ఒక రైతు సంకల్పం తన దేశం కోసం || శ్రీశైల్ రెడ్డి పంజుగుల…90309 97371

నమస్తే తెలంగాణ-హైదరాబాద్ మంగళవారం 28 మార్చి 2023 www.ntnews.com వేదిక ఒక రైతు సంకల్పం తన దేశం కోసం శ్రీశైల్ రెడ్డి పంజుగుల…90309 97371 ఊర్ధ్వమూలమధశ్శాఖమ్ అశ్వత్థం ప్రాహురవ్యయమ్ ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ భగవద్గీత పదిహేనవ అధ్యాయం అయిన పురుషోత్తమ ప్రాప్తియోగములో శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన పైశ్లోకం అర్థం: వేళ్లు పైకి, కొమ్మలు కిందకి ఉండే అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) నాశం లేనిది. ఊర్ధ్వమూలం అర్వాక్ శాఖం వృక్షం యో వేద సంప్రతి న స జాతు జనః శ్రద్ధధ్యాత్ మృత్యుర్మా మారయదితిః 'ఈ వేర్లు పైకి, శాఖలు కిందికి ఉన్న వృక్షమును ఎరిగినవారు, మృత్యువు వారిని అంతం చేస్తుందని విశ్వసించరు.' తైత్తిరీయ ఉపనిషత్ చెప్తుంది. భారత రాష్ట్ర సమితి అశ్వత్థ వృక్షము వంటిది. ఇపుడు పైశ్లోకాలు మరలా ఒకసారి చదవండి. బీఆర్ఎస్ అనే అశ్వత్థపు వేర్లూ, శాఖలూ తెలంగాణ నేల నుంచి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ ఉన్నయి. నాందేడ్ తర్వాత మరాఠా గడ్డపై నిన్న జరిగిన కంధార్-లోహ బహిరంగ సభకు హాజరైన భారీ జనం చెప్తున్న నినాదం ఒక్కటే: అబ్ కీ బార్ కిసాన్ సర్కార్! కిసాన్ సర్కార్ ఎందుకు రావాలో మరాఠాలకు బాగా తెలుసు. తమ సమస్యల కోసం రక్తాలు కారుతున్నా లెక్కచేయక నాసిక్నుంచి ముంబై దాకా నడిచి నిరసన తెలిపినవారికి వేరొకరు చెప్పాలా? అర్ధరాత్రి అఘాయిత్యాల ఫడ్నవీస్ లాంటివాళ్లు కేసీఆర్ సభకు రైతాంగాన్ని రాకుండా ఆపగలరా? 512 కిలోలఉల్లిగడ్డలకు సోలాపూర్ మార్కెట్ కమిటీ ఇచ్చిన 2 రూపాయల చెక్కును చూపిస్తూ కన్నీటి పర్యంతమైన రైతు రాజేంద్ర చవాన్ కష్టం తెలి సినవారు తప్పక సంధించే నినాదం 'అబ్ కీబార్ కిసాన్ సర్కార్'. అందుకే నిన్నటి సభ ఒక విజయ గర్జన! శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునునికి కలిగిన విశ్వాసం లాంటిదే అశ్వత్థవృక్షము విషయము నెరిగినవారు తమకు వినా శనం లేదని విశ్వసించగలరు. బీఆర్ఎస్ ఇస్తున్న విశ్వాసం అట్టిదే, మహా గట్టిదే. మీరు తరచి చూస్తే మరొక్క విషయం కూడా బోధపడుతుంది. ఆకాశమంతానా భూగోళమం తానా అన్నట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నా... అశ్వత్థ వృక్షం మూలం ఒక్కచోట ఉంటుంది. అట్లే బీఆర్ఎస్ మూలం తెలంగాణ. నిన్నటిదాకా తెలంగాణ గురించి పల్లెత్తని వారుకూడా బీఆర్ఎస్ పేరు మార్పుపై 'తెలంగాణవాదం నుంచి పారిపోయిండు కేసీఆర్' అనడం పరమ హాస్యాస్పదం. ప్రముఖ సినీ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బాలచందర్, సూపర్ స్టార్ రజనీకాంత్ను చేసిన ఇంటర్వ్యూ ఉంటుంది యూట్యూబ్లో, చూడండి. 'ఏరా... నువ్వు శివాజీరావు గైక్వాడ్గా ఉండటానికి ఇష్టపడతావా లేక రజనీకాంత్ లాగానా?' అని బాలచందర్ అడిగితే రజనీ అంటాడు 'ఆ శివాజీరావు లేకపోతే ఈ రజనీకాంత్ ఎక్కడ?' అని. అర్థమయింది కదా ? బీఆర్ఎస్ దేశాన్ని ఏలినా తెలంగాణ తల్లి కన్నబిడ్డే. తమ మూలాలు మర వనివారే లోకాలు ఏలగలరు! అసలు దేనికి విమర్శిస్తున్నామో కూడా తెలియనివారికి ఎప్పుడూ కళ్ళు బైర్లు కమ్ముతాయి. పాపం 'కంటి వెలుగు' పరిధిలోకీ రాలేనివారు! అందుకే, ఎక్కడో ఛత్తీస్గఢ్లోని వార్తను తెచ్చి తెలంగాణ ప్రభుత్వంపై నోరు పారేసుకొని పలుచన అయిన్రు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఇక, కేసీఆర్ ఏమన్నారు నిన్న కంధార్-లోహ సభలో 'తెలంగాణలో లాగ రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఇంటింటికీ రక్షిత తాగునీరు, ప్రతి ఎకరానికీ సాగునీరు ఇస్తవా ఫడ్నవీస్? ఇచ్చి చూపించు, నేను ఇంకరాను మహారాష్ట్రకు' అంటూ కుండబద్దలు కొట్టిన్రు. ఒక్కసారి గులాబీ జెండా ఎగరగానే గుబులు పుట్టి రైతుకు ఆరువేల రూపాయలు అంటూ బడ్జెట్లో మాట్లాడిన్రు' అని కూడా అన్నరు. That is BRS effect! ప్రజలను, ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా కొనడం కంటే; ఏక్నాథ్ షిండేలను సృష్టించి, పార్టీలను చీల్చి ప్రభుత్వంలోకి రావడమే తెలిసిన ఫడ్నవీస్ కూ, వారి పార్టీకి ఎన్ని చెప్పినా దండగే. మహారాష్ట్ర గడ్డను పావనం చేసిన తాత్వికుడు తుకారాం... బుడగ వంటి బతుకు ఒక చిటికెలోన చితుకు... అది శాశ్వతమని తలచేవురా, నీవెందుకనీ మురిసేవురా' అంటడుకదా! విశ్వగురువు, అఖండ భారత మాటున విషద్వేషాలే మార్గంగా భారత్ను ఖండఖండాలు చేసే బీజేపీకి జెల్ల తగిలితే గానీ తత్వం బోధపడదు. వారిని ఎన్నికల క్షేత్రంలో చిత్తుచిత్తు చేయడం ఒక్కటే మందు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అవశ్యం! పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్ లాగ భిక్ష ఎత్తుకునే దేశం కాదు. చైనా, సింగపూర్, మలేషియాలాగ సుభిక్ష దేశం కావాలని ఆశించే కేసీఆర్ సంకల్పానికి అడొచ్చే శక్తి ఈ గడ్డపై లేదు. మనం ఏయే అభివృద్ధి సూచీలలో ఎంతెంత వెనుకబడి ఉన్నామో, ఎట్లా మన దేశాన్ని ప్రపంచంలో మేటి శక్తిగా తయారు చేయవచ్చో మీకందరికీ తెలుసు. గణాంకాల సహితంగా కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పి ఉన్నరు. అవన్నీ ఒక్క క్లిక్తో మీకు దొరుకుతయి కాబట్టి ఆ వివరాల్లోకి పోవడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. సూటిగా ఒక్కటే. ఏమి చేద్దాము ఈ దేశాన్ని? ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ నేతలు రోజూ జపించే పాకిస్థాన్ లాగచేద్దామా? పసి పిల్లలకు గుక్కెడు పాలుదొరకని ఆ దేశం దీనావస్థ తెలుసు కదా మీకు? అభివృద్ధి, సంక్షేమాలను పక్కనపడేసి కేవలం మతం । ద్వారా రాజకీయంచేసి, మతరాజ్యంగా మారిన తర్వాత మనమేమిటి, ఏ దేశమైనా పాకిస్థాన్ కావాల్సిందే. అట్లాఒద్దురా బాబూ... మన దగ్గర అన్నీ ఉన్నయి. సకల వనరులున్నయి, వాటిని ఉపయోగంలో పెట్టే సకలజనమూ ఉన్నరు,ప్రపంచం ఆశ్చర్యపోయే అభివృద్ధి సాధ్యమే, తొమ్మిదేండ్ల తెలంగాణ నిలువెత్తు ఉదాహరణగా ఉన్నది, దేశానికి దివిటీ చూపిస్తున్నది. 'పదండి దేశాన్ని బాగుచేసుకుందాం' అని కేసీఆర్ పిలుపునిచ్చిన్రు. దేశభక్తి మీద భక్తి తప్ప దేశంమీద భక్తి లేని మూకలు సహజంగానే సహించలేని రాజకీయం కేసీఆర్దిది. ఆ టాస్క్ మాస్టర్ గొంతు నులమాలని బీజేపీ కంకణం కట్టుకున్నది. అందులో భాగమే బీఆర్ఎస్ నాయకులపై ఈడీ సహా అన్ని వ్యవస్థల ప్రయోగం. 'ప్రశ్నించాలి ప్రశ్నించాలి' అంటూ ఉంటరు కొందరు. తప్పు చేసినవారిని శిక్షించవద్దా అంటరు కొందరు. అసలు తప్పుడు ప్రశ్ననుకదా వివేచన గలవారు ప్రశ్నించవలసింది? https://www.indiabudget.gov.in/ doc/rec/annex9.pdf ఈ ఫైల్ ఓపెన్ చేయండి విజ్ఞులారా. భారత ప్రభుత్వ ఆర్థికశాఖ వెబ్సైట్లో ఉన్న అధికార అప్పుల చిట్టా అది. ఈ నెలాఖరుకు, అంటే మరొక పది రోజుల్లో మన అప్పు రూ.1,52,61,122కు (అంటే కోటీయాభై మూడు లక్షల కోట్లు!); వచ్చే సంవత్సరాంతానికి రూ.1,69,46,666కు (అంటే కోటీడెబ్బై లక్షల కోట్లు!)కు చేరుకుంటుంది. ఈ తెచ్చిన పైసలన్నీ ఏమైనయి? ఎవరికిపెట్టిన్రు? మీకు ఎవరికన్నా గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపునకు వాడిండా మోదీ? జేబులోపర్సును చూసి రెండొందలా లేక ఒక వందచాలేమో అంటూ చింతలో పడుతూ బండిలో పెట్రోల్ పోయించే మిమ్మల్ని ఏమన్నా ఆదుకోవడానికి విదిలిస్తున్నడా ఆ పైసలు? పెన్సిల్, షార్సైనర్పై జీఎస్టీ వేసి మీ చిన్నారులు చదువును మొద్దుబార్చడం తప్ప వారికేమన్న తాతలా సహాయపడుతున్నడా? 'యోగక్షేమం వహామ్యహమ్' అని లోగో పెట్టుకొని జీవనంలోనూ, జీవనం అనంతరమూ భరోసా పడే ఎల్ఎసీని భక్షిస్తూ మీ భద్ర జీవనానికి తూట్లు పొడిచే పాలసీ ఎందుకు తెచ్చిండు? అన్నేసి కోట్ల అప్పులు మనమీద రుద్ది ఇంకా కక్కుర్తి ఎందుకు? మీ అవ్వాతాతలకు రైళ్లలో కన్సెషన్ ఎత్తేసి మిగిల్చిన పైసలు ఏమి చేస్తున్నడు? ఎందుకు అందరికీ తాగు నీరు లేదు. ఎందుకు వ్యవసాయ భూములు ఎండిపోతున్నయి? ఎందుకు కరెంటు లేక చీకట్లో వేలాది గ్రామాలు మగ్గుతున్నయి? ఏమి చేస్తున్నరు ఆ పైసలన్నీ? ఎవరికి దోచిపెడుతున్నరు? తెలంగాణ సాధించినవాడు, దాన్ని సమున్నతంగా నిలబెట్టినవాడు, మనతో పాటు దేశాన్ని తల ఎత్తేలా చేయాలని సంకల్పం తీసుకున్నవాడు మనందరికీ ఆత్మీయ లేఖ రాసిండు. మీరే నా బలం, బలగం. అప్రమత్తంగా ఉండా లి. దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రగతికి అడ్డంకులు సృష్టించే 'బీజేపీ బరితెగింపు దాడులను అడ్డుకోవాలి' అని పిలుపునిచ్చిన్రు కేసీఆర్. ఇది ఆయన కోసం కాదు. మీ కోసం, మీ చిన్నారులకోసం, మీ పెద్దవాళ్ల కోసం, మీ సాగు భూములకోసం, మీ తాగు నీటి కోసం, మీ వెలుగు కరెంటు కోసం, మీ జిలుగు బతుకు కోసం! నిన్న మరాఠా గడ్డపై చెప్పిన సంకల్పం, సిద్ధించిన హర్షామోదపు సారాంశం ఇదే! జై భారత్!!

# SRIMADBHAGAVADGITA_SUNDARACHAITANYA#18_Chapters_Videos_Links_Archive.org

https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-anugraha-bashyam https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-dhyana-slokamulu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-1-arjuna-vishadayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-2-sankhyayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-3-karmayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-4-gnana-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-5-karma-sanyasa-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-6-aatma-samyamyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-7-vignana-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-8-akshara-para-brahmayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-9-raja-vidya-raja-guhya-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-10-vibhutiyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-11-vishvarupa-san-darshanayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-12-bhaktiyogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-13-kshetra-kshetragna-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-14-gunatraya-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-15-purushottamaprapti-yogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-16-daivasura-sampad-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-17-shraddhatraya-vibhagayogamu https://archive.org/details/srimadbhagavadgita-sundarachaitanya-chapter-18-moksha-sanyasayogamu

పూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ ఆరాధనోత్సవ ఆహ్వానము5to09-4-2023 వరకు జరుగును

పూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ ఆరాధనోత్సవ ఆహ్వానము 05-4-2023 నుండి 09-4-2023 వరకు జరుగును. గురుదేవులు పూజ్యశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి 25వ పుణ్యారాధన, 110వ జన్మ దినోత్సవము. మరియు 73వ ఆశ్రమ వార్షికోత్సవము 05-4-2023 నుండి 09-4-2023 వరకు జరుగును. పవిత్రాత్మ స్వరూపులారా! శ్రీ శుకబ్రహ్మాశ్రమ స్థాపకులు, గీతామకరంద రచయిత, విఖ్యాత గీతోపన్యాసకులగు శ్రీగురుదేవులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారి ఇరువది ఐదవ పుణ్యారాధన శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ చతుర్దశి బుధవారం 5-4-2023 వ తేదీన, అట్లే శ్రీస్వాములవారి 110వ జన్మదినోత్సవం ఆదివారం 9-4-2023 తేదీలందు జరుపబడును. ఈ కార్యక్రమములు పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాస్వరూపానందగిరి స్వాములవారి సన్నిధిలో, పూజ్యశ్రీశ్రీశ్రీ సంపూర్ణానందగిరి స్వాములవారి అధ్యక్షతన జరుగును. విశేష కార్యక్రమం 05-04-2023వ తేదీన 25 మంది యతీశ్వరులకు పూజ జరుగును.

#AyyappaBhaktiSongs#KJYesudas#అయ్యప్పభక్తిగీతాలు#FULL_ALBUMS_ALL_SONGS

https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-uyaalajampalalo https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharana-tharangini-vol-01 https://archive.org/details/ayyappa-songs-kj-yesudas-vol-9-and-2-and-sharana-tarangini_202303 https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-antadukhamu-shabareeshilanivasa https://archive.org/details/ayyappa-songs-vol-2-kj-yesudas-swami-geetale-and-naamadi-swarnalayam https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-full-album https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2-2-swamigeetalepadudunu https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2-1-swamiyesharanmayyappa https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2-3-namadiswarnalaym https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2-6-karteekamasamulo https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2-7-toliyatrikuda https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2-9-makarasankranti https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2-10-ayyadarshanam https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas-sharanatarangini-vol-2shabareeginadhaa https://archive.org/details/ayyappa-bhakti-songs-kjyesudas https://archive.org/details/ayyappasongs-vol-2-yesudas-karteekamasam-shabareegirinadha-shabareeshailanivasa-makarasamkranti-ayya https://archive.org/details/ayyappa-songs-kj-yesudas-vol-9-and-2-and-sharana-tarangini_20230322 https://archive.org/details/ayyappasongs-vol-2-yesudas https://archive.org/details/ayyappa-swamy-songs-by-yesudas-2022-melodies

CHAITANYA BHAGAVAD GITA_SWAMI SUNDARA CHAITANYANANDA. 18 chapters PDF BOOKS

CHAITANYA BHAGAVADGITA book 18 chapters archive.org links with embeded https://archive.org/details/1.CHAITANYABHAGAVADGITAARJUNAVISHADAYOGAMU1stCHAPTERSUNDARACHAITANYANANDA/mode/2up https://archive.org/details/2.CHAITANYABHAGAVADGITASankhyaYogam2ndCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/3.CHAITANYABHAGAVADGITAKarmaYogamu3rdCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/4.CHAITANYABHAGAVADGITAGNANAYOGAMU4thCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/5.CHAITANYABHAGAVADGITAKARMASANYASAYOGAMU5thCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/6.CHAITANYABHAGAVADGITAATMASAMYAMAYOGAMU6thCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/7.CHAITANYABHAGAVADGITAGNANAVIGNANAYOGAMU7thCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/8.CHAITANYABHAGAVADGITAAKSHARAPARABRAHMAYOGAMU8thCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/9.CHAITANYABHAGAVADGITARAJAVIDYARAJAGUHYAYOGAMU9thCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/10.CHAITANYABHAGAVADGITAVIBHUTIYOGAMU10thCHAPTERSUNDARACHAITANYANANDA https://archive.org/details/11.ChaitanyaBhagavadgitaVishwarupasandarshanaYogamu11thChapterSundarachaitanyananda https://archive.org/details/12.ChaitanyaBhagavadgitaBhaktiYogamu12thChapterSundarachaitanyananda_201610 https://archive.org/details/13.ChaitanyaBhagavadgitaKshetraKshetragnaVibhagaYogamu13thChapterSundarachaitanyananda https://archive.org/details/14.ChaitanyaBhagavadgitaGunatrayavibhagaYogamu14thChapterSundarachaitanyananda https://archive.org/details/15.ChaitanyaBhagavadgitaPurushottamapraptiYogamu15thChapterSundarachaitanyananda https://archive.org/details/16.ChaitanyaBhagavadgitaDaivasurasampadvibhagaYogamu16thChapterSundarachaitanyananda https://archive.org/details/17.ChaitanyaBhagavadgitaShradhatrayavibhagaYogamu17thChapterSundarachaitanyananda https://archive.org/details/18.ChaitanyaBhagavadgitaMokshasanyasaYogamu18thChapterSundarachaitanyananda