓం సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై| తేజస్వినావధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి శ్శాంతి శ్శాంతి : *మమ్ముల నుభయులను అతడు రక్షించు గాక ! మమ్ముల నిరువురిని పోషించు గాక ! మాకు అతడు జ్ఞానమును కలుగు| జేయు-గాక! తేజోవంతమైన జ్ఞానము మాకు ఫలప్రదమగు గాక ! పరస్పరము మాకు ద్వేషము కలుగ కుండు గాక ! కాయేనవాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి *మనోవాక్కాయ కర్మలచే, బుద్ధిచే, అహంకారముచే, స్వభావముచే ఏదేది చేయుచున్నానో అది అంతయు శ్రీమన్నారాయణునకే అర్పణ చేయు చున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ

No comments:

Post a Comment