Sunday, June 29, 2025

OUR SWARNJALI GROUP MEMBER #daripally_jayakumar_acharya - MRIDAGNGAM AND TABLA LECTURER AT NNAMACHRYA MUSIC COLLEGE RETIREMENT(30-06-2025) CELEBERATIONS VIDEOS

OUR SWARNJALI GROUP MEMBER #daripally_jayakumar_acharya - MRIDAGNGAM AND TABLA LECTURER AT NNAMACHRYA MUSIC COLLEGE RETIREMENT(30-06-2025) CELEBERATIONS VIDEOS PL SHARE OUR SWARANJALI PROGRAMME

Wednesday, June 18, 2025

LORD GANESH SONGS GOOGLE DRIVE FOLDER LINK VIEW EMBEDDED FOLDER

LIST VIEW:

LORD OF SEVEN HILLS BOOKS FREE DOWNLOAD#MUST WATCH#DOWNLOAD FREE PDF

DOWNLOAD LINK: https://drive.google.com/file/d/1nRGoQYhANJjtmI6ZUuG-NRIxnX0myTJ2/view?usp=drive_link VIEW WEB LINK: https://lordofsevenhills.com/ https://youtu.be/NGM5lrrStTQ?si=W6CHdctdsBFi8ZOy

ఆధ్యాత్మిక ఇంజినీరు

• తిరుమలేశుడి విశేషాలపై రచనలు • ఉచితంగా పుస్తకాల పంపిణీ


న్యూస్టుడే, ఫిలింనగర్

పేరు: టి.వి.ఆర్.కె.మూర్తి కలం పేరు: విశ్వపతి

వయస్సు: 53 ఏళ్లు విద్య: వరంగల్ ఆర్ ఈసీలో ఎంటెక్

గత వృత్తి: ఆల్విన్, ఎం.వి.ఎస్.ఆర్. కంపెనీలో ఇంజినీర్.

ప్రస్తుతం: లోగోలు డిజైన్ చేయడం. ప్రవృత్తి: శ్రీనివాసుడిపై ఆధ్యాత్మిక పుస్తకాల

రచన: ఉచిత పంపిణీ.

నగరంలోని మోతీనగర్కు చెందిన టి.వి.ఆర్.కె.మూర్తి... శ్రీనివాసుడిపై ఇప్పటికే పది పుస్తకాలు రచించారు.

కావాల్సిన వారికి వాటిని ఉచితంగా పంచుతున్నారు. కోరితే సొంత ఖర్చుతో కొరియర్లోనే వాటిని చేరవేయడం ఆయన ఆధ్యాత్మిక ఉదారతకు నిద'ర్శనం. 'విశ్వపతి' అనే కలం పేరుతో

ప్రసిద్ధుడైన ఈయన... వరంగల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదివారు. తరువాత ఆల్విన్ కంపెనీలోను, ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలోనూ పలు హోదాల్లో పని చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్లో సమ్ 'ఫన్' అనే పేరుతో ప్యాకెట్ కార్టూన్లు

వేసేవారు. 1993లో హాబీగా లోగోలు డిజైన్ చేయడం ప్రారంభించారు. 1998 నుంచి పూర్తి సమయాన్ని వాటి డిజైనింగ్ కే కేటాయిస్తున్నారు. తొలి నుంచి శ్రీనివాసుడిపై ఉన్న భక్తి ప్రపత్తులను

ఆయన తన రచనల ద్వారా చాటుకుంటున్నారు.తానే స్వయంగా శ్రీశ్రీనివాస మహత్మ్యం, శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం రచించారు. విదేశీ భక్తుల కోసం ఈ పుస్తకాలను ఇంటర్నెట్ లో డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు, లార్డ్ ఆఫ్ సెవెన్ హిల్స్ డాట్ కామ్ https://lordofsevenhills.com/ వెబ్సైట్లో ఉంచారు. వీటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పుస్తకం పూర్తి కాగానే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లి మొదటి ప్రతులను స్వామి హుండీలో సమర్పించడం ఈయన అనవాయితీ. ఎందరికైనా.... ప్రతి రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి-మూర్తికి దాదాపు రెండు వందలకుపైగా ఉత్తరాలు వస్తుంటాయి అతనితో పాటు ఆయన కుటుంబసభ్యులు కలిసి ఎప్పటికప్పుడు ఆ పుస్తకాలను ప్యాకింగ్ చేసి కొరియర్ ద్వారా ఉచితంగా పంపుతారు. ఎంతటి మారుమూల గ్రామాలకైనా ఈ పుస్తకాలను పంపిస్తారు. శ్రీవెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకాలను ఇప్పటివరకు లక్షకు పైగా ఉచితంగా పంచిపెట్టారు. వాటిని పంపేందుకు అయ్యే పోస్టు ఖర్చులను కూడా ఆయనే భరిస్తారు. వీటి ముద్రణ కోసం ప్రత్యేక కార్యాలయాన్ని తన ఇంట్లోనే ఏర్పాటు చేసుకొన్నారు. తిరుమలేశుడి విశేషాలు చాలా మందికి

తెలియవు. అందుకే ఆ విశేషాలతో పుస్తకాలను రచిస్తున్నట్లు మూర్తి తెలిపారు. ఇవి కావాల్సిన వారు టి.వి.ఆర్.కె. మూర్తి (విశ్వపతి) ఫ్లాట్ 202, ప్లాట్ నెం. 32. రవి రెసిడెన్సీ, నలంద హైస్కూల్ పక్కన,

మోతినగర్ క్రాస్ రోడ్, హైదరాబాద్-500018కు లేదా 9849443752 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.

శ్రీనివాస మహత్యం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న పుష్పగిరి పీఠాధిపతి శ్రీనరసింహభారతీ స్వామి (పాతచిత్రం)