#నిర్ణయంమనదే రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు.

#నిర్ణయంమనదే రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవు. మీ అరవై ఏండ్ల పాలనలో జరిగిన విధ్వంసాన్ని పదేండ్లలో మార్చగలమా ...?? మార్పు ఇవ్వాల మీరు కొత్తగా అడిగేది ఏంది ...?? తెలంగాణా వాళ్లే మార్పు కోరుకొని పదేండ్ల కిందనే మిమ్మల్ని బొంద పెట్టిండ్రు. ఎరువుల కోసం రోజుల తరబడి లైన్లల్లో నిలబడ్డ రోజుల్ని మేము ఇంకా మరువలే .... తాగు నీళ్లకోసం ట్యాంకర్ల చుట్టూ తిరిగిన మీ కాలపు రోజుల్ని మేము అస్సలు మరువలే .... కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కట్టిన 36 ఫ్లయ్ ఓవర్లు లేని రోజున ట్రాఫిక్ కష్టాల్ని మేము మరువలే ... 33 మెడికల్ కాలేజీలు ఉన్న మేము 3 కాలేజీలతో వైద్య విద్యకు మా పిల్లల్న దూరం చేసిన రోజుల్ని మరువలే ... ఫ్లోరైడ్ నీళ్లు నిత్యం తాగుతూ వంకర్లు పోయిన కాళ్ళు చేతులతో మమ్మల్ని ఏడిపించిన రోజుల్ని అస్సలు మరువలే ... బతుకు కోసం వలసపోయిన పాలమూరు బతుకులు ఇంకా మరువలే .... ఎన్నని చెప్పాలే ... ఇప్పుడే సల్లగా బతుకుతున్న మా మీదా #మార్పు అంటూ మీ అధికారం కోసం చేసే దండయాత్ర మాత్రం ఎట్లా మరుస్తాం .... మా ఓటు తో మిమ్మల్ని మాల్లోక్కసారి బొంద పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం .... కారు మాదే ... సర్కారు మాదే .... జై తెలంగాణా .... ✊

Friday, November 17, 2023

Posani Krishna Murali Sensational Interview | CM KCR | Telangana Elections 2023 | Mirror TV

Varthalu Vastavalu : Congress Senior Leader Chidambaram Remarks On Telangana Movement | T News Sr Journalist Saye Sekhar Exclusive Interview Analyst KS Prasad | Telangana Congress | MirrorTV

Thursday, November 16, 2023

జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా మూడు దినాల ముచ్చటయేనా రేపోమాపో చీకటియేనా#swami_sundara_chaitanyananda

జీవితమింతేనా సుఖదుఃఖాల సమరాంగణమేనా మూడు దినాల ముచ్చటయేనా రేపోమాపో చీకటియేనా * ఆశలన్నీఅలలేనా ఆనందాలన్నీ కలలేనా కళకళలాడుచు కదిలే ప్రేమలు జీవిని బంధించు వలలేనా * మనసులు కదిపి మమతలు చూపి మంటలురేపే గతియేనా మంచిని కుదిపి వంచన చేసి బూదిగ మిగిలే తిధియేనా *పొరపాటులు యెడబాటులు యెదబాధలు విధియేనా అశ్రులు నిండిన అనుభవ ధనమే మనిషికి మిగిలిన నిధియేనా * అభిమానాలతో అవమానాలతో శతమానంభవతి అలజడి నిండిన ఆవేదనలతో శోకమయం జగతి నీకేదైనా నీవేమైనా వీడదు ధర్మం నిరతి నిండే యెండే జగతి చెఱువులో తీరనిగతికేరీతి జ్ఞానము పంచే చైతన్యగీతి ఆత్మబంధువులకు తెలియజేయునది భజనల లింక్ ఇస్తున్నాము మీకు కావలసిన భజనలను view/download చేసికొనండి https://archive.org/details/@sudarshan_reddy330?query=%23swami_sundara_chaitanyananda&sort=-publicdate

కిసాన్ సర్కార్...!!#Kallem_Naveen_Reddy

 

కిసాన్ సర్కార్...!! 
కిసాన్ సర్కార్ గా రైతు ముఖ్యమంత్రిగా రైతు రుణమాఫీ! 
అతని నిర్ణయాలు ఏవైనా గొప్పగానే ఉంటాయి రైతు 
సంక్షేమం కోసం ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తాడు 
కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేవలం పదవి 
ఉంటేనే సాధ్యం కాదు దానికి గొప్ప మనస్సు ఉండాలి! 
అలాంటి గొప్ప హృదయం కలిగిన భాద్యత నెరిగిన 
 మన తరంలో ఉన్నటువంటి గొప్ప సేవకుడు కేసిఆర్! 
అతను చెప్పిందే చేస్తాడు చేసేదే చెప్తాడు అతను 
నిరంతరం పనిచేస్తూనే ఉంటాడు అతని ఆలోచనలు 
నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాయి! కళ్ళెం నవీన్ రెడ్డి

యేమిటో నీ లీలలు నారాయణా

https://youtube.com/shorts/mQDqlwamryM?si=OtBdFuEAHneSHWQy

యేమిటో నీ లీలలు నారాయణా 
ఎవరూ తెలియని లోకంలోకి చేరుస్తావు. 
ఎవరెవరితోనో బంధాలు కలిసేలా చేస్తావు. 
మీవాళ్లు అంటూ కొందరని చూపిస్తావు. 
నా వాళ్లు కావాలి అనేలా ఇంకొందరిని పరిచయం చేస్తావు. 
చివరికి ఎవరితోనో ముడి వేస్తావు. ముడి వేసిన బంధాలు 
చాలవన్నట్లు మనవి కాని బంధాల మీద మక్కువ పెంచుకునేలా చేస్తావు. 
చివరికి ఎవ్వరికీ ఎవరూ కాదు నీకు నీవే తోడు. అనేలా ఒంటరిగా మిగులుస్తావు 
ఎంత చిత్రం అయ్యా.... నీ లీలలు గోవిందా

తెలివి తప్పి మసలితే.. తెర్లవుతవు! #డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 92465 41699

 
తెలివి తప్పి మసలితే.. తెర్లవుతవు! 
అభివృద్ధికి పట్టం, ‘బీఆర్ఎస్’ చుట్టం! ప్రగతి పరి శ్రమలకు ప్రయోజనపు గొట్టం! అడ్డగించు ప్రతిపక్షం అవును నేలమట్టం! ఎటు చూసిన 'ఫ్లయి ఓవర్ ఎదురయ్యే కట్టడాలు 'ట్రాఫిక్ సమస్యలకు’ ఆయె అడ్డు కట్టడాలు! దళితబంధు, రైతుబంధు మిళితమైన స్నేహబంధు, కాళేశ్వర ప్రాజెక్టుల కలల సాగు మనముందు! ఇంతవరకు ఏ పార్టీ అంత ఘనత చూపిందా? కళ్లు తెరచి ఒళ్లు విరిచి ఆలోచించుము ముందు! నోటుకాశ పడ్డావో ఓటరన్న ఒక్కసారి నీ కన్నును నీవే పొడుచుకొందువన్నా! తెలివి తప్పి మసలావో తెర్లవుతవు అన్నన్నో!... డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 92465 41699

Thursday, November 2, 2023

ఆయన ఆలోచనలు అజరామరం!#Kallem_Naveen_Reddy

 
ఆయన ఆలోచనలు అజరామరం! 
 మీరు గెలవడానికి ఆలోచిస్తున్నారు కానీ ఆయన గెలిపించడానికి ఆలోచిస్తాడు! తేడా అర్దం అయితేనే ఆయన అర్దం అవుతాడు! ఆయన లక్ష్యం వ్యక్తి కాదు ఆయన లక్ష్యం వ్యవస్థను అవస్థల నుండి కాపాడటమే...!! ఆయన అర్దం కావాలంటే ఆయనలాగే ఆలోచించాలి...!! అతను నిరంతరం ప్రవహించే ఆలోచనల సముద్రం...!! లోతుగా అధ్యయనం చేస్తేనే గొప్ప ఆలోచనలు అర్దం అవుతాయి గొప్ప వ్యక్తులు అర్దం అవుతారు...!! మంచి చేశాడు - మళ్ళీ వస్తాడు మన ప్రభుత్వం - మన తెలంగాణ - Kallem Naveen Reddy

అతను ఈ మట్టి పరిమళం#Kallem_Naveen_Reddy

 

అతను ఈ మట్టి పరిమళం! 
వర్షపు చుక్కలకు తడిసిన పల్లెలు తన ఒడిలో ఎన్నో పరిమళాలను కప్పి పెట్టి 
ఒక్కసారిగా ఆ పరిమళాలను కుమ్మరిస్తుంది...! అవును అందంగా పల్లెలు తడుస్తాయి 
నేలా తడుస్తుంది పచ్చదనమై పరుచుకుంటుంది మట్టి బువ్వ అవుతుంది రైతు కళ్ళల్లో ఆనందం పూస్తుంది బతుకు పాఠం అవుతుంది...! ఆ అందమైన ప్రకృతిలో ఎన్నో 
అనంతమైన అంశాలు దాగి ఉన్నాయి ఆ యోధుని ప్రేమకు తెలంగాణ మీదున్న 
బాధ్యతతో ఈ మట్టి సంతకమై భూమి పొరల్లో నుండి విచ్చుకుంటున్న మొక్కే 
అతని పాలనకు నిదర్శనం...!! - Kallem Naveen Reddy - Kamareddy

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు#Kallem_Naveen_Reddy

ఎవరు అడగకముందే కేసిఆర్ గారు ఇప్పటిదాకా చేశాడు 
అవును ఎవరు అడగలేదు అడగాల్సిన అవసరం రాకుండా చేశాడు ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటాడు ఇప్పటిదాకా ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గమనిస్తే తెలుస్తుంది చేసిన అభివృద్ధిని చూస్తే కనిపిస్తుంది! అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదనీ అంటారు కానీ అడగముందే అన్నీ చేసిన వ్యక్తి మనతరంలో ఉండటం ఖచ్చితంగా మన అదృష్టమే! అతను ఒక చరిత్రను సృష్టించే ఆయుధం మన బతుకులను మార్చినా భరోసా అతను నిరంతరం ప్రవహించే నది అతను ఆలోచనల పరంపర! అతను శత్రువును కూడా తన పనితో ప్రభావితం చేయగలడు కాబట్టీ అతనితో నడవడం అంటే భవిష్యత్ తరాలకు మార్గాలను వేయడమే! - Kallem Naveen Reddy